పీలులవిగో నరచుచున్నవి భూరి శంఖద్వనుల వినుడే
చల్ల నవ్వుల విషము గుడిపిన శఠత దునిమిన బుడతడితడే
నీల గాత్రుని చేత జచ్చెను నీచ శకటాసురుడు, వినుడే,
వేల నమరుల స్వామి గా వేవేతలల ఫణిశాయి గనుడే,
పలుకువాలుల కీర్తనమ్ముల వారిశుడు వేదార్థ తనుడే,
మెల్ల మెల్లగ గనుల విప్పుడె, మినుకుటూర్పులవానిబొగడుడె,
మేలు మీకగు సకియలారా! మెలపునందగ వాని జూడుడె.

No comments:
Post a Comment