మాదు నోమిటు
లాగి ఉన్నది,మాతరో! నీ నోము ముగిసెగ,
నీదు చెంతనె కృష్ణుడుండగ, నిదురలో నీ తోడు నీడగ,
బదులు పల్కుట
పాడిగాదే? పడతిరో! పెను నిద్దురేటికె?
కదలికలె లేవాయెనె? కుంభ కరణు నిద్దుర బొందనేటికె?
తులసిదాముడు
రాము చేతను దోరె యా నిద్రాసురుడు మా
వలపు రాముని
యందె, నీవును వచ్చి రాముని బాడు కొమ్మా!
రాగదే ఓ జాతి
రత్నమ ! రాగదే అలసతను వీడిటు
వేగ నీరాడగా బోదము, వీడు దలుపులు
దెరచు నీవిటు..
No comments:
Post a Comment