Wednesday 17 January 2018

Narayani Sahitya Academy, Indore,Madhya predesh




Me rendering my  hindi translation for my revered father's 'SIVATANDAVAM ' before co-poets at Indore, on 16th January, during Sarva bhasha sammelan organised by AKASHAVANI. in connection with Republic day celebrations. 

వేదాంత దేశికుల వారి' గోదా స్తుతి '   శ్లోకానుసరణ

ఆ. సురభిళ సుమమాల సోయగమ్ముల వైజ
యంతిగ గులికెడిది హంసు నెడద
హరి ముకుటముజేరి యలరారు నీ శిర
స్రజము వలన దాని జట్టి దరిగె
జట్టి= విలువ  తరుగు=తగ్గు   (15)
 ఉ  నీదగు పూల మాలికను  నెమ్మిని  తా ధరియించె శౌరి, యా
నాద మదేమిటోయనిన  నవ్య సుధా రస పాన మత్తలై
మోదముతోన తూర్యములు   మోహన రీతుల నాలపించెగా
యాదర భావనమ్ము గడు హంగుగ భృంగములన్ని  గోదరో! (16)
ఉ. నాభి పరీమళమ్మగును నవ్యత విశ్వము దీర్చు బుప్పొడిన్
శోభిలు బంకజమ్మునను,సోముని సోదరి వక్ష గంధమున్
వైభవమందు వారిశుని వత్సము, ఐనను నీదు దామ సం
శోభిత మాలికన్ శిరము వంచి ధరించు నిదేమి భాగ్యమే !!    (17)
ఉ. నీదగు యంగ  వస్త్రమును, నీదగు మౌళిని గుల్కు మాలికన్
నీ దయచేసినంత గడు నీమముతోడను స్వీకరించి నీ  
నాధుడు శీర్ష దేశమున నౌదల దాల్చుటదేమి భాగ్యమో,
తా ధన భాగ్య సంపదల ధారుణి నేలెడి యోగ్యుడాయెగా.  (18)
ఆ. సర్వ గంధుడనును సర్వ శ్రుత్యంతము
నీదు రుంగు కురుల  నీటుదనము
పరిమళమ్ములీను బ్రసవమాలల చేత 
మించు  సుఖములందె  మేలు వేల్పు. (19)
ఆ. ధన్యమాయెనమ్మ ధర్మి మూర్ధమ్ము నీ
కబరి విరులమాల కాయ్వు  దాల్చి  
ప్రేమ మీరు   నీదు   క్రీగంటి చూపుల
నీలి కల్వ మాల వోలె దాల్చు. (20)

(కాయ్వు = ప్రేమ)


Sunday 14 January 2018

వేదాంత దేశికుల వారి' గోదా స్తుతి '   శ్లోకానుసరణ

ఆ . విష్ణు చిత్తు బిడ్డ, విష్ణు చిత్తము నీది 
వలజ   కంజమమ్మ వాణి నీది
చలువరేని బ్రతిగ జలధిజ యనుజగ
సుజనులు దలచేరు  సుగుణవల్లి.                 
(వలజ = భూమి; కంజము = అమృతము)  (9)  
ఉ.. సంస్తుతి  కొంత జేసినను సంతసమొందెడు మాధవుండు నీ
క్షాంతువు   జేసినట్టి శత సన్నుతులేలొకొ  ద్రోసిపుచ్చె, యా
మంతనమేదొ దెల్పు   యజయుండిటు   యాతని మెచ్చుటెట్లు? నీ
దౌ తల  వాసనల్ యడరు తావడ  బ్రాణదు  పూజ చేయుటా (10)
 (క్షాంతువు=తండ్రి) (తావడము=మాల, హారము
ఆ . పశ్చిమమ్ము గూడ పావనంబయ్యెగా
పుణ్య రాశి,నీ ప్రభూతి వలన      
వీడడమ్మ దాను ప్రీతి, రంగేశుడు
నీదువలన నిజమునిదురలోను. (11)
ఆ . పుడమికిచ్చు గోద పున్నెములను నీదు
పేరు పొగెముతోన    నలినములను
గంగ, యమున నదులు గావేరియౌను పా  
వనము మైత్రివల్ల గోదతోను.  (12th )
కం. కోమలి, నీ వలచిన వరు
డీ ముదుకడ? శయ్య బాము,దేరిక వాజా?
మనువెటు? సఖుల బలుకు,     
నీ మధు హాసమ్ము దెలిపె నెమ్మగు వలపున్.. (13)
 (అచ్చు ఆధారంగా సంధియుత మైత్రి) 
తేటగీతి(పంచపాది)
శిరసు ధరియించె నీ ముక్త  మాలికలను
నాథు మస్తక  సౌందర్య   గంధమేచె
ఎడద వైజయంతిని వీడి భృంగములవి
తిరుగుచున్నవి శిరసుపై, జిలుగు మీర
గుఛ్ఛకముతోను  జేసిన గొడుగు  వలెనె. (14) 
 (గుఛ్ఛకము = నెమలిపురి)
 ఆ. సురభిళ సుమమాల సోయగమ్ముల వైజ
యంతిగ గులికెడిది హంసు నెడద
హరి ముకుటముజేరి యలరారు నీ శిర
స్రజము వలన దాని జట్టి దరిగె

జట్టి= విలువ  తరుగు=తగ్గు   (15) 
......................