వానకారున మగటిమిని యా బరువతపు గుహరమ్ములందును
బాణముమియుడు జూపులను తా ప్రస్తరించుచు దిక్కులందును
తేనుచూ గడకాలు మడయుచు తీరికగ నిగిడించి నొడలును
నేనుగా రారాజు నడవికి నన్నటుల గర్జించి జూలును
వేగముగ విదలించి, నిలుచుని, బెను హఠికమున దా వెడలినటు,
వేగముగ నతసీ సుమాంగా! వెడలి సిం హాసనముపైనిటు
గూరుచున, గోవెలను వెడలుమ,గోమలుల మా రాక నెరుగుమ,
కారియములను దెలసికొని, మా గెలసమును పొసగించి బ్రోచుమ. (23)
No comments:
Post a Comment