నవ వసంతము, నవ వసంతము,
ఎదుట నిలిచెను నవ వసంతము,
నిలచి నవ్వెను నవ వసంతము...
సంజె వొడి కెంజాయ సొగసుల
మంజరీ సౌరభము నలదుచు,
అందియల చిరు సవ్వడులతో,
కందువై, కిల కిలగ నవ్వుచు...
నవ్యరాగము మోడులందున,
దివ్య గానము గాగ పలికీ,
కొమ్మ కొమ్మన కొత్త పూవుల
తేరులే కొలువైన రీతిగ....
వన్నె వన్నెల పరికిణీలతొ,
కన్నె కాటుక కనులు త్రిప్పుచు,
చిన్ని నవ్వుల ఒలకబోయుచు,
కదలి వచ్చెడు కన్నియలవలె...
పుట్టపర్తి నాగపద్మిని
padminigaru mee navavasantamu viriyinchina kottapoovula sugandhamunu moorkonnamu.
ReplyDelete