Saturday 30 December 2017



వేదాంత దేశికుల వారి' గోదా స్తుతి '   శ్లోకానుసరణ
....................
ఆ.  పుడమి పుత్రిగోద ! పుట్టె వాల్మీకినీ
కర్ణ పుటము  నుండిగాదె నిజము ?
పంకజ ముఖి, నీదు పద బంధ గ్రంధముల్
 సుధ  లొలుకునటన్న    జోద్యమౌనె?   (7)
కం. నీవలె భగవంతుని దమ
దౌ వలపున గొలిచి దనియ దలచిరి  గురువుల్   
భావము, భాషలలో, లయ
మో, విరహమొ,   వారి రచన  మురిపెము గనగా. (8) 

(లయము = సంగమము)   

Friday 29 December 2017

వేదాంత దేశికుల వారి' గోదా స్తుతి '   శ్లోకానుసరణ
........................

. కైటభ వైరి నీదు ప్రియ కాంతుడు మెచ్చెడు రీతి భాషయున్,


తేటగ  నాదు వాక్కునను   దేవ పరిత్రము నింపుజేసియున్  

దీటగు రత్న కింకిణుల  దివ్య ధ్వనీ సమ శబ్దమర్థముల్,   
మాటల నేర్పు దల్లి, దయ, మామక  స్తోత్రమునందు  పూన్చుమా !! (3)
..................
కం. గోదానీ రచనల సిరి
యా దామోదరుని లీల  యమునన్  దడవెన్
రాదా,  గురు కృప,  మధురస
గాధా  యుత ప్రజ్ఞ,  నీదు గరుణన్కవులన్. (4)
........................

చంపకమాల (సరసీ)(పంచపాది)

పరమునొసంగి బ్రోచు దన భక్తుల నక్షరుడంద్రు  గాని దన్
పరమని దల్చనట్టి మము బాళిని బ్రోచు ముకుందుడేలనన్
దిరమగు రీతి నీ కురుల దీర్చిన మాలల గట్టివేసి బల్ 
సురసపు గీత మాధురిని సూరిని నీ దెస దిప్పికొంచు, నీ
దరి తరి జేరినట్టి మము తాలిమి బ్రోవన బ్రోవకుండునా? (5)
.........................

చంపకమాల (సరసీ)(పంచపాది)

అధరములందు రక్తిమను  గాంచిన యౌనగు  శోణ హ్రాదినీ
సుధ, మరి గుబ్బ జన్నులను జూచిన యౌనగు తుంగభద్రవాక్
సుధ లను దోచు శాబ్ది గను, శుద్ధ   రసామృత భావనమ్మునన్ 
మథనము జేయనౌ  విరజ మాతయె, 'గోద'  'స్వ' భావమమ్మ, నీ   

మధు మధనమ్ము   తోన యజమానుని  సద్మపు నర్మదౌదువే. (6)  
......................


Tuesday 26 December 2017


వేదాంత దేశికుల వారి' గోదా స్తుతి '   శ్లోకానుసరణ

కం. గోదానీ రచనల సిరి
యా దామోదరుని లీల  యమునన్  దడవెన్
రాదా,  గురు కృప,  మధురస
గాధా  యుత ప్రజ్ఞ,  నీదు గరుణన్కవులన్. (4)
చంపకమాల (సరసీ)(పంచపాది)
పరమునొసంగి బ్రోచు దన భక్తుల నక్షరుడంద్రు  గాని దన్
పరమని దల్చనట్టి మము బాళిని బ్రోచు ముకుందుడేలనన్
దిరమగు రీతి నీ కురుల దీర్చిన మాలల గట్టివేసి బల్ 
సురసపు గీత మాధురిని సూరిని నీ దెస దిప్పికొంచు, నీ

దరి తరి జేరినట్టి మము తాలిమి బ్రోవన బ్రోవకుండునా? (5) 



Sunday 24 December 2017

కం.  శ్రీకరమగు శోభలతో
శ్రీకాంతుని జేరితీవు శ్రీ గోదా ! యా 
శ్రీకరు  తిరు  గీతమ్ముల      
శ్రీ కమలములందు  బూన్ చి  శేముషితోనన్...
..................
తే. విష్ణు చిత్తులవారిదీ  విరుల తోట
జిష్ణు మది దోచి నట్టి సంజీవ శక్తి
విమలమైనట్టిదా దివ్య వినయ శోభ 

అనుసరణ సుఖమున  దక్కునమృత పదము.....


మత్తేభవిక్రీడితము
పెరియాళ్వారుల వంశ నందనవుగా వీవేగదా గెల్చితే
హరి హృత్ చందన వృక్ష  కల్ప లతికై, యా లక్ష్మి రూపమ్ముతో
వరకాంతా సమ కారుణీ గుణముతో భాసిల్లు గోదా ! నినున్
శరణంబంటిననన్య భక్త   హృదితో, సౌజన్యమున్ బ్రోవవే.  (1)
ఉత్పలమాల
ఆగమ వ్యాఖ్యలౌ నజయ మా  మహిమన్ బొగడంగ సాధ్యమే ?
నీ గరిమన్ నుతించదగు నెయ్యపు నావగు వ్యాఖ్యలున్నవే?
నీ ఘన దివ్య భవ్యమగు  నెయ్యము వంటి గుణంబులే ననున్

వేగిర పెట్టుచున్నవిట,వీడుము మౌనమటంచు  దల్లి  రో !!! (2)