వేదాంత దేశికుల వారి' గోదా స్తుతి ' శ్లోకానుసరణ
....................
ఆ. పుడమి పుత్రి, గోద
! పుట్టె వాల్మీకి, నీ
కర్ణ
పుటము నుండి, గాదె
నిజము ?
పంకజ
ముఖి, నీదు పద బంధ
గ్రంధముల్
సుధ లొలుకునటన్న జోద్యమౌనె? (7)
కం. నీవలె భగవంతుని
దమ
దౌ వలపున గొలిచి
దనియ దలచిరి గురువుల్
భావము, భాషలలో,
లయ
మో, విరహమొ, వారి రచన
మురిపెము గనగా. (8)
(లయము
= సంగమము)
No comments:
Post a Comment