Monday 25 May 2015

Nela Nela Telugu Vennela 6 ava Varshikothsavam Part 3



 మా అయ్యగారి ప్రియ శిష్యుడు, జగద్విఖ్యాత అవధాని శ్రీమాన్ నరాల  రామారెడ్డిగారి  గురు ప్రశంస. నెల నెలా తెలుగు వెన్నెల   వేదిక  పై...  

Friday 22 May 2015

ఆనాటి తెలుగు వెన్నెల. మదినిండా చల్లని కాంతులను నింపింది.

 ఎటువిన్నా కమ్మనైన పలుకరింపులు. ఎటు చూసినా, సంప్రదాయ

 వేషభూషలు. పకోడీ ఘుమ ఘుమలు, తేనీటి విందుతో తెలుగు

 ముంగిట్లోనే ఉన్నానన్న ఆనందాన్నిచ్చిన తెలుగు వెన్నెల నిర్వాహకుల

భావి కార్యక్రమలుకూడ, మరింత వైభవోపేతంగా జరుగుతాయన్నది కూడా

అక్షర సత్యం. ఆనాటి మరిన్ని ముచ్చట్లు ఇవిగో- నా ప్రియ ముఖపుస్తక

మిత్రుల కోసం..( సహృదయ కవయిత్రి, సుమధుర గాయని, కార్యక్రమ

 సంయోజకురాలు శ్రీమతి సింగిరెడ్డి శారదగారి ఆదరపూర్వక ఆతిధ్యానికి

ప్రత్యేక కృతజ్ఞతలు).....(Participated as Chief guest in 'Nela nela

 Telugu Vennela ' 94t edition of TANTEX - the most 

prestegious programme of our TELUGUS in Dallas on 17th 

May)








Tuesday 12 May 2015




                       ఎంతో యెత్తున ఆకాశగమనం..
                      ఎంతొ అవసరం-రెక్కల్లొ శక్తి.
                      మరెంతో అవసరం, గమ్యం చేరుకునే యుక్తి. 
                      ఐనా-అడుగు వెనక్కి పడదు.
                      కారణం..
                      మరికొన్ని రోజుల్లో
                      వూపిరి పోసుకోనున్న
                      తన చిన్నారి పిల్లలు, 
                       తన ప్రతి రుపాలకు వెచ్చటి గూదూ,
                      కమ్మటి తిండీ,
                      మెత్తటి ఒడీ..
                      వీటన్నిటి కోసం,
                      విహంగ మాతల వలస ప్రయాణం..
                      ఆ ఆత్మ విశ్వాసం ముందు
                     వేలమైళ్ళ దూర తీరాలు..
                     అరచేయంతేగా!!
                    మాతృత్వ మాధురిముందు,
                    తలవంచుతాయి- అశక్తతలు!!
                    అమ్మతనం ఆజ్ఞలకు 
                    దూరాలు దగ్గరవుతాయి మరి!!
                                  (ఈ రోజు వలసపక్షుల దినోత్సవం) 

       
   
   

            

Tuesday 5 May 2015

Begging is being practiced as an ART in our country. right friendz? Near traffic signals, near temples, in Railway station and bus stops....every where....Children specially are kept in this profession, by asking to approach the people half-clothed, or in no clothing even. Handicapped children and elders too also play important role in this. They make us embarrassed some how and  make us give some thing. Some healthy people take the fotos of GODS and beg on the name of Baba, venkateswara or Ganesa. This is one type of exploiting too. 

But here in New Jersy, I very  hardly saw beggars. even if I saw, i saw very very few of them not in groups , very lonely like here in pictures.My daughter didn't allow me to take their pictures.
                 



She also told me that for the beggars who are homeless, some homes will be there to give them shelter in the nights only for sleeping. Again in the morning they have to go out into the streets along with their small luggage. 'cause of limited place, there will be Qs right from 3 or 4 pm and on FIRST COME FIRST SERVED basis the place will be given and as the beds are over, no people are allowed in side. people become beggars due to their bad habits or spending money in their own fashion very luxuriously or drug using.Begging in our places is comparatively very horrible. The main cause of it being over population. How to control this?  
 

Sunday 3 May 2015

      స్వాగతం..స్వాగతం...
     వసంతాగమన వేళల కవితాత్మను దర్శించగ...
     స్వాగతం ..స్వాగతం... 
     కొమ్మ కొమ్మలందున విరబూస్తున్నవి కవితలు
     గుత్తులుగా కొంగ్రొత్తగ పిలుస్తున్న కవితలు
     మలయానిలమునకు పాట నేర్పుతున్న కవితలు  
     రంగులలో రాగాలను అలదుకున్న కవితలు
     పసుపు,యెరుపు, హరిద్రాల సముద్రాల కవితలు...
     కపోతాల రెక్కలపై విహరించే కవితలు..
     చిన్ని పిచుక ముక్కు కొసన మెరుస్తున్న కవితలు
     ఉడతపిల్ల పరుగులలో కిసుకుమనే కవితలు
     నీళ్ళలోన బాతు వెంట యీతకొట్టు కవితలు..
     గగనవీధి జలదాలుగ విహరించే కవితలు,
     పచ్చగడ్డి మనసల్లే లెత లేత కవితలు

     బాటలంట కలసి నడిచి కవ్వించే కవితలు 
     వీడని చిరునవ్వుల మహరాణులైన కవితలు..
     వసంతకవితాగానం దృశ్యమానమిక్కడ 
     వివిధ వర్ణ దృశ్య ధ్వనుల కావ్యగానమిక్కడ, 
     ప్రతి నిమిషం ఒక వినూత్న చేతనకావేశం,  
     ప్రతి ఊపిరి ఒక నూతన జీవిత మధుకోశం.. 
                             యెడిసన్, న్యూజెర్సి 3-5-15  
                





   
   
   

Friday 1 May 2015







 

       ప్రపంచ కార్మిక దినొత్సవం నేడు. కష్టే ఫలీ అన్న ఆర్యొక్తి మన నరాల్లో యేనాడో జీర్ణించుకుని పోయింది. కష్టానికి తగిన ఫలం లభించినపుడు,సంతోషం, దక్కనపుడు, ఆవేదన కలగటం సహజం. తద్వారా ఆక్రోశం..ఆందోళన.. యీ విషయాని గాధాసప్తశతీకారుడు యెలా చిత్రించాడో చూడండి.
     యే వస్తువునైనా పగ్గం పట్టి లాగినపుడు, ఆ వస్తువు బాగా బరువుండి లేవనప్పుడు, అప్రయత్నంగా,మన నోటినుందీ, కేకలు వెలువడుతాయి. వర్షాకాలం. వర్షం బాగా కురుస్తోంది. వురుములూ వినిపిస్తున్నాయి. గాధాకరునికి, యీ దృశ్యం చూడగానే, ఒక ఆలోచన వచ్చింది. 
            అవిరల పడంత ణవజల ధారా రజు ఘడి అం ప అ త్తేణ 
            అపహుత్తో వుఖ్ఖేత్తుం రస యీవ మేహో మహిం వుపహ (5/36)
     మేఘుడనే కార్మికుడు, అవిశ్రాంతంగా, భూమిని పగ్గాలు పట్టి పైకి లాగడానికి   ప్రయత్నిస్తున్నాడు. లాగలేకపోతున్నాడు. మూల్గుతున్నాడు. అవే యీ వురుములు కాబోలు!అద్భుతంగా ఉంది కదూ!   
     అది కెవలం ఒక కార్మికునికే సంబంధించింది. కానీ, ఆ కృషి సమిష్టిగా మారినప్పుడు,ఉద్యమమవుతుంది. ఇదే సత్యానికి ప్రతీక యీ రోజు.  
  ఈ దినోత్సవ సందర్భంగా,ఇదిగో నా గీతం..
            కార్మిక సోదరులారా! కదలిరండు నేడు, 
            కర్మవీరులందరికీ, పండగోయి నేడు.......
                జగమంతా జరుగుతోంది, ఆనందపు సంబరం
                మనమంతా కలిస్తేనె జగతినిండు సంతసం....
            నేల నింగి నీరూ, యెటు చూసిన కార్మికులే,
            సూర్యచంద్రులేకాదూ, తారకలూ కార్మికులే...  
            ప్రతి ఋతువూ, ప్రతి గ్రహమూ కార్మిక బంధువులే.....
                నియమ బద్ధ జీవితమే కావాలోయ్ ప్రగతికీ 
                హక్కులెన్ని వున్నా బాధ్యత కూడా మరువకోయ్,
                 యేకాగ్రత నాణ్యతలే మనకు వేద మంత్రాలూ,
            మానవతా నినాదాలె ఉపనిషత్తులూ...
                    విశ్వాసం పెంచే ఒక మాట మనకు వెలుగూ, 
                    సర్వస్వం ధరపోయ మనదే ముందడుగూ, 
                    భవితవ్యం, బంగారం  కార్మిక బృందావనిలో,
                    నిత్య వసంతం కార్మిక జీవన రస ధునిలో... 
     (ఆకాశవాణి కార్మికుల కార్యక్రమంలో మే డే రోజు ప్రసారితం) ..1/5/15