అమరచింత (అమ్మాపూర్) సంస్థానాధీశుల ఇలవేల్పు అయిన కురుమూర్తి స్వామికి ముక్కెర వంశస్థులైన రాజా సోంభూపాల్ 15వ శతాబ్దంలో బంగారు ఆభరణాలను సమర్పించారు. శంఖుచక్షికాలు, కిరీటం, మకర కుందనాలు, భుజ కిరీటాలతో సహా వివిధ ఆభరణాలు ఈ స్వామి వారికి బహుకరించారు. నాటి నుండి నేటి వరకు ఆ ఆభరణాలను స్వామివారికి ఉత్సవాల సందర్భంగా అలంకరించడం ఆనవాయితీగా వస్తోంది.
స్వామి వారికి ప్రతి ఏటా బ్రహ్మోత్సవాలు జర్గుతాయి. వీటిలో ఉద్దాల ఉత్సవం అనగా పాదుకలను తయారు చేయడం ప్రధాన ఘట్టం. రాయలసీమ నుంచి తెచ్చిన ఆవు చర్మంతో వడ్డేమాన్ గ్రామంలో చర్మకారులు వారం రోజులు శ్రమించి పాదుకలను తయారుచేస్తారు. ఉత్సవం రోజున పాదుకలను ఆంజనేయ స్వామి ఆలయం దగ్గర పూజిస్తారు. కొండ దిగువన పాదుకలకు స్వాగతం పలికి కాంచనగుహ లోని కురుమూర్తి సన్నిధికి చేర్చి ఆ తర్వాత ఉద్దాల మండపంలో అలంకరిస్తారు. మండపంలో ఉంచిన పాదుకలతో తల, వీపుపై కొట్టించుకుంటే పాపాలు తొలిగిపోతాయని భక్తుల నమ్మకం.
పేదల తిరుపతిగా ప్రసిద్ధమైన కురుమూర్తి దేవాలయంలో వర్ణవివక్షకూడా లేదనే చెప్పాలి. స్వామి వారి పాదుకల ను వడ్డెమాన్‌లోని ఉద్దాల కార్పోగారంలో రా యలసీమ ప్రాంతం నుంచి సేకరించిన నాణ్య మైన ఆవు చర్మంతో పాదుకలను దళితులు తయారు చేస్తారు. దీపావళి అమావాస్య రోజు నుంచి 7 రోజుల పాటు నియమ నిష్ఠలతో ఉపావాస దీక్షలతో స్వామి పాదుకలు ఉద్ధాలు చేస్తారు. వారి పూజలు అనంతరం ఉద్దాలను ఊరేగింపుగా కురుమూర్తి దేవస్థానానికి తీసుకెళ్తారు. ఉద్దాల మండలంలో దళితులే అర్చకులు. ఇది చాలా అరుదైన విషయం.
ఉద్దాల ఉత్సవంలో స్వామివారి పాదుకలను తీసుకు వడ్డేమాన్‌కు చెందిన మేదరులు ప్రత్యేక చాటను తయారు చేస్తరు. దీపావళి అమావాస్య రోజు చాట తయారీ ప్రారంభిస్తరు. ఉత్సవం నాటికి పూర్తి చేసి దళితులకు అందజేస్తరు. దాంతో స్వామికి దళితుల సేవకు శ్రీకారం పడుతుంది.కురుమూర్తి స్వామి సన్నిధిలోని మరో ఆచారం మట్టికుండ. అప్పంపల్లికి చెందిన కుమ్మరులు దీనిని తయారుచేస్తరు. ఆ మట్టికుండను ‘తలియకుండ’ మండపంలో ఉంచి, నెల్లి వంశస్థులు పూజలు నిర్వహిస్తారు. ఆ సమయంలో భారీగా బాణసంచా కాలుస్తారు. డప్పు వాయిద్యాలతో మట్టికుండను ఉద్దాల మండపం వద్దకు చేరుస్తారు.
తిరుమలలోని ఏడుకొండలపై వెలసిన శ్రీవేంక స్వామికి ‘అలిపిరి మండపం’ ఉండగా ఇక్కడ కురుమూర్తి శ్రీవేంక స్వామి వారికి ‘ఉద్దాల మండపం’ ఉంది.
తిరుపతి లోలాగే ఇక్కడా విఘ్నేశ్వరుడి విగ్రహం లేదు.
తిరుపతిలో వలె ఇక్కడ కూడా ఏడు కొండల మధ్య వేంకటేశ్వరుడు కొలువై ఉన్నాడు
తిరుపతిలో వలె ఇక్కడా స్వామి నిలుచున్న భంగిమలో ఉన్నాడు.
తిరుమల కు మెట్లపై వెళ్ళేటప్పుడు శ్రీపాద చిహ్నాలు ఉన్నట్లుగానే ఇక్కడా ఉన్నాయి.
తిరుపతిలో దర్శనానికి వెళ్ళేటప్పుడు ‘మోకాళ్ళ గుండు’ పేర్న ఎత్తయిన కొండ ప్రాంతాన్ని పోలిన ప్రదేశం ఉంటుంది. కురుమూర్తి దర్శనానికి వెళ్ళ్తున్నప్పుడు అలాంటిదే కనిపిస్తుంది.
శేషశైలంలో స్వామి వారికి అలిపిరి మండపం లాగే ఇక్కడ ఉద్దాల మండపం ఉంది.[5]
ఇక్కడ కూడా ఆ స్వామి ఏడు కొండలపైనే కొలువుదీరడం విశేషం. ఆ కొండల వివరాలు...
శ్వేతాద్రి (బొల్లిగట్టు), (శ్వేత వర్ణం అంటే తెల్లని అద్రి అంటే కొండ, వాడుకలో బొల్లి అనేది కూడా తెలుపుకే వాడతారు)
ఏకాద్రి (బంటి గట్టు), (ఏక అంటే ఒక్కటి అని దానినే వాడుకలో ఒంటి అని కొండను గట్టు అంటున్నారు)
కోటగట్టు,
ఘనాద్రి (పెద్ద గట్టు),
భల్లూకాద్రి (ఎలు గులగట్టు), (భల్లూకమూ అంటే ఎలుగ్గొడ్డు లేదా బేర్)
పతగాద్రి (చీపుర్లగట్టు),
దైవతాద్రి (దేవరగట్టు)...
అనే ఏడు కొండల్లో దేవతాద్రి అని పిలిచే దేవరగట్టపైనే కురుమూర్తి వేంకటేశ్వర స్వామి కొలువై విరాజిల్లుతున్నారు.
......................
కురుమూర్తి శ్రీనివాస విషయకంగా ( ఇప్పటి పాలమూరు జిల్లా)
మా ముత్తాతగారు (అమ్మ శ్రీమతి కనకమ్మగారి తాతగారు) శ్రీమాన్ ధన్నవాడ కిడాంబి రాఘవచార్యగారు, (శ్రీమత్సకల జగజ్జేగీయమాన
విద్వత్కవిమణీత్యాది బిరుదాలంకృతులు, ప్రొద్దుటూరు వాస్తవ్యులు) కీర్తి శేషులు సవై రాజా శ్రీరామ భూపాలరావుగారిస్మృత్యర్థం, వారి శ్రీమతి, శ్రీమద్రాణీ సవాయి భాగ్యలక్షమ్మ బలవంత్ బహాదుర్ గారి ఆజ్ఞతో,(ఇలాగే
ముద్రింపబడింది) కృతజ్ఞతలతో ప్రొద్దుటూరు శ్రీజానకీముద్రాక్షర శాలలో, 1934లో 'శ్రీనివాస పాదుకార్పణ నాటక ప్రబంధం'( సంస్కృతంలో ఆరు
అంకములు),లక్ష్మీధ్యాన సోపాన స్తుతి (సంస్కృతం),లక్ష్మీమంగళ స్తుతి (సంస్కృతం) మణివిద్రుమహారము(ఆంధ్ర కావ్యము)లను (ఒక సంకలనముగా)ప్రచురించారు.సవై రాజా శ్రీరామ భూపాలరావుగారు, అమరచింతాత్మకూరు సంస్తానాధీశ్వరులప్పట్లో! మా ముత్తాతగారు కాశీ పండితులు! గజారోహణ గౌరవాన్నందుకున్నవారు కూడా!
...........................
వారి ఇతర రచనలుగా పేర్కొనబడిన గ్రంధాలు: 1.తర్క విషయ క్రోడ
పత్రం 2.గురు మౌఢ్య కాలిక యజురుపాకర్మ నిర్ణయహ 3.ధాతుకారికాహ 4.అద్వైత పద సమర్థనం 5.అష్తవధాన వదనిరాకరణం
6.సముద్ర తరణ దూషణం 7.అలంకరానుగమహ 8.విద్యాపదార్థోపన్యాసహ 9.బహువిద్యాయౌగ పద్యసాధనం10. విగ్రహారాధన సమర్థనం
11. శ్లోకోపన్యాస చతుష్టయం.(శాస్త్ర విషయక గ్రంధాలుగా పేర్కొనబడిన
గ్రంధాలలో కొన్ని)
ఇక రూపక గ్రంధాల జాబితానుంచీ కొన్ని1.శ్రవణానంద నామక ప్రేక్షణీకం 2.సంసృతోత్కర్ష వంవాదహ 3.మాణిక్య నగర వైభవం ప్రేక్షణీకం 4.నారాపుర
వేంకటేశ్వరోత్సవాదర్శం 5.కోదండ రామోత్సవ పద్యావళీ
6.శ్రీరామ పట్టాభిషేక పద్యావళీ
...........
వారి కొన్ని శ్లోకాలు:
శ్రీవృషాద్రిపతేర్నిత్య క్రీడోత్పత్యేక హేతవే,
కస్త్యై చిదద్భుత జ్యోతిహి పరిణత్యై నమో నమహ .....
సంప్రీణాతి ప్రపద యుగళం ప్రాప్యమేహృన్మరాళహ
క్షొణీపుత్ర్యా విహరతి నఖ స్నిగ్ధ రోచిస్స్రవంత్యాం
బ్రహ్మేంద్రాది త్రిదశ వనితా మౌళి మాణిక్య మాలా,
రోచిర్వీచిస్స్రుజతి సతతం యత్ర లాక్షారసాభం.....
నానారత్నవ్యతికర కనత్కంచుళీ జాత శోభౌ
ముక్తా దామ ప్రకర శబల శ్రీహితౌ లోక మాతుహు
వక్షోజాతావధరితవయో జాతకోశౌ మురారే
శృంగారాబ్ధి ప్లవన కలితౌ హేమ కుంభౌ ప్రతీమహ ............
నేత్రద్వంద్వ స్ఫుటదళరుచం స్మేర కాశ్మీర రేఖా
మాధ్వీరమ్యం వదన కమలం భాతుచేతస్సరస్యాం
భృంగాయంతే యువకులమణేర్వక్త్ర పాధోజదేశే
సాభిప్రాయస్మిత సబళితా యత్ర జతాహ్ కటాక్షాహ్ ..........
గుంభితాసుషమాలైషా దశభిశ్లోక మౌక్తికైహి
వినిక్షిప్తాహ శ్రియహ్ కంఠేతనోతు మనసే ముదం..
(లక్ష్మీధ్యాన సోపాన స్తుతి నుండి)
.........................
No comments:
Post a Comment