Tuesday 29 September 2015

maa ayyagaru:  'మరపురాని మధుర గాధ' 'మరపురాని మధుర గాధ'    ...

maa ayyagaru:  'మరపురాని మధుర గాధ' 



'మరపురాని మధుర గాధ' 

   ...
:  'మరపురాని మధుర గాధ'  'మరపురాని మధుర గాధ'     విజయనగర సామాజిక, చారిత్రక విశేషాలెన్నో వెలువరించే యీ గ్రంధాన్ని,...

Thursday 24 September 2015

maa ayyagaru:     ఇటీవల గోదావరి పుష్కరాల సమయంలోనూ, అటు మక్కా లోన...

maa ayyagaru:     ఇటీవల గోదావరి పుష్కరాల సమయంలోనూ, అటు మక్కా లోన...:     ఇటీవల గోదావరి పుష్కరాల సమయంలోనూ, అటు మక్కా లోనూ జరిగిన ప్రమాదాల గురించి రకరకాల వ్యాఖ్యానాలు వస్తున్న నేపథ్యంలో..          ...

అమరచింత (అమ్మాపూర్) సంస్థానాధీశుల ఇలవేల్పు అయిన కురుమూర్తి స్వామికి ముక్కెర వంశస్థులైన రాజా సోంభూపాల్ 15వ శతాబ్దంలో బంగారు ఆభరణాలను సమర్పించారు. శంఖుచక్షికాలు, కిరీటం, మకర కుందనాలు, భుజ కిరీటాలతో సహా వివిధ ఆభరణాలు ఈ స్వామి వారికి బహుకరించారు. నాటి నుండి నేటి వరకు ఆ ఆభరణాలను స్వామివారికి ఉత్సవాల సందర్భంగా అలంకరించడం ఆనవాయితీగా వస్తోంది.
స్వామి వారికి ప్రతి ఏటా బ్రహ్మోత్సవాలు జర్గుతాయి. వీటిలో ఉద్దాల ఉత్సవం అనగా పాదుకలను తయారు చేయడం ప్రధాన ఘట్టం. రాయలసీమ నుంచి తెచ్చిన ఆవు చర్మంతో వడ్డేమాన్ గ్రామంలో చర్మకారులు వారం రోజులు శ్రమించి పాదుకలను తయారుచేస్తారు. ఉత్సవం రోజున పాదుకలను ఆంజనేయ స్వామి ఆలయం దగ్గర పూజిస్తారు. కొండ దిగువన పాదుకలకు స్వాగతం పలికి కాంచనగుహ లోని కురుమూర్తి సన్నిధికి చేర్చి ఆ తర్వాత ఉద్దాల మండపంలో అలంకరిస్తారు. మండపంలో ఉంచిన పాదుకలతో తల, వీపుపై కొట్టించుకుంటే పాపాలు తొలిగిపోతాయని భక్తుల నమ్మకం.
పేదల తిరుపతిగా ప్రసిద్ధమైన కురుమూర్తి దేవాలయంలో వర్ణవివక్షకూడా లేదనే చెప్పాలి. స్వామి వారి పాదుకల ను వడ్డెమాన్‌లోని ఉద్దాల కార్పోగారంలో రా యలసీమ ప్రాంతం నుంచి సేకరించిన నాణ్య మైన ఆవు చర్మంతో పాదుకలను దళితులు తయారు చేస్తారు. దీపావళి అమావాస్య రోజు నుంచి 7 రోజుల పాటు నియమ నిష్ఠలతో ఉపావాస దీక్షలతో స్వామి పాదుకలు ఉద్ధాలు చేస్తారు. వారి పూజలు అనంతరం ఉద్దాలను ఊరేగింపుగా కురుమూర్తి దేవస్థానానికి తీసుకెళ్తారు. ఉద్దాల మండలంలో దళితులే అర్చకులు. ఇది చాలా అరుదైన విషయం.
ఉద్దాల ఉత్సవంలో స్వామివారి పాదుకలను తీసుకు వడ్డేమాన్‌కు చెందిన మేదరులు ప్రత్యేక చాటను తయారు చేస్తరు. దీపావళి అమావాస్య రోజు చాట తయారీ ప్రారంభిస్తరు. ఉత్సవం నాటికి పూర్తి చేసి దళితులకు అందజేస్తరు. దాంతో స్వామికి దళితుల సేవకు శ్రీకారం పడుతుంది.కురుమూర్తి స్వామి సన్నిధిలోని మరో ఆచారం మట్టికుండ. అప్పంపల్లికి చెందిన కుమ్మరులు దీనిని తయారుచేస్తరు. ఆ మట్టికుండను ‘తలియకుండ’ మండపంలో ఉంచి, నెల్లి వంశస్థులు పూజలు నిర్వహిస్తారు. ఆ సమయంలో భారీగా బాణసంచా కాలుస్తారు. డప్పు వాయిద్యాలతో మట్టికుండను ఉద్దాల మండపం వద్దకు చేరుస్తారు.
తిరుమలలోని ఏడుకొండలపై వెలసిన శ్రీవేంక స్వామికి ‘అలిపిరి మండపం’ ఉండగా ఇక్కడ కురుమూర్తి శ్రీవేంక స్వామి వారికి ‘ఉద్దాల మండపం’ ఉంది.
తిరుపతి లోలాగే ఇక్కడా విఘ్నేశ్వరుడి విగ్రహం లేదు.
తిరుపతిలో వలె ఇక్కడ కూడా ఏడు కొండల మధ్య వేంకటేశ్వరుడు కొలువై ఉన్నాడు
తిరుపతిలో వలె ఇక్కడా స్వామి నిలుచున్న భంగిమలో ఉన్నాడు.
తిరుమల కు మెట్లపై వెళ్ళేటప్పుడు శ్రీపాద చిహ్నాలు ఉన్నట్లుగానే ఇక్కడా ఉన్నాయి.
తిరుపతిలో దర్శనానికి వెళ్ళేటప్పుడు ‘మోకాళ్ళ గుండు’ పేర్న ఎత్తయిన కొండ ప్రాంతాన్ని పోలిన ప్రదేశం ఉంటుంది. కురుమూర్తి దర్శనానికి వెళ్ళ్తున్నప్పుడు అలాంటిదే కనిపిస్తుంది.
శేషశైలంలో స్వామి వారికి అలిపిరి మండపం లాగే ఇక్కడ ఉద్దాల మండపం ఉంది.[5]
ఇక్కడ కూడా ఆ స్వామి ఏడు కొండలపైనే కొలువుదీరడం విశేషం. ఆ కొండల వివరాలు...

శ్వేతాద్రి (బొల్లిగట్టు), (శ్వేత వర్ణం అంటే తెల్లని అద్రి అంటే కొండ, వాడుకలో బొల్లి అనేది కూడా తెలుపుకే వాడతారు)
ఏకాద్రి (బంటి గట్టు), (ఏక అంటే ఒక్కటి అని దానినే వాడుకలో ఒంటి అని కొండను గట్టు అంటున్నారు)
కోటగట్టు,
ఘనాద్రి (పెద్ద గట్టు),
భల్లూకాద్రి (ఎలు గులగట్టు), (భల్లూకమూ అంటే ఎలుగ్గొడ్డు లేదా బేర్)
పతగాద్రి (చీపుర్లగట్టు),
దైవతాద్రి (దేవరగట్టు)...
అనే ఏడు కొండల్లో దేవతాద్రి అని పిలిచే దేవరగట్టపైనే కురుమూర్తి వేంకటేశ్వర స్వామి కొలువై విరాజిల్లుతున్నారు.
......................
       
 కురుమూర్తి శ్రీనివాస విషయకంగా ( ఇప్పటి పాలమూరు జిల్లా) 
 మా ముత్తాతగారు (అమ్మ శ్రీమతి కనకమ్మగారి తాతగారు) శ్రీమాన్ ధన్నవాడ కిడాంబి రాఘవచార్యగారు, (శ్రీమత్సకల జగజ్జేగీయమాన

విద్వత్కవిమణీత్యాది బిరుదాలంకృతులు, ప్రొద్దుటూరు వాస్తవ్యులు) కీర్తి శేషులు సవై రాజా శ్రీరామ భూపాలరావుగారిస్మృత్యర్థం, వారి శ్రీమతి, శ్రీమద్రాణీ సవాయి భాగ్యలక్షమ్మ బలవంత్ బహాదుర్ గారి ఆజ్ఞతో,(ఇలాగే 

ముద్రింపబడింది)   కృతజ్ఞతలతో ప్రొద్దుటూరు శ్రీజానకీముద్రాక్షర శాలలో, 1934లో  'శ్రీనివాస పాదుకార్పణ నాటక ప్రబంధం'( సంస్కృతంలో ఆరు 
అంకములు),లక్ష్మీధ్యాన సోపాన స్తుతి (సంస్కృతం),లక్ష్మీమంగళ స్తుతి (సంస్కృతం) మణివిద్రుమహారము(ఆంధ్ర కావ్యము)లను (ఒక సంకలనముగా)ప్రచురించారు.సవై రాజా శ్రీరామ భూపాలరావుగారు, అమరచింతాత్మకూరు సంస్తానాధీశ్వరులప్పట్లో! మా ముత్తాతగారు కాశీ పండితులు! గజారోహణ గౌరవాన్నందుకున్నవారు కూడా!
...........................
        వారి ఇతర రచనలుగా పేర్కొనబడిన గ్రంధాలు: 1.తర్క విషయ క్రోడ

 పత్రం 2.గురు మౌఢ్య కాలిక యజురుపాకర్మ నిర్ణయహ 3.ధాతుకారికాహ 4.అద్వైత పద సమర్థనం 5.అష్తవధాన వదనిరాకరణం

 6.సముద్ర తరణ దూషణం 7.అలంకరానుగమహ 8.విద్యాపదార్థోపన్యాసహ 9.బహువిద్యాయౌగ పద్యసాధనం10. విగ్రహారాధన సమర్థనం
 11. శ్లోకోపన్యాస చతుష్టయం.(శాస్త్ర విషయక గ్రంధాలుగా పేర్కొనబడిన

 గ్రంధాలలో కొన్ని)

ఇక రూపక గ్రంధాల జాబితానుంచీ కొన్ని1.శ్రవణానంద నామక ప్రేక్షణీకం 2.సంసృతోత్కర్ష వంవాదహ 3.మాణిక్య నగర వైభవం ప్రేక్షణీకం 4.నారాపుర
 వేంకటేశ్వరోత్సవాదర్శం 5.కోదండ రామోత్సవ పద్యావళీ
6.శ్రీరామ పట్టాభిషేక పద్యావళీ 
........... 

  వారి కొన్ని శ్లోకాలు:

                  శ్రీవృషాద్రిపతేర్నిత్య క్రీడోత్పత్యేక హేతవే,
                 కస్త్యై చిదద్భుత జ్యోతిహి పరిణత్యై నమో నమహ .....


                 సంప్రీణాతి ప్రపద యుగళం ప్రాప్యమేహృన్మరాళహ 
                క్షొణీపుత్ర్యా విహరతి నఖ స్నిగ్ధ రోచిస్స్రవంత్యాం 
                 బ్రహ్మేంద్రాది త్రిదశ వనితా మౌళి మాణిక్య మాలా,

                 రోచిర్వీచిస్స్రుజతి సతతం యత్ర లాక్షారసాభం..... 

               నానారత్నవ్యతికర కనత్కంచుళీ  జాత శోభౌ 
               ముక్తా దామ ప్రకర శబల శ్రీహితౌ లోక మాతుహు 

               వక్షోజాతావధరితవయో జాతకోశౌ మురారే
               శృంగారాబ్ధి ప్లవన కలితౌ హేమ కుంభౌ ప్రతీమహ ............

      
              నేత్రద్వంద్వ స్ఫుటదళరుచం స్మేర కాశ్మీర రేఖా 
              మాధ్వీరమ్యం వదన కమలం భాతుచేతస్సరస్యాం
              భృంగాయంతే యువకులమణేర్వక్త్ర పాధోజదేశే 
              సాభిప్రాయస్మిత సబళితా యత్ర జతాహ్ కటాక్షాహ్ ..........


             గుంభితాసుషమాలైషా దశభిశ్లోక మౌక్తికైహి 
             వినిక్షిప్తాహ శ్రియహ్ కంఠేతనోతు మనసే ముదం..


                                                       (లక్ష్మీధ్యాన సోపాన స్తుతి నుండి)
.........................

Tuesday 22 September 2015

                       ఆటా-పాటా 

 చిన్నప్పుడు కడప మోచంపేటలో, మేము అద్దెకున్న గుడిపాటి అవ్వ ఇంటి 
యెదురింట్లో యీ ఆటను తెల్లవార్లూ ఆడటం చూసీ నవ్వొచ్చేది.(అసలీఆటనలా తెల్లవార్లూ ఆడటమూ 

మంచిదికాదనేది మా అమ్మ) కానీ, శివరాత్రి మేలుకోవటానికి భలేగా పనికొస్తుందీ ఆట! వామనగుంటలు కూడా 

నాకు భలే ఇష్టం. ప్రతి యెండాకాలంలో చింతపిచ్చలకోసం రోడ్ల వెంట తిరిగి తిరిగి నిధిలాగ పోగేసేదాన్ని. మా

 కరుణక్కయ నన్ను అడిగింది-నాలుగైదేండ్ల క్రితం-'తిరుపతిలో గోవిందరాజస్వామి గుడి దగ్గర దొరుకుతుందట యీ 

వామనగుంటల పీట తెచ్చివ్వు-నీవు కామెంటరీకి వెళ్ళీనప్పుడు' అని..మనుమరాళ్ళతో ఆడటానికి! తనకైతే 

తెచ్చిచ్చాను కానీ నేను తెచ్చుకోలేదు. 'మళ్ళీ చింతపిచ్చలెక్కడ యేరుకుని రావాలబ్బా' అని..నేను ఇండియా

 వచ్చేముందు, అమెరికాలో మా అమ్మాయి తనదగ్గరున్న వామన గుంటల పీట చూపించింది. దాంట్లోకి వాడే ప్లాస్టిక్ 

గోలీలతోసహా! యెంతబాగుంది కదా, చింతపిచ్చలతో పనిలేకుండా, ఆధునిక పరికరాలు,ప్లాస్టిక్ గోలీలు చింతపిచ్చల్లా 

పురుగుకూడా పట్టనివి కదా మరి.యేమైనా మాడ్రన్ బుర్రల తెలివినికూడా ఒప్పుకోవాల్సిందే! యెంతొ 

సంతోషమైంది. ఫోటో కూడా తీసినట్టే గుర్తు. యెక్కడో మిస్ అయింది. ఆట ఆడే పద్ధతికూడా మర్చిపోయానులెండి. 

గుర్రం, యేనుగు, లిబ్బి(చింతపిచ్చల లిబ్బి (నిధి) లెండి) ఇలా కొన్ని (పారిభాషిక) పదాలు మాత్రమే గుర్తున్నాయి

 మరి..ఐనా అక్కడి పిల్లలకీ ఆటలు అంతగా నచ్చవు కదా! యెప్పుడూ ఆ టాబ్లెట్ పట్టుకునే ఉంటారు. యీ వేసవిలో

 మా వాడు బైట బాగానే ఆడుకున్నాడులెంది- తన స్నేహితులతో! మొత్తానికి లక్ష్మీదేవిగారూ!

 'గుర్తుకొస్తున్నాయీ.'..అని పాడుకోవాలనిపించే పోష్ట్ మీది సుమా!
కడపలో బుగ్గొంక అని ( మా రామకృష్ణాహైస్కూల్ దగ్గర) చిన్న యేరు 


పారుతూ వుండేది మా చిన్నప్పుడు!అక్కడ నీళ్ళలో నీటితాకిడికి వొరుసుని

 కాబోలు, భలే భలే రాళ్ళు దొరికేవి. అప్పుడప్పుడు లెత నీలం, లేతాకుపచ్చ

గచ్చెనకాయలు ఆడేందుకు, గుండ్రంగా మంచి షేప్ లోకి వాటిని తెచ్చెందుకు

మళ్ళీ గోడకేసో గరుకు నేల మీదో వాటిని అరగదీయటం! అబ్బో! పేద్ద పని!

వాటిని స్కూల్ కి తీసుకెళ్ళి చూపించి, స్నేహితురాళ్ళ మెప్పు పొందటమూ

ఒక థ్రిల్ల్. యెంత పైకెగిరేసి పట్టుకుంటే, అంత గొప్ప!రక రకాల

పద్ధతులుండేవి ఆడటంలో. ఒక రాయి పైకెగరేసి, కిందనున్న నాలుగు

రాళ్ళనూ గబుక్కున పిడికిట్లొకి తీసుకోవటమూ, తరువత, మూడు రాళ్ళు,

రెండు రాళ్ళూ, ఒక రాయీ- మెలేసి పట్టుకొవటం, వేళ్ళసందులనుంచీ

వొడుపుగా పట్టుకోవటం ఇంకా చాలా అంశాలుండేవి. ఆట అంతా ఆడెందుకు

చాలా సమయం పట్టేది. గెలుపు వోటములు యెలా నిర్ణయించేవారో గుర్తు

రావటంలేదుకానీ, గంటలు గంటలు గడిచిపోయేవీఆటలో! మొత్తానికి

లక్ష్మీదేవిగారు యీ ఆదివారాన్ని నిజంగా ఆటవిడుపువారంగా మార్చేశారు 

యీ పోష్ట్ పెట్టి! మళ్ళీ ఆ రోజులెటూ రావుకానీ, యీ రోజంతా ఆ జ్ఞాపకాలతో

'మనసు పరిమళించెనే!'....


 తాడాట--అబ్బో! యెంత బాగా ఆడేదాన్నో! 100, 200 చాలా వీజీగా 

ఆడేసేదాన్ని! రివర్స్ లోనూ, ఇంకా అటూ ఇటూ ఇద్దరు పట్టుకుంటే 

మధ్యలో

నుల్చుని ఆడటం కూడా! అలాగే ఒంటికాలిమీద నుంచుని చేయటం కూడా! 

భలే మజా వచ్చేది!  






కడపలో బుగ్గొంక అని ( మా రామకృష్ణాహైస్కూల్ దగ్గర) చిన్న యేరు పారుతూ వుండేది మా చిన్నప్పుడు!అక్కడ 
నీళ్ళలో నీటితాకిడికి వొరుసుని కాబోలు, భలే భలే రాళ్ళు దొరికేవి. అప్పుడప్పుడు లెత నీలం, లేతాకుపచ్చ రాళ్ళూ 
దొరికేవి. వాటి వేటకోసమూ తెగ వెళ్ళేదాన్ని అక్కడికి!యీ గచ్చెనకాయలు ఆడేందుకు, గుండ్రంగా మంచి షేప్ లోకి 
వాటిని తెచ్చెందుకు మళ్ళీ గోడకేసో గరుకు నేల మీదో వాటిని అరగదీయటం! అబ్బో! పేద్ద పని! వాటిని స్కూల్ కి 
తీసుకెళ్ళి చూపించి, స్నేహితురాళ్ళ మెప్పు పొందటమూ ఒక థ్రిల్ల్. యెంత పైకెగిరేసి పట్టుకుంటే, అంత గొప్ప!రక 
రకాల పద్ధతులుండేవి ఆడటంలో. ఒక రాయి పైకెగరేసి, కిందనున్న నాలుగు రాళ్ళనూ గబుక్కున పిడికిట్లొకి 
తీసుకోవటమూ, తరువత, మూడు రాళ్ళు, రెండు రాళ్ళూ, ఒక రాయీ- మెలేసి పట్టుకొవటం, వేళ్ళసందులనుంచీ 
వొడుపుగా పట్టుకోవటం ఇంకా చాలా అంశాలుండేవి. ఆట అంతా ఆడెందుకు చాలా సమయం పట్టేది. గెలుపు 
వోటములు యెలా నిర్ణయించేవారో గుర్తు రావటంలేదుకానీ, గంటలు గంటలు గడిచిపోయేవీఆటలో! మొత్తానికి లక్ష్మీదేవిగారు యీ ఆదివారాన్ని నిజంగా ఆటవిడుపువారంగా మార్చేశారు యీ పోష్ట్ పెట్టి! మళ్ళీ ఆ రోజులెటూ 
రావుకానీ, యీ రోజంతా ఆ జ్ఞాపకాలతో 'మనసు పరిమళించెనే!'...
...................................



  

Monday 14 September 2015

kAmAkSi anudinamu SWARAJATI bhairavi syAmA sAstri



 కర్ణాటక శాస్త్రీయ సంగీతం  కొండప్ప సారు దగ్గర చిన్నప్పటినుంచే నేర్చుకునేనాళ్ళలొనే శ్యామశాస్త్రి విరచిత భైరవి రాగ స్వరజతి నాకెంతో ఇష్టంగా ఉండేది. తెలిసీ తెలియని 8-9 యేళ్ళ వయసులోనే ఆ రాగం లో ఆ స్వరజతి పాడుతుంటే ఏదో తెలియని ఆవేదన సుళ్ళూ తిరుగుతూ కన్నీళ్ళరూపంలో బయటికి వచ్చేది. జన్మాంతర బంధమేదో ఉన్నట్టూ, ఆ తల్లి ముందు మనసంతా విప్పి  మనోవేదన మొరపెట్టుకుంటున్నట్టు- యేదో భావన! కడప మోచంపేట విశ్వేశ్వరాలయంలో  ఉన్న పార్వతీఅమ్మవారు దక్షిణ దిక్కుకు అభిముఖంగా ఉంటుంది. ఇది చాలా అరుదని అయ్య చెప్పేవారు. అయ్య వాల్మీకి రామాయణ ప్రవచనంకూడా 4 -5 యేళ్ళు నిరంతరాయంగా సాగిందక్కడ! నాకు 16-17యేళ్ళుంటాయేమో! ఊరికే వినటం కాక,  నేనూ నా స్నేహితురాలు ప్రభావతీ నోట్ బుక్కులలో రన్నింగ్ నోట్స్ రాసుకునే వాళ్ళం. యెవరూ చెప్పకపోయినా మాకే తట్టిందలా! అక్కడి అమ్మవారిముందు మొక్కుతూ యీ పాట పాడుకుంటూ కన్నీళ్ళు పెట్టుకుంటే, అదేదో తృప్తి ఆ రోజుకు! పెళ్ళై హైదరాబాద్ ఉ వచ్చాక,   కర్ణాటక శాస్త్రీయ  సంగీత పాఠాలు ఆకాశవాణి ప్రసారం కోసం (జూనియర్స్) చల్లా కృష్ణమూర్తి శాస్త్రిగారి దగ్గర మళ్ళీ నేర్చుకున్నప్పుడూ ఇదే భావన! నా అంతరంగంలో యీ స్వరజతి అలా సాస్వత ముద్ర వేసింది. ఈ రోజెందుకో వినాలనిపించి ఊ టుఓబ్  లో గాలిస్తే, యామినీకృష్ణమూర్తిగారి సాత్వికాభినయంతో పాటూ దొరికి, మాటలు మరచి ఆనంద బాష్పాలతో చూశాను. మా దూరదర్శన్ తప్ప ఇలాంటి అద్భుత కార్యక్రమం ఇతరులెవరైనా చేయగలరా అసలు? పక్కా వ్యాపార ధోరణిలో తమ రేటింగులు పెంచుకునే ప్రయత్నాలే తప్ప మన సంస్కృతీ సంప్రదాయం విలువల గురించి పట్టించుకోని చానళ్ళ వలలో బ్రతుకీడుస్తున్న ఇప్పటి జీవితాలపై యేడుపు తన్నుకుని వచ్చింది మళ్ళీ! అమ్మా! జగజ్జననీ! యీ విషవలయం, మాయాజాల జగతి అనే దానవ సంస్కృతి నుండీ మమ్మల్ని కాపాడు తల్లీ! రెండురోజుల్లో ఇక్కడికి వస్తున్న నీ కుమర రత్నాన్ని నీకొక నివేదిక తయారు చేసి పంపమని చెప్పు,  అది చూసి నీవే ఒక నిర్ణయం తీసుకోవాలి మరి!
యామినీకృష్ణమూర్తిగారు యీ పాట నాట్యాభినయానికి తగిన లయను యెన్నుకోవటమూ ఎంతో సముచితంగా ఉంది. సాహిత్యంలోని ప్రత్పదాన్నీ ముద్రలతో సంపూర్ణార్థం ఇస్తూ అమ్మవారి గంభీరమైన నడకనూ దీన భక్త హృదయవేదననూ భావాభినయం ద్వారా నేత్ర సంచలనాలతో ప్రకటిస్తూ చేశారు. కంచి కోవెల బ్యాక్ డ్రాప్ యెన్నుకోవటం కూడా,  కార్యక్రమ నిర్వాహకుల నృత్యోచితంగా ఉంది. మంత్రపూరితమై, వుపసనాసక్తి కలిగిన శ్యామశాస్త్రిగారి సాహిత్యానికి, నృత్యం- బంగరానికి తావి అబ్బినట్టే! అందుకే, ఇటువంటి సాహిత్యాన్న్నీ, సంగీతాన్న్నీ  అమ్మవారి అమృతోపమానమైన క్షీరధారలుగా తపస్సంపన్నులు వర్ణించారు. సాహిత్యంతో పాటీ వీక్షిస్తే మరింతబాగుంటుందనే భావంతో..ఇదిగో మీ కొసం...
ప) కామాక్షీ అంబా! అనుదినము మరువకనే 
    నీ పాదములే దిక్కనుచు నమ్మితిని శ్రీ కంచి ||కామాక్షీ ..............
1) కుందరదనా! కువలయ నయనా! తల్లీ రక్షించు || కామాక్షీ..............
2) కంబుగళ నీరద చికురా! విధు వదనా! మాయమ్మ || కామాక్షీ.............
3) కుంభ కుచ! మద మత్త గజగమ! పద్మభవ, హరి శంభు నుత పద!
    శంకరీ! నీవు నా చింతల వేవేగ తీర్చమ్మా ఇపుడు || కామాక్షీ................
4) భక్త జన కల్ప లతికా! కరుణాలయా! సదయా! గిరి తనయ కావవే! 
   శరణాగతుడ కదా! తామసము సేయక వరమొసగు || కామాక్షీ................
5) పాతకములను తీర్చి నీ పద భక్తి సంతతమీయవే! (సంపదనీయవే!)
    పావని కదా! మొరలిడగా (మొర వినవా?) పరాకేలనమ్మా? వినమ్మా || కామాక్షీ ............
6) కలుష హారిణి, సదా నతఫల దాయకి యను (యని) బిరుదు 
    భువిలో కలిగిన దొరవనుచు వేగము మొరలిడగ విను || కామాక్షీ...............
7) నీప వన నిలయా! సుర సముదయా! కర విధృత కువలయా!
    మద దనుజ వారణ! మృగేంద్రాశ్రిత! కలుష దహన ఘనా! 
    అపరిమిత వైభవము కల నీ స్మరణ మదిలో కలిగిన (తలచిన) జనాదులకు
    బహు సంపదలనిచ్చేవిపుడు మాకభయమీయవే || కామాక్షీ...............  
8) శ్యామ కృష్ణ సహోదరీ! శివ శంకరీ! పరమేశ్వరీ! 
    హరి హరాదులకు నీ మహిమలు గణింప తరమా? 
    సుతుడన్న అభిమానము లేదా నాపై?
    దేవీ పరాకేలనే? బ్రోవవే ఇపుడు శ్రీ భైరవి || కామాక్షీ...............
                                               (15-9-2015) 
...........................
            





విశ్వనాధ వారి కల్పవృక్షంలో సీత(నా పరిశోధనలోనుండి కొన్ని అంశాలు) 
ఆధునిక రామకావ్యాలలో విశ్వనాథ వారి కల్పవృక్షం, ఒక కమనీయ రమణీయ శిల్ప వృక్షమే!అందులో సీతారాముల గురించిన సన్నివేశాలు అత్యద్భుతాలు.  
..................
పరశురామ గర్వభంగం ఘట్టం కల్పవృక్షంలో నన్ను అమితంగా ఆకర్షించింది. సీత లక్ష్మీతత్వం, రాముని విష్ణుతత్వం రెండింటి అపూర్వ సంగమం మిథిలలో జరిగేలా చిత్రించటం జరిగిందిక్కడ. 
   మిథిలా  శృంగాటకముల పృథులంబగు విషయమట్లు వినబడియెడు, శ్రీ
   మధురాకృతి సీత ధరకు మధుసూదను రాణి వచ్చి మన్నించినటుల్, 
   మధురాకృతి మా రాముడు, మధుసూదనుడౌనొ కాదొ, మధుసూదను నం
   సధురాఖ్యాతుని భార్గవునధరీకృత తీజుజేయుటది యద్భుతమే! 
రాముని సంపూర్ణ వైష్ణవతేజాన్ని దర్శింపజేయటమే, యీ సన్నివేశం ముఖ్యోద్దేశం.

           కల్పవృక్షం సీత రామునికి బ్రహ్మానంద  సంధాయనిగా కనిపించిందనటం అతి ఉదాత్తమైన కల్పన. 'తన ప్రతిబింబమే, తన యెదుట నిలిచిందా అన్నట్టుగా రాముడు సందేహించాడట కూడా! సాక్షాత్ విష్ణువే, రామునిగా అవతరించినా, మానవజన్మ కాబట్టి, మానవ సహజమైన భావనలు అతనిలో కలగటాన్ని విశ్వనాథవారు అత్యంత హృద్యంగా వర్ణించారు.
  సంకల్ప సంభవాస్థానమౌ తెరదోచి వంచీకృతంబులౌ ప్రాణములును,
  దెరవెంక ప్రతిబింబ ధీధితుల్ ప్రకటించి తనకు మించిన మోహనముగ వెలిగి,
  తనుదాన రాముడయ్యును విస్మరించి తత్ప్రతిబింబమునయందు రాముడౌచు, 
  తెరదీసినంతనతెలిసి నిజ స్వరూపంబు బ్రహ్మానంద పరిధియౌచు, 
  యెంతటి మహీయుడయ్యును నినకుల  శిశు  వింత గణనీయుడై సర్వ సృస్టిసహజ 
  మైన విభ్రాంతినొందె మోహజమైన వికృతి నలుగురితోబాటు విస్తరించు, 
  .                                                         (బాల/కల్యాణ/)
....................... 
  మంగళసూత్రధారణవేళ రాముని కరస్పర్శ వల్ల సీత శరీరం, పులకాంకితమైంది. తలంబ్రాలవేళ, ఆమె నుదుటిచెమటకంటుకుని నిలచిన రెండు ముత్యాలు రామునిలో పులకింతకు కారణమయ్యాయట! 
           అలుపములు రెండుముత్యాలు నిలిచి సీతపాపిటలో చిరు చెమటపోసె,
           హత్తుకుని గంధపూతముత్యాలు రెండు రాముని మేన ధారకలు పొలిచె 
                                               (కల్పవృక్షం/బాల/కల్యాణ/84వ పద్యం) 
...............................  
           నవోఢ సీత, రాముని అల్లంత దూరాన చూడగానే, సిగ్గుతో పారిపోతుందట! అతను తన దగ్గర నిల్చుంటే, వినమ్రంగా తానూ లేచి నిల్చుంటుందట! యెదురెదురుగా ఉన్నప్పుడు, నిశ్చల సరసివలె, స్థిరముద్రలోకి వస్తుందట! రాముడటుగా వెళ్తుంటే, ఆ చంద్రకాంతిని కళ్ళారా చూడలన్న కాంక్షతో విస్ఫారిత నేత్ర అవుతుందట! నిత్యమూ సంబోధనసుఖాన్ని అతనినుండీ పొందగోరుతుందట ఆమె హృదయం! (కల్యాణ/161) వారిరువురి పరస్పర భావనలు చూస్తే, వారే ప్రకృతి-పురుషులా అనిపిస్తుందంటారాయన..ఆ ప్రేమ సహజతి సహజం. కృత్రిమతకు తావు లేనిది. నిత్య నూతనత్వం వుంది వారి దాంపత్యంలో! సర్వజ్ఞులూ, మర్మజ్ఞులూకూడా! తాము యుగయుగాలుగా, కల్పములుగా. పతిపత్నులుగా ఇలాగే కలిసి ఉన్నామేమో అనిపించేలా ఉంటారట!(పైదే-176వ పద్యం) సీత జ్యోతిస్వరూపిణిగా, రాముని మదిలో ప్రభాలోకావిష్కరణ చేసిందట..(పైదే-266వ పద్యం) వారిరువురిదీ ఒక అద్వైత ప్రేమ. (దేహమ్మునందు నేనొకాదొ వచింపగలేనుగాని, యాత్మ నిన్ను నిత్యంబుగా హత్తుకొందు-267వ పద్యం) సీత పార్వతి ఐతే, రాముడు పరమేశ్వరుడు. సీత లక్ష్మి. రాముడు సాక్షాత్తూ  శ్రీమన్నారాయణుడే!  భవిష్యత్తుకూడా ముందే వారికి తెలుసునుకాబట్టి, ఇప్పుడు వారిరువురూ, వియోగావస్థకు అవకాశమే ఇవ్వటంలేదట! 
..........
అనేకాభరణాలతో సీతను రాముడు స్వయంగా అలంకరిస్తాడట!  పాదాలకు లాక్షారసం పూస్తాడట! కల్ హార   మాలలతో కంఠాన్నీ,కేశరాసినీ అలంకరించి, వీక్షించి ఆనందిస్తాడటకూడా! వైదేహి,  మైథిలి,  జానకి-ఇలా పలు నామములతో ఆమెను సంబోధిస్తూ తన ప్రేమను పలువిధాలుగా ప్రకటిస్తాడట! బ్రహ్మజ్ఞాని  జనకుని పుత్రి ఆమె.తన మామగారిపట్ల గౌరవాన్ని అలా ఆమె తండ్రి పేరుతోనే కలిపి సంబోధించటం ఆతనికిష్టం.(290 వ పద్యం) 
    సీత శ్రీరామచంద్రుని  చిత్తపదము, రామచంద్రుడు జానకీప్రాణప్రదము,
    రామ సర్పఫణామణి రమణి సీత, ధరణిజాజీవితతపహ్ సరణి స్వామి
                                             (291వ పద్యం)
  ఇలా సీతారాముల దాంపత్య వర్ణనలో శృంగార, వైరాగ్య భావనల మనోజ్ఞ సమ్మిశ్రణం కల్పవృక్షకారుని మౌలిక కల్పనాచాతుర్యం. గంగాయమునల సంగమంలా అతి పవిత్రమూ, ఉన్నతమూ కూడా! అన్య రామకావ్యాలలో కనపడని యీ భావుకత కల్పవృక్షంలో పరవళ్ళు తొక్కుతూ పఠితలను ముగ్ధులను గావిస్తుంది. విభిన్న ఋతువుల పరివర్తనననుసరించి సీతారాముల ప్రేమ కర్మ వికాసాన్ని చిత్రించటంకూడా ఇందులోని అద్భుతం. వారిరువురి ప్రేమలో ముగ్ధత్వమూ, గంభీరతా, ఔన్నత్యమూ, లోతూకూడా ఉన్నాయి. ఇదే విశ్వనాధవారి ప్రత్యేకత. రససిద్ధులైన సుకృతులైన కవీశ్వరులకు నిత్యమూ జయమే!
.....................
విశ్వనాధ కల్పవృక్షంలో నన్నాకర్షించిన మరో ఘట్టం- సుమంత్రానీత రథంపై వనవాసానికై రామునితోపాటూ సీత వెళ్తున్న వర్ణన. 
        త్రయ్యధ్వమున  స్వరితానుదాత్తములచే దీపించెడునుదాత్త దీధితివలె, 
        సత్వ రజోగుణ సంసేవితంబైన లీనతమోగుణ రేఖవోలె,
        నీశాన్యమాజ్ఞేయమిరుదెసన్ బలిసిన ప్రాచీదిశాకంతి భరమువోలె,
        నాదివరాహ దంస్ట్రాగ్ర శేషాహి ఫణాగ్ర భూషిత వసుంధరమువోలె, 
      హృషిత నారద తుంబురు ఋషి విపంచికాసమాభిసేవిత సామగానవిద్య
      వోలె శ్రీజానకీదేవి వొలిచెనంత ప్రభుతమెయి సుమంత్రానీత రధముమీద.
                               (కల్ప/అయోధ్య/ప్రస్థాన/279వ పద్యం)
  స్వరిత, ఉదాత్తానుదాత్తాలతో సమ్మిళితమైన  వేదనాదంవలె  ఉన్నదట సుమంతుని రధంపై వనవాసానికి ప్రయాణమైన సీత! సత్వ రజోగుణాలతో సేవింపబడే తమోగుణ రేఖవలె ఉన్నదామె. ఈశాన్యమూ,ఆగ్నేయములలో వెల్లివిరుస్తున్న ప్రాచీదిశాకాంతివలె, ఆదివరాహ దంస్ట్రాగ్రభాగాన నిలిచిన వసుంధరవలె దర్శనమిస్తున్నది. నారద తుంబురు ఋషివందిత సామగానవిద్యే ఆమె.  అంతేనా? 
  బుధ్యహంకార యుగళాత్తమధ్యభాగ  నిహితమన ఇంద్రియంబుల నెగడు తెలివి
  రాణమెయి సుమంత్రానీత రధముమీద జానకీదేవి సర్వ భూషణయు బొలిచె 
                       (పైదే/అయోధ్య/ప్రస్థాన/280వ పద్యం) 
    బుధ్యహంకారముల మధ్య  నిలచిన మేధవలె,  సర్వభూషణాలంకృత సీత సుమంత్రుని రధంపై నిలిచింది. ఇంతకంటే మించిన మరో వర్ణన ఇదిగో...
  నిరుదెసన్ రామలక్ష్మణులిద్దరొలసి తుండములువోని ధనువులతోదనొప్ప,
  రక్తిమెయి సుమంత్రానీత రధము మీద జనకీదేవి గజలక్ష్మిసరణి బొలిచె
                       (పైదే/అయోధ్య/ప్రస్థన/278వ పద్యం) 
 రామలక్ష్మణులనే మహాగజములు అటూఇటూ నిలువబడియుండగా, ఆసీనురాలైయున్న గజలక్ష్మివలె సీత దర్శనమివ్వటం అనితరసాధ్యమైన,విశ్వనాధవారికి మాత్రమే సాధ్యమైన  కల్పన. మార్గాయాసాన్ని  పోగొట్టేందుకూ, ఉల్లాసంగా ఉంచేందుకూ రాముడు ఆమెకు ఫలపుష్పాదులను అందిస్తూ, వనంలోని తరుబృందాలనూ, జీవజంతువులనూ పరిచయంచేస్తున్నాడట కూడా!
  సీతకు మార్గాయాసమే లేదు. ఆమె కోమలచరణాల లాక్షారసం సైతం వివర్ణమవనేలేదు. తీవ్రమైన యెండవేళలోనూ, ఆమె తనువు వాడిపోలేదు.ఆమె ముఖారవిందంలో  యెల్లప్పుడూ ప్రశాంతతే కనిపించింది. 
   అడవిలోనడచినయప్పుడైనను దల్లి చిరుకాళ్ళపారాణి జెరగలేదు,
   కోసయెండలు తలన్ గుప్పుచున్ననునైన గోడలి వదనంబు వాడలేదు, 
   బడలిక యెంత చొప్పడిన జెమ్మటబోసి చిరుత కుంకుమబొట్టు చెరగలేదు, 
   వడగాలిరివ్వున బారదోలినను  యల గంధపుంబూత యారలేదు,
     తల్లిడయ్యదు,చిరునవ్వు వెల్లిమొగమునందు దొలగదుతల్లికేమమ్మదల్లి,
     జానకీ భీతి నీకవసరములెదు, కడుపుగూర్చిన బెదరంతకంటె లేదు
                  (పైదే/అయోధ్య/మునిశాప/12వ పద్యం)  
..................   
 అరణ్యకాండలో శరభంగాశ్రమం. వానప్రస్థాశ్రమ మునులప్రార్థనలను విన్నరాముడు, వారిని దానవులబారినుండీ రక్షిస్తాననీ, ఆయుధధారణచేసి దానవులను తుదముట్టిస్తానంటాడు. రామునికి సీత అడ్డుచెబుతుంది. 'అసలు మనం వనవాసానికి వచ్చినదెందుకు? శాంతిగా ప్రకృతిమధ్య బ్రతికేందుకుకదా? అలాంటిది, వాళ్ళేదో అలా అడగ్గానే ఇలామాటైచ్చివేయటంలో అర్థం ఉందా అసలు? మహబాగాఉందిలెండీ  అని అచ్చం తెలుగింటి ఇల్లాలివలె భర్తతో వాదనకు దిగుతుంది.విశ్వనాధవారి కలానికి యీ ఘట్టంలో  - బహుశా వారి ఇంటివాతావరణం గుర్తుకు వచ్చిందేమోమరి! (కల్ప/అరణ్య/193వ పద్యం) అకారణ ద్వేషాలు హానికారకాలు అంటూ హితవు పలుకుతుంది కూడా! కానీ రాముని మనసు తోణకదు.పైగా 'ప్రతిజ్ఞాపాలనలో నేను నిన్నూ, తమ్ముణ్ణీ కూడా వదిలివేసేందుకు సిద్ధమే' అనటంచూసి సిత పతిచేతిలోని ఖడ్గాన్ని తాను తీసుకుని ముందుకు అడుగేసిందంటారాయన! ఇలా స్త్రీని  సబలగా కూడా కూడా చూపే ప్రయత్నం చేశారు విశ్వనాధవారు. 
....................
కల్పవృక్షంలో సీతాపహరణంలో  చాయాసీత గురించి స్పష్టంగా  చెప్పలేదుకానీ,వివిధ సందర్భాలలో చాయాస్వరూప వృత్తాంతం ధ్వనిస్తుందంతే! రావణుడు సీతను పలురీతుల భయపెడతాడు. అన్నీవిన్న సీత, తాపీగా, 'అలాగా! అదుగో! నా నాధుడొచ్చేస్తున్నాడు. కాసేపాగవయ్యా' అంటూ, కుటీరంలోకి వెళ్ళిపోతుంది.(అరణ్య/జటాయు/82వ పద్యం) అపహరణసమయంలోనూ 'వట్టికట్టెను తీసుకుని వెళ్తున్నావే!' అని హాస్యమాడుతుంది కూడా! (పైదే/292వ పద్యం) యుద్ధభూమిలో రావణుడు సంశయంలో పడతాడు 'అసలు నేను సీతను అపహరించుకువచ్చానా లేదా!' అని! (పైదే/335వ పద్యం) 
...........
అశోకవనంలో సీత యెలాఉంది? 
    ఆకృతి రామచంద్ర విరహాకృతి, కన్ బొమ తీరు స్వామి చా
    పకృతి కన్నులన్ ప్రభుకృపాకృతి కైశికమందు రామదే
    హాకృతి  సర్వదేహమున యందున రాఘవ వంశమౌళి ధ
    ర్మాకృతి  కూరుచున్న విధమంతయు స్వామి ప్రతిజ్ఞ ముర్తియై. . 
                            (సుందర/పరరత్ర/139వ పద్యం)
       సిత కనుబొమలతీరు రాముని బాణములవలె ఉన్నది.ఆమెకన్నులలో స్వామి కృప  మూర్తికట్టినట్టుంది. ఆమెదేహం మొత్తం రాఘవ వంశమౌళి వలెనే అనిపించటంలో కల్పవృక్షకారుని కల్పన అత్యద్భుతం.      
  ........................
 లంకనుండీ,అయోధ్యకు తిరిగి వెళ్ళేసమయంలో పంచవటిలో పుష్పక విమానం ఆగుతుంది. సీత కిందకు దిగి తమ కుటీరంలోకి వెళ్తుంది. లోనికి వెళ్ళిన సీతా, బయటికివచ్చిన సీతా- ఇరువురి మధ్యకనిపించే భేదాన్ని కల్పవృక్షకారుడిలా చిత్రించాడు.
    లోనికి జన్న పృధ్విజ విలోకనలోక జయ ప్రగల్భ, ప్ర
    జ్ఞానిధి, సిమ్హయాన, వికసన్నవలోచన పుండరీక, ర
    షోనివసంబునందగడు సొచ్చిన శీర్ణతణూ ప్రబంధ సం
    ధ్యా నవవహ్నికావిరచితాకృతి, యాకృతి మత్ప్రతిజ్ఞయున్. 
                               (యుద్ధ/ఉపసమ్హరణ/270వ పద్యం) 
 లోనికి వెళ్ళిన సీత, సింహగమన. విజయవిలాసిని.అగ్నిదేహిని.స్వర్ణకాంతిమయి.మరి కుటీరమ్నుంచీ వెలుపలికి వచ్చినె సీతో? మందయాన. మృదుశరీర. పతివెంట సుందర సుకుమరంగా, వనవాసానికి వచ్చిన అంతిపుర వనిత. ఈ వర్ణనద్వారా, లంకనుంచీ  వచ్చిన  సీతను, చాయాస్వరూపిణిగా, అయోధ్యకు రామునివెంట ప్రయాణమైన సీత అసలైన సీతగానూ ధ్వనింపజేశారు విస్వనాధవారు. అధ్యాత్మ రామాయణప్రభావం ఇక్కడ సుస్పష్టం.   
..................  
 అశోకవనంలో రావణుడు, అక్కడి స్త్రీలకు, సీతను జాగ్రత్తగా ఎలా చూసుకోవాలో నొక్కిచెబుతాడు. ఆమె నోరుతెరచి అడుగకముందే ఆమెకవసరమైన వస్తువులన్నీ సమకూర్చవలెనట! నిరాదరణభావం చూపకూడదట! యెండ తగులరాదు. నొసటిపైకూడా మబ్బురేకలనీడ మసలనేరాదట! చలిగాలి దోపరాదు. పూవులధూళికూడా ఆమెపై పడకూడదుసుమా!' (అరణ్య/జటాయు/332వ పద్యం) ఈ మాటలలో సీతపట్ల అతనిమనసులోఉన్నది దైవీభావంగానే ధ్వనింపజేశారు కవి. అది, భక్తుడు-భగవత్ శక్తీకీ  మధ్యనున్న భక్తితోకూడిన భయమేననిపిస్తుంది.  అతనిమనసులో సీత స్థిర నివాసం యేర్పరచుకుంది. భక్తుడు తన ఉపాసనామూర్తికి తనగోడు విన్నవించుకున్నట్టే, రావణుడితో సీతను 'నన్ను కృపానేత్రము విచ్చి ఒడ్డుకు చేర్చమనీ, నా భావనేత్రపధంబున నిన్నే పదిలపరచుకొన్నాననీ' చెప్పిస్తారాయన! చివరికి రాముని శరాఘాతాలతో నేలకొరిగిన దశలోనూ, రామునిలోనూ సీతనే దర్శించేలా రావణుని మలచారు. (పైదే/384వ పద్యం)   
....................... 
రామలక్ష్మణుల మాయాశిరస్సులను చూసిన సీత, రోదిస్తున్నది. రాముని ఆగమనవార్తను మోసుకునివచ్చిన ఒక హంస, అక్కడి అశోకవృక్షశాఖలపై, సరిగ్గా, ఇదివరకూ, హనుమ కూర్చుని కనిపించినచోటే ఉన్నది.సిత యేమనుకున్నది? 
    అపుడు కపిరాజు పరమేశుడిపుడు హంస ప్రాపణము గాంచగ బరస్పర ప్రవృత్తి,
    ఇంత శుభహేతువుండునటే లతాంగి కపి వృషాకపులటునిటు గాంచియుంట.
                                           (యుద్ధ/సంశయ/90వ పద్యం)
     ఈ కల్పనకు ఆధారం వేదాంతదేశిక విరచిత 'హంససందేశ   కావ్యమనవచ్చు.అందులోనూ ఇలాగే హంస రామసందేశాన్ని సీతకు అందిస్తుంది. ఈ సంస్కృత రచనను కృష్ణామాత్యుడన్న తెలుగు కవి అనువదించాడుకూడా! 
.............................  
 నాగపాశ బద్ధులైన రామలక్ష్మణులనిరువురినీ, కాపలా స్త్రీలద్వారా  చూపించి రావణుడు, ఇంకేముందీ? నీ భర్త పరలోకగతుడైనాడంటాడు. కానీ, త్రిజట, కాదు, వారి ముఖాలింకా తేజోవంతంగానే ఉన్నాయనిచెప్పి సీతకు ధైర్యాన్నిస్తుంది. అప్పుడు సీత, మునుపెవ్వరూ మొక్కని మొక్కు మొక్కుతూ, నా భర్త మోహనరూపుడైన రాముడీ ఆపద దాటితే, నేను అగ్నికి ఆహుతవుతానని ప్రతినబూనుతుంది (358వ పద్యం)అన్నదమ్ములను రక్షించు. నేను అగ్నిప్రవేశం చేస్తాను. హుతవహా! నా యెదలోనున్న దీపాన్ని ఆర్పివేయకుమయ్యా! అని వేడుకుంటుంది. రాబోయే అగ్నిప్రవేశ ఘట్టానికిది సూచనగా విశ్వనాధవారు మలచారు.   
................
        రాముని కఠినోక్తులను విన్న విశ్వనాధ సీత ఆడుది అని చులకనగా రాముడు మాట్లాడటాన్ని అడ్డుకుంటుంది.
          ఆడది ఇంతసేయుననుటన్నది ఉన్నదె యంచునన్ను మా
          టాడితి కైక కోరక మహాప్రభు! నీ వని రాక లేదు, నీ
          యాడది సీత కోరక మహాసుర సమ్హరణంబులేదు, యా
          యాడది లేక లేదు జగమంచు నిదంతయు నేన చేసితిన్..
                                                                                                                  (పైదే/154వ పద్యం) 
 అంతేకాదు. మన  ఇద్దరిదీ ఒకే రూపం. ఇది సత్యం.లొకకల్యాణంకోసమే ఇరువురమైనాము. ఒకే దీపశిఖకు రెండుభాగాలు మనం. కేవలం పరమ శివునికి మాత్రమే యీ రహస్యం తెలుసును.నేను ప్రకృతిని. నీవు పురుషుడవు.  అంతే! అనికూడా కుండ బద్దలుకొట్టి చెబుతుంది. 
...................
అగ్నిప్రవేశానంతరం దెబ్బతిన్న మనసుతో సీత ' నా మనసెంతో దెబ్బ తిన్నది. మా తల్లి ధరణి  వద్దకు వెళ్ళాలనిపిస్తున్నది. కానీ, చెడి పుట్టినింటికి  వెళ్ళకూడదంటారు కదా! అది గుర్తుకు వచ్చి, యీ జీవితాన్నిక్కడే అంతమొందించుకోవాలనిపించింది. కానీ అగ్నిదేవతవల్ల మిమ్ములనిలా కలిశాను మళ్ళీ అంటుంది, ఆవేశంగా! (పైదే/210వ పద్యం) ఇక్కడ సీత ఆత్మాభిమానం వెల్లడవటమే కాక, ఉత్తరకాండకు బీజారోపణ కూడా జరిపించారు కవి. అయోధ్యకు  తిరుగు ప్రయాణంలో అనసూయను కలిసినప్పుడు, ఆ మహాసాధ్వి, శ్రమపడి, విమానమెక్కి, తాను మరచేపోయానంటూ, సీతచేతిలో రెండు ఫలాలుపెట్టి ఆశీర్వదింపజేయటం-  విశ్వనాధవారికి మన తెలుగు సంప్రదాయాలపట్ల ఉన్న మక్కువ కాక మరేమిటి? 
  ఇలా తన కల్పవృక్షాన్ని రమణీయ కావ్యవృక్షంగా మలచిన విశ్వనాధవారు తెలుగువారి వాల్మీకే! 

.................................................      

Sunday 13 September 2015

punnaga :  ఫోటోలో (చాలా అరుదుగా) త్రిపుండ్ర  ధారిగా  కనిపిస్...

punnaga :  ఫోటోలో (చాలా అరుదుగా) త్రిపుండ్ర  ధారిగా  కనిపిస్...:  ఫోటోలో (చాలా అరుదుగా) త్రిపుండ్ర  ధారిగా  కనిపిస్తున్న పుట్టపర్తివారి గురించిన వివరణ ఇది.అయ్యతో అనేక సంవత్సరాల అనుబంధం ఉన్న కామిశెట్టివార...
 ఫోటోలో (చాలా అరుదుగా) త్రిపుండ్ర  ధారిగా  కనిపిస్తున్న పుట్టపర్తివారి గురించిన వివరణ ఇది.అయ్యతో అనేక సంవత్సరాల అనుబంధం ఉన్న కామిశెట్టివారన్నట్టు,, మా అయ్యకూ ఇలా నుదుట నామంతో కనిపించటం పెద్దగా ఇష్టం ఉండేది కాదెప్పుడూ! ఆమాట కొస్తే యీ విధంగా నామాలూ ,శిఖ -అంటే పిలక పెట్టుకోవటం- అస్సలు యెప్పుడూ లేదు. నాకు 7 లేదా 8 యేళ్ళప్పటి ముచ్చట. అహోబిల మఠ స్వామి   కడపలో మోచంపేటలోని అహోబిల మఠానికి  వచ్చారు. అక్కడి వైష్ణవులు, అయ్యను వారి  వద్దకు తీసుకుని వెళ్ళారు. అయ్య అప్పటికే తన జలద గంభీర  శివతాండవగానంతో ఆంధ్ర సాహిత్యలోకాన్ని ఉర్రూతలూగిస్తున్నారు. యీ సంగతి ఆ పీఠాధిపతికీ (మేము మఠాధిపతి అంటాము)  తెలుసునేమోకూడా! అయ్య మామూలుగా క్రాఫ్,పంచె కట్టుతో దర్శనానికి వెళ్ళారు. ఆయన, 'నీవసలు వైష్ణవుడివేనా? నామాలూ, శిఖా యెక్కడా? తీర్థం ఇవ్వను పో' అన్నారు.అయ్య అన్నారూ- 'నేను   అష్టాక్షరి అక్షర లక్షలు చేసిన వైష్ణవుణ్ణి. ఒక్క మాట! నేను పిలకా,  నామాలూ  పెట్టుకుని వస్తాను-మీరు చెప్పినట్టుగానే! కృష్ణ దర్శనమిప్పిస్తారా నాకు మరి?' అని అడిగారట! ఆ ప్రశ్నను ఊహించని మఠాధిపతికి ఛర్రున  కోపం వచ్చి- 'నీకు తీర్థం ఇవ్వను పొ'మ్మన్నారు.'నాకూ వద్దులెమ్మ'ని అయ్య వెనక్కి వచ్చేశారు. బహుశా ఆనాటి వార్తాపత్రికలలోనూ యీ సంఘటన ఒక సంచలన వార్తగా వచ్చినట్టే  లీలగా నాకు  జ్ఞాపకం. యీ సంఘటనతో మా బంధువర్గంవారూ అయ్యనూ, మా కుటుంబాన్నీ చాలా రోజులు దూరంగా పెట్టినట్టు గుర్తు కూడా!  మా అమ్మకొకటే దిగులు. ఆడపిల్లలున్నారు. వీళ్ళకు పిళ్ళిల్లెలా అయ్యేది అని!అయ్య ధోరణి అయ్యదే!
  బైటికి కనిపించే ఆచార వ్యవహారాలంటే అయ్యకంత గౌరవం ఉండేది కాదు.. మానసికంగా సంస్కారం అవసరమనేవారు. నిరంతరమూ అష్టాక్షరి  పారాయణం చేస్తూనే ఉండేవారు.నరనరాల్లోనూ అష్టాక్షరే  వారికి! అయ్యలోని  ఆర్తిని  వారి బాల్యాననే  గుర్తించిన కంచి పెద్ద స్వామి చంద్రశేఖర పరమాచార్యవారి వద్దకు అయ్య నేరుగా బట్టలు కూడా మార్చుకోకుండానే వెళ్ళటము నేను చూసిన సత్యం. (I was 12 or 13 at that time)  ప్రొద్దుటూరులో స్వామి విడిది చేశారు చాలారోజులొకసారి..ఒక సారి బీడీ కాలుస్తుండగా,  పెద్ద స్వామి  మిమ్ములను పిలుస్తున్నారని పరుగున ఒకతను రావటం, అయ్య బీడీ ఆర్పి , సిగ్గుగా నవ్వుకుంటూ లోపలికి వెళ్ళటమూ చూశాను కూడా! అంత చనువుండేది అయ్యకు..నాకు 18,19 సంవత్సరాలప్పుడు, కడపకు మధ్వ మఠ పెషావర్ స్వామి వచ్చినప్పుడూ, అయ్య అలాగే త్రిపుండ్రాలూ  వంటివేవీ లేకుండానే వెళ్ళారు. అక్కడ శాస్త్ర చర్చల్లో పాల్గొన్నారు. సన్మానితులయ్యారు కూడా! అయ్య ఆనాటికి లబ్ధప్రతిష్టులు.మధ్వ భాష్యాలూ, సిద్ధాంతాలన్నిటినీ ఆపోశన పట్టిఉన్నారప్పటికి..సుధాపరిమళ  వ్యాఖ్య (శ్రిరాఘవేంద్రస్వామి విరచిత భాగవత వ్యాఖ్య అది) అయ్యకు ప్రాణ సమానం.జైన బౌద్ధాలనూ అయ్య బాగా చదివారు.కడపలో ఒకసారి  జైనుల సభలకూ కూడా అయ్య వెళ్ళారు...అలా మా అయ్యగారిది, త్రిపుండ్రాలూ,శిఖలకే  కాదు.  నామరూపలకతీతమైన  కృష్ణోపాసన. ఇక పై ఫోటో, నా పెళ్ళిలోది. అప్పుడు 40-50 యేళ్ళ వయసునాటి పొగరూ, దుడుకుతనమూ తగ్గిన మహానదిలా ఉండేవారయ్య.  పీటలపై కన్యాదానానికి కూర్చున్నప్పుడు నామాలు  పెట్టుకోవాలికదండీ  (ఆయనకు తెలియదనికాదు) అని మా అమ్మ భయం భయంగానే అభ్యర్థించగానే నామం పెట్టుకున్నారు.ఫోటోకి చిక్కినారు కూడా!అరుదైన   రూపంలోని  అయ్యనిలాకూడా అయ్య అభిమానులకు  పరిచయం  చేయాలని నా ప్రచురణల్లో ఈ ఫోటోను వాడానెక్కదో!  రాజుగారి కంటపడింది. ఫొటొ   నేపథ్యం పంచుకునే అవకాశం నాకూ దక్కింది ఇలా! అయ్యకు కుడివైపు  (మా ఆచారం ప్రకారం-అది నా అదృష్టం కూడానేమో) ) వారి ఒడిలో కూర్చుని   నేనూ వున్నాను అసలు ఫోటోలో!దాన్నీ చూపిద్దామంటే  ఫోటో ఆల్బం కనబడటమే లేదు. నా దురదృష్టం కదూ!  (మరో సంగతి..అయ్య వుర్దూ రాయటం నేర్చుకునే సమయంలో వారితోపాటూ నేనూ అలీఫ్ బే తేలు (వాళ్ళ అ ఆ ఈ ఈ లు)  పలకపై ప్రాక్టీసు చేసేదాన్ని.అయ్య ఉర్దు ముషాయిరాలో పాల్గొని ఒక ఉర్దూ కవితకూడా చదివారొక సారి..అది భద్రపరచుకోవాలన్న జ్ఞానం లేదప్పట్లో- అందుకే ఇప్పుడు పస్చాత్తాపం మాత్రమే ఉంది)  a big thanx to RAJUgaru....  ఇంత పెద్ద వ్యాఖ్యతో  మిత్రుల సహనాన్ని పరీక్షించినందుకు క్షంతవ్యురాలను...  (14-9-15) 
              .           
............................