Friday 13 January 2017

పాల మున్నీటిని  మథించిన పావనుని, మాధవుని పదముల 
వ్రాలి లీలను  మోక్షమందిన భపతి బోలిన గోప కాంతల
కోరికలు దీరిన  కతము గడు గుశలముగ శాయించు లేఖిని, 
భూరి పుదువై బట్టణంబున బొదలుచుండెడి  విష్ణుజిత్తుని  
కొమిరె, శీతల జలజ మాలల గొదగొనెడి శ్రీ  గోద  దీయని           
తమిళ ముప్పది మాలలను  గడు  దన్మయత  బ్రతి దినము బాడిన
దయా దృక్కుల బ్రోచు నాలుగు   ధరములంటి  భుజమ్ములను గల
సుయామునుడా దిరుమలేశుడు, సుయోగమ్ముల బ్రోచు భక్తుల. (30)  

వినుమయా గోవింద మేమిటు !వేకువనె   నీరాడి నీ పద 
వనజముల సేవింపగోరిటు వచ్చుటేలకొ యందువా? చెద
రనిదయా మా బ్రేమ నీదగు రాకయే పున్నెముల బంటని 
యనెదరెందరొ గొల్ల కులమున, మాదు కజ్జము నీదు సేవని,
మాదు  నోముకు ఢక్కలిచ్చుట మాత్రమే గాదయా, ఆపై 
తోడు నీవలె కరుణ జూపుము దొసగులను మన్నించి మాపై
జన్మ జన్మల బంధమై మా స్వామిగా నీవుండవలె,మా  
తన్మయత నీవేనుగా, మా  ద్రవిణముల దొలగించి బ్రోచుమ!   

Wednesday 11 January 2017



గొల్లజాతిని బుట్టినామయ,  గొల్లలుగ బాలిచ్చు బశువుల  
నల్లదిగొ మేతకై బ్రేమతొ, నడవులను గొనిపోయి, బ్రోవుల 
తిండి దినెదము, నెంతమాత్రము దెలివిదేటలు లేవయా నీ
వుండుటయె మా గులమునందొనగూడి వచ్చిన భాగ్యమౌ నీ 
గుణగణమ్ముల నెరుగకయె నిను గూడితిమి మావాడవనుకొని
వినుమిదే బలు చిట్టి బేరుల బిలచితిమి ప్రేముడిని  చేగొని, 
నీవె శరణము, నీదె భారము, నీవె నివ్వగవలయు ఢక్కలు, 
నీవు గోవిందుడవు గావున  నీయుమయ,   వ్రత సాధనమ్ములు.(28)

Tuesday 10 January 2017

నిన్ను గూడని వారి గెలచుట, నీకు, గోవిందా, సులువెగా,
నిన్ను బాడిన పిదప ఢక్కయు, నితర నీప్సితములును దీరుగ, 
పాడి మెప్పును బొందెదము నీ వైభవము లోకములు మెచ్చగ,
వేడుచున్నామయ్య మావగు వేడుకల దీర్చుమని బొలుపుగ,
పైడి పూవులు, గంకణమ్ములు,పైడి చెవిపూవులును గావలె,            
పైడి కమ్మలు గావలెను మరి పాదముల పట్టీలు గావలె,
నూతనాంబరములను గట్టి తనూపమది జేతులను గారగ,
నేతి పరమాన్నంబు దినెదము  నేతి గాధల నిన్ను బొగడగ.  (27)

Monday 9 January 2017




నీల మణి యో వ్రజ కిశోరా!  నీకు సతత జయమ్ము  గావలె,      
వేళ మార్గళి, నోముకొరకై, వినుము, నుపకరణముల నీవలె,
పాల నురగల బోలు నీదగు పాంచజన్యము వంటి శుక్తులు,
నేల నింగిని మ్రోయు లాగున  నీయగావలె జాల ఢక్కలు,
పాడగా గాయకులు గావలె  పదుగురును  బల్లాండు బాడను
దొడ్డవగు దీపములు ధ్వజముల దోడు నితర వితానమునులును
నీవెగా వటపత్రశాయివి, నీదు లీలలు దెలియు, బాగుగ,  
నీవె మా నోమునకు ఫలమవు, నీదు కృప నీడేరు, వేడగ.   (26)





పుడమిపై నొక నాటి యామిని బుట్టితీవొక దల్లి గడుపున,
వడినిగూఢము  రేయి వెడలితి గొడుకవగ  వేఱొండు గడపన
మండిపడి నలిబెట్టగా చింతించసాగెను మూర్ఖుడొక్కడు
గుండెలోనొక మంటగా నిను గంటకమ్ములు బెట్టె గుంఠుడు 
ప్రణయమే నీవైతి నీ పద పంకజములే మాకు శరణుగ 
వినయమునవచ్చితిమి  నోమున విభవ బరికరములను గోరగ
నెమ్మి మాపై జూపుమయ్యా, నీదు చరితమె మాదు స్తోమము 
సమ్మదమ్మున మాదు దప్పుల సైచి,మము నిను బాడనివ్వుము. (25)

Saturday 7 January 2017

వామనుండై భరణి గొలిచిన పదమునకు మంగళంబనుడీ 
యామి రాజు నడంచిన హళా హళికి  శుభ మంగళంబనుడీ
వహన దనుజుని రూపుమాపిన వాసికిదె  శుభ మంగళమ్ముగ  
రహిని ఇర్వురు రక్కసుల పేరడచునంఘ్రికి మంగళమ్ముగ 
కరువ గొడుగుగ ప్రజల దా కాపాడు దయకిదె మంగళమ్ముగ
పరగ శత్రుల నాశమే   పని  భల్లమునకును   మంగళమ్ముగ
వచ్చితిమి నిను బొగడ నీదగు బలము దేజము వర్తనమ్మును, 
ఇచ్చి బ్రోచుమ నీదు కృప నీ ఏడుగడ నీ సౌహృదమ్మును. (24)
ముఖ పుస్తక సహృదయ  మిత్రులందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు.. .



వానకారున మగటిమిని యా బరువతపు గుహరమ్ములందును
బాణముమియుడు జూపులను తా ప్రస్తరించుచు  దిక్కులందును    
తేనుచూ గడకాలు మడయుచు తీరికగ నిగిడించి  నొడలును
నేనుగా రారాజు నడవికి  నన్నటుల గర్జించి జూలును 
వేగముగ విదలించి, నిలుచుని, బెను హఠికమున దా వెడలినటు, 
వేగముగ నతసీ సుమాంగా! వెడలి  సిం హాసనముపైనిటు 
గూరుచున, గోవెలను వెడలుమ,గోమలుల మా రాక నెరుగుమ,
కారియములను దెలసికొని, మా గెలసమును  పొసగించి బ్రోచుమ. (23) 

Thursday 5 January 2017





దుడుకుదనమును గర్వమును  విడి దండుగా నేతలదె జేరిరె 
గడగడల, నీ శయ్య క్రిందను గరుణ గోరుచు నిలచి యుండిరె
మానమభిమానముల విడి నిను మమ్ము మన్నన జేయుమంచును,
దీనముగ  బ్రార్థించి  వేడ బిరానవచ్చితిమీసమయమున
పెదవులా అవి, సగము విచ్చిన బిసరుహమ్ములు చెలి బొడగవే 
సదయుడా! చిరుగజ్జె బోలిక సలికముగ నీ గనులు విప్పవె?
చందురుని జల్లనౌ కాంతుల , చండకరు బిచ్చలపు జూపుల
డెందముల ప్రసరించవే! మాటివ్వవే నీ గమల కరముల..(22) 



  • ఘటములందున క్షీర వర్షము, గయము ధేను హిరణ్య హర్షము 
  • పటుతరము విక్రమము నందుని  వత్సుడవు నీదే ప్రకర్షము,
  • స్థేమమే రూపమ్ము గాగా, శేషిగా వేదమ్ము పొగడగ, 
  • భూమమున నిట  గోపకుల బెను  పొలపముగ వెలిగితివి నిండుగ
  • శాత్రవులు తమ బలము మరచిటు సరబడిని నీ రాక వేచిరి 
  • పత్రముల  తాకిడికి నీ పస  భయము  చరణము శరణు వేడిరి,  
  • మాదు మనములు నీదు సద్గుణ మహమునకు శరణనుచునున్నవి
  • నీదు గుణ గానమ్ము లోకము  నెనరుతో దరియింపమన్నవి. (21)


వేలుపుల ముప్పదిని మూడును వేలముల వేదనలు బాపే
ఏలుబడి,పిలుపునకు మును వాజినముతో కాపాడుదీవే! 
సత్య వాక్పరిపాలకా, ఇక జాలు నిద్దుర లేవవయ్యా!
ప్రత్యనీకుల నిత్య బాధక,పౌంస్య వల్లభ, రాగదయ్యా!
పూర్ణ కుంభ కుచమ్ములును యంబోధి వల్లభ రదచ్చదములు
శీర్ణ కటి తో హరిసతీ, దయసేయవే, దీయగా దలుపులు
వీవనివ్వవె,ముకురమివ్వవె, విభుని మాతో గలువనీవే!
దీవెనలతో మమ్ము నీ ప్రియ ధవునితో నీరాడనీవే! (20)

Wednesday 4 January 2017

నాగదంతపు కోళ్ళ శయ్యది, నయన సుందర దీప స్తిభినులు
భోగ యాగపు తూల శయ్యను, పూల గుత్తుల శిఖా హేలలు
చక్కదనముల స్వామి! సిరి శ్రీ జాని వక్షస్థలము నుండగ
ఒక్కటైనను మాట చక్కగ నోయని పల్కు నూరడింపుగ 
అంజనాక్షీ! తెల్లవారెను, నా వ్రజవరుని లేవనీవే! 
తేజరిల్లెడి మోము వానిని దీనులము మము జూడనీవే! 
వదలి స్వామిని నిముసమైనా పద్మినీ! నీవుండలేవా? 
కదలవే, కూడదే, వెన్నుని కౌగిలిని విడు, లేవనీవా? (19)










మదగజమ్ములనేకములు దన మందలో గల నందగోపుడు 
మదముగల శత్రువుల భుజ స్తోమమున తానోడించు నాతడు,
గుణములకు పెన్నిధగు నందుని గోడలా! సౌందర్య రాశీ! 
మనవి విను సౌరభాలక! మామాధవు దయా వారిరాశీ!
కోడి కొక్కొరొకోలు,మాధవి కుంజముల కోకిలల స్వరములు
చెండు బట్టిన ముద్దుగుమ్మా! సేయవలె హరి కీర్తనమ్ములు 
గలగలల గాజుల రవములను ,కమలపాణీ! గడియ దీవలె,
తళతళల భువి మెరయుచున్నది దామినీ ! ధవు జూడనీవలె. (18)

Tuesday 3 January 2017



అంబరమ్ములు, త్రాగునీరాహారమును గడు దానమొసగెడి,
ఎంబెరుమాళు   నందగోపుల యేలికకు మేల్గొల్పు బాడుడి.
చక్కదనముల  కొలువు అతివల జాతికే నవ దళమువమ్మా.
చొక్కనౌ  గోకులపు నవలా  జ్యోతి,లేవవె యశోదమ్మా!
పెరిగితీవు నభంబువరకా రెండడుగులనె   గొలచినావే? 
మరచినావా? రాక కారణమా దినమునె,  బరుండి లేవే?
వెన్నదొంగకు అన్న,సాత్వత! పిన్నవారల గావుమయ్యా!    
విన్నపమ్మిదె, పసిడి కడియపు పెబువ!నిద్దుర లేవుమయ్యా! (17) 
...................

 . .
తోరణమ్ములు ధ్వజములతొ బంధురమ్మౌ  తిరుమాళిగే గా , 
రారె, ఇది మన  నందగోపుల వారి నవ్య నివాసమేగా. 
'నంద నాయకు కోవెలను సానందముగ గాపాడు దేవా!
అందమౌ మణి  ఖచిత ద్వారపు యంత్రమును  దయ  దెరువలేవా?'
'హితముగాదుగ రాత్రులం,'దా హేతువులు మేమెరుగమయ్యా'
'ఇతము?' ' వెన్నుడు  నోము సాధనలిత్తు రమ్మని బిలచెనయ్యా'
'పవలు రాగదె?' ' వెంబడించెను పలుగు నిన్ననె  దీసుకొమ్మని
యవన శత్రుని లేపవచ్చితి మీవు బీగముదీయు గరుణను'. (16)




Monday 2 January 2017





ఎంత చిత్రమె, లేత చిలుకా?లేవవెందుకు ఇంతవరకును?' 
 'ఎందుకే బొగడెదరు వచ్చెద నిపుడె,' 'వేచెదమంతవరకును',
కట్టుకథలను వింటిమమ్మా, కానుపించవె, త్వరగ కొమ్మా,'
వట్టిమాటలు చెప్పనేటికె', 'వచ్చితిని, గేలేలనమ్మా?
విరహమే నా శాపమౌగా, పెడసరపు మాటలును మీవిక!
మీరలందరు?' 'జెప్పనేరము మేము, లెక్కిడ నీవె రమ్మిక.' , 
'ఇదిగిదిగొ నే వచ్చుచుంటిని, యేమి జేయగవలెనొ జెప్పవె,'
'దానవుల, కుంజరపు మదమును దమించిన మాయావి నెరుగవె?' (15)



మాటకారీ! చేతలేవే? మౌన ముద్రను వీడవేలే?
నీటిపుట్టువు విచ్చుకొన్నది,నీలి కలువలు వాడెనేలే? 
మీదు పెరడున యున్నదే  యా మీన గోధిక జూడ వేలనె?
 మాదు మాటల నమ్మవా?  కువ  మణీచకములు వాడెనేలనె?
ధాతు శాటి ధరించి తెల్లని దంతముల యోగులదిగోనే,
జాతవేదుని గుడిని వేకువ శంఖ సేవల కోసమేనే,
మాట దప్పెద వేల నోముకు మమ్ము బిలిచెదనంటివేలే? 
 కైటభారిని,చక్రధారిని,కమలనేత్రుని  బొగడ వేలే?  (14th) 

Sunday 1 January 2017




        చీల్చివేసెను బకాసురునా జిష్ణుడాతని ముక్కు రెండుగ,
 గిల్లె రావణు  పదితలల నొక కేలి గోటితొ రాముడొంటిగ,
       రామలందరు జేరినారటు రామ కృష్ణుల బాడుకొంచును
నోము నోచుట మరచినావా? నోరుదెరువక మెదలకుండను,  
       శుక్రతారదిగో గగనమున, సూర్య కిరణపు కాంతి గనుమా!
వక్ర బుద్ధులు మాను, బుధుడటు వెడలినాడే, ముద్దుగుమ్మా!
       లేవవెందుకె తోయజాక్షీ? లేమలందరు గూడినారటు,
 నీవొకతెవే ఇంకనింటను నిదుర మగతను  వీడి రమ్మిటు.. (13) 


,,,,,,,,,,,,,,,,,,,,,,,,,