Saturday 31 December 2016





నిన్ను లేపగ వచ్చినారము, నిజముగా కడు   భాగ్య వతివే! 
వన్నెలాడీ! నీదు భ్రాతయె వెన్నునికి ప్రియ సఖుడు గదవే!
ధవళ దోహజ ధారలందున దమము నిండిన నీదు దేహళి
కవల నిలచితి మిహిక ధారల,కనుల బ్రియ సఖు  వలపు జావళి,
పలుకవెందుకె కలికి చిలుకా? వాజసుండన నీకు అలుసా?
వలపు దాచుట నోము    కొరకా? ఫలము దక్కును మనకు దెలుసా?
పడతి సీతను యెగ్గు జేసిన  పాప రావణు దునిమె రాముడు 
గడియ దీసిటు  రమ్ము రాముని కథను గానము జేతుమిప్పుడు. 

Friday 30 December 2016





గోసమెరుగని గొల్ల కులమున, గొమ్మరో!  బంగారు దీవవె,

దాసులము శ్రీ కృష్ణునికి నీ దలుపునిపుడే దెరచి బ్రోవవె,


గోప కులమున బుట్టువారలు, గుశలురే గోదోహదమ్మున,


కోపుతో శత్రువుల మదమును క్రుంగదీతురు   కదనమందున, 


పాము పడగయె నీ నితంబము, వన మయూరివి నీవెగావే,


మా మనోరధమెరిగి మాధవు  మాదు తోడను  గలువ  రావే


నీల మేఘుని  నామమును విని,నీవిదే వత్తువనుకొంటిమె, 


ఉలుకు పలుకునులేక శయ్యను , ఊరకుంటివిదేమి బీరమె? (11)


మాదు నోమిటు లాగి ఉన్నది,మాతరో!  నీ నోము ముగిసెగ, 

నీదు చెంతనె  కృష్ణుడుండగ, నిదురలో నీ తోడు నీడగ,

బదులు పల్కుట పాడిగాదే? పడతిరో! పెను నిద్దురేటికె?

కదలికలె లేవాయెనె?  కుంభ కరణు నిద్దుర బొందనేటికె?



తులసిదాముడు రాము చేతను దోరె యా నిద్రాసురుడు మా

వలపు రాముని యందె, నీవును వచ్చి రాముని బాడు కొమ్మా!

రాగదే ఓ జాతి రత్నమ ! రాగదే అలసతను వీడిటు

వేగ నీరాడగా బోదము, వీడు దలుపులు దెరచు నీవిటు..  


హేమ కాంతులు విరియు గృహమున   ప్రమిదె కాంతుల వెలుగులందున

ధూమ సౌరభ   శయ్య  నిద్దుర తొంగలించదు   పగటియందున

మామ కూతుర!మాటలాడుము,  మారుబల్కని   మరుమమేమే?
 
మా మనోరధ మెరగి నీ  మణిమయపు ఘటికను  దెరువవేమే? 

కరుణ తో మేనత్త! తనయను గారవమ్మున నిదుర లేపుమ,

వెరపు తెలియని అలసటా అది? పలుకలేనిద, చెవిటిదనమా?

మంత్ర మహిమా? కాదు, మాధవు మంత్ర మహిమది దెలియు మనసా! 

మంత్రమదియా! వినుమిదే, మా మాధవా! వైకుంఠ వాసా! (9)



Thursday 29 December 2016

....................
ఎర్రబారిన తూరుపునుగని యెనుములన్నియు మేత వెడలెను,

గుర్రు మానిక రమ్ము, పిల్లల గుంపు మాధవు కొరకు  గదలెను, 
నిన్ను గలవగగోరు కృష్ణుడె, నీదు తోడుత మేము బోదుము,

వెన్నుడను వాయెత్తి బాగుగ, వేడి యాతని  మనము గొలుతుము,


తురగ రూపమునందు జంపగ దొడిబడిన దానవుని దునిమెను,


దురిత కంసుని మల్ల యోధుల దొసగు దెలియగ, మదమణంచెను


దేవతలకధినాధుడాతడు   దెలిసి బలుక, మనల  విడువడిక,


మా వినతి విను బ్రియ  సకియరో! మాధవుని సేవింప రమ్మిక. (8)

Wednesday 28 December 2016

గూడు విడచెడు వేళ బులుగుల గోల వినబడదేల సకియా? 
వేడుకను నిదురించ జాలిక, వేకువాయెను మంకు చెలియా!
కడియములు గాజులును మ్రోగెడి గలగలల సౌరభములీను, ప
సిడి గురియు గొల్లెతల ముచ్చట, జెవుల జేరద నీకు నిపుడు, ప
విత్రమౌ నారాయణామృత వినిమయము గురుతించ వెరపా? 
మిత్రురాలా!కేశి దునిమిన మేటి కేశవు బొగడ మరపా? 
మాదు గానము నీకు నేడగు మధురమౌ పవళింపుబాటగ? 
 కాదు కాదిటు రాగదే, చెలి,గడియ దీయుము, వాణి మీటగ ! (7)



Image may contain: 2 people, indoor

Tuesday 27 December 2016

పీలులవిగో నరచుచున్నవి  భూరి శంఖద్వనుల వినుడే 
చల్ల నవ్వుల విషము  గుడిపిన శఠత దునిమిన బుడతడితడే 
నీల గాత్రుని చేత జచ్చెను   నీచ శకటాసురుడు,  వినుడే, 
వేల నమరుల స్వామి గా వేవేతలల ఫణిశాయి గనుడే,
పలుకువాలుల కీర్తనమ్ముల  వారిశుడు వేదార్థ తనుడే, 
మెల్ల మెల్లగ గనుల విప్పుడె, మినుకుటూర్పులవానిబొగడుడె,
మేలు మీకగు సకియలారా! మెలపునందగ వాని జూడుడె.



Saturday 24 December 2016

మాయ నేర్చిన బాలకుండుగ  మాటలాడుట జాల నేర్చెను, 
చేయ సాధ్యముకాని పనులను,చిన్నతనమున  జేసి చూపెను,
నాయమౌ తన దల్లి కుక్షిని  నాణ్యముగ  బంధించ నవ్వెను
మేయ  హృదయ సుమమ్ము నాతని మితిమరచి  కీర్తించ నెపుడును  
దాయమౌ పాపమ్ములన్నియు దగ్ధ తూలము లౌను స్మరణను.(5)

Friday 23 December 2016

వరుణ దేవా! కురియు నిండుగ, వనధి లోతుల మునిగి లేవగ,

నిరాకారము వరకు జేరటు నీట నేలను దడిపివేయగ

సర్గ కార్యారవము   బెరుమాళ్ శ్యామలుడవౌరీతి మెరవగ

మెరిసి బీటల నేల తదుపరి మెల్లనురుముచు గురియు మెండుగ. (4)











ఉన్నపాటున  ఊహకందక యుర్వి నిండిన    వామనుని మన
 మన్ననల వ్రత మూలమున మహి మల్లడిని దొలగించ వేయన
చెన్నుగా మూడొకటి వానల జీవ సస్యము లీయవే యన 
  ఎన్నగాదగు పాడి పశువుల నీగదే సుమ మధుపములయన  (3)
తామసము విడనాడగావలె, ధరణి సుఖమును గోరగావలె,


సోమగర్భుని పాలకడలిని గోరి  యడుగుల గొలవగావలె


సూమ ఘృతములు అంజనమ్మును, సుమములన్నిక విడువగావలె,


నేమముల సమయముల దానము నేమరక నిక మెలవగావలె. (2) 



మార్గశిర మాసమ్మునందున  మాధవుని గీర్తించి బాడగ,


తరలి రారిటు రమణులందరు, తరుణమిది నీరాడి వేడగ,


మురళి నూదుచు నంద తనయుడు ముదము  బిలిచెను సాదరమ్ముగ


ధరుడె మురళీధరుడు,  రమ్మిక తరలి పోదుము దోడు  నీడగ. (1) 



Wednesday 21 December 2016


శార్దూలవిక్రీడితము



శ్రీరంగేశుని లీలలన్ దెలియుచో   చిత్తంబు బర్వెత్తుగా  
సారంగంబును(1)వోలె సారములకై  సారంగముల్(2) గోరితా 
 సారంగమ్మును(3)వోలె సారఘముకై సారంగమున్(4)బొందగా
సారంగమ్మును(5)వోలె నార్ద్రతను తా  సారంగమున్(6)  జూడగన్.      


సారంగము=ఏనుగు,జింక, తుమ్మెద, తామర పూవు, చాతకము, మేఘము (క్రమంగా)  







వెన్నుని వేణుగాన రస వేగిని క్రీడల సోలిపోవుచున్ 

 కన్నుల గోపభామినుల కౌతుక క్రీడల చిత్ర మాలికల్

జెన్నుగ రూపమొంద దన శేముషి లేఖిని జేతబట్టి తా 

 సన్నుత పాశురమ్ములను సారము దెల్పిన గోద బాడరే
!
వేద పురాణ సారముల బేర్చిన   గాధలయందు మేటియౌ
బోధల భక్తి రీతులను బొందిక  దెల్సిన  విష్ణుచిత్తుడా
మాధవు శ్రద్ధతోడ దన మాళిగ  దేవళమంచు నెంచి యా
రాధన జేసె వక్షమున రమ్యత  నిత్య పవిత్ర  మాల తో 
శ్రీధవు శ్వశ్రు గౌరవము  జేకొనె  లోకములెల్ల మెచ్చగా!  


Tuesday 20 December 2016

కన్నుల కాంతి దప్పె,  బహు కంటక ప్రాయపు బాట దోచెనే,
ఖిన్నుడనైతి కావుమయ కేశవ ! పాశుర సేవలంది,  యా  
పన్నుల బ్రోచుటందు హరి! పారములేదని గోద జెప్పె, యో  
బన్నగశాయి!దుష్కృతపు బన్నగ బాధల నన్ను గాచి నీ 
మన్నన వేల్పు బోనమిడి, మార్గళి సేవల సంతసించుమా! 



వెన్నుని వేణుగాన రస వేగిని క్రీడల  సోలిపోవుచున్ 
   
కన్నుల గోపభామినుల కౌతుక క్రీడల చిత్ర మాలికల్

జెన్నుగ రూపమొంద దన శేముషి లేఖిని జేతబట్టి తా  
  
సన్నుత   పాశురమ్ములను సారము  దెల్పిన గోద బాడరే!   



Monday 19 December 2016

మానవ జీవనమ్మునకు మాన్యత గూర్చెడి వేద ధర్మముల్
మానస  వీణ పై మిగుల  మార్దవ రీతులనాలపించ తా    
మానవ రూపమందు దిగి, మాధురి నింపగు గీత రూపమౌ
తానక పాశురమ్ములను తన్మయమై వినిపించినట్టి యా 
గాన సుధాబ్ధి విష్ణు పథగామిని గోదకు హారతివ్వరే!.




Saturday 17 December 2016

maa ayyagaru: Navarasabharitam Na Telugu Padyam by Dr. Garikipat...

maa ayyagaru: Navarasabharitam Na Telugu Padyam by Dr. Garikipat...: గరికపాటివారి నోట పుట్టపర్తివారి మాట....వీరరస వర్ణన.. కదన ముఖంబునన్, పిరికి కండలు కాననివారు ధీరతా స్పదులగు  భర్తలు ఉద్దవిడి, శాత్రవులన్ చ...

Thursday 15 December 2016

సంధ్యాసమయము
అందముగా నటు

 విరిసిన నింగిని జూడవటే!
 నింగిని విరిసిన
రంగుల  గనియెడి
ప్రమధగణమ్ముల హ్లాదమదే!  
తమ స్వామిని దర్
శించి, తరించి,
మంచిత మనముల దూలుటకై
జయ జయ జయ హే
స్వయంభువా! యని
త్రిలోకములలో  జాటుటకై,
అతల సుతల  విత
ల,తలాతలముల
రసాతలము బ్రకటించుటకై
శితికంఠుని
స్తుతించుటకు సం
సిద్ధములాయెను జూడగదే!
సకల చరాచర
సుఖమును  కొరకై
గరళము ద్రావిన సదాశివా!
అసురుల సంధ్యను
కుశలత నాట్య ప్ర
వంద్యగ  నీవే  మలచితివా!



Tuesday 13 December 2016


సీసం-పూర్వభాగము

నే కపోతము వోలె నేలకొరిగెదనె

మోహజాలములందు    మోసవోయి

అజగరము  వలె    నే నాహార  వాంచతో

  నహరహము మరతు నాదు స్వామి !   
         
   సరఘనై  బవలురే    సంపద గూర్చుటే

  నా ద్యేయమాయె నే ననఘ దత్త!

ఆతాయి నై నేను యాకసమ్ముననుండి 

నీచ ధనము కేసి నెగరి వత్తు, 

తేటగీతి

మిడుతనై  మాడితిని గోర్కె కొలిమి లోన,

మత్స్యమై నెర జిక్కితి మాయ గాదె?

సర్పమై   విష దం ష్ట్రల సంచరింతు,


గావవే   నన్ను గురువరా!  కరుణ తోడ!   


ఉత్పలమాల 
నీదగు నాదు జీవితము, నీదగు నాదు మనంబు, ధ్యానమున్,


నీ దయ లేనినాడు, ప్రభు, నీరవ చాతక  గీతి  కౌదు,   నీ


బోధనె నాదు సర్వ  భవ  మోహ  విమోచన సూత్రమోమహా

  
వేద స్వరూప! దత్త ప్రభు!  వేగమె గావవె గోరి జేరితిన్.






 తేటగీతి(పంచపాది)
చేతులారంగ దత్తు బూజింపరారె, 
నోరునొవ్వంగ బ్రభు కీర్తి నుడువరారె, 
తలచి దలవంగ నంతటే దయనుగురియు,
మువురు దైవత   రూపమై మోక్షమిచ్చు

దత్త స్వామిని గొల్వరే దత్త మదిని.