Sunday, 3 May 2015

      స్వాగతం..స్వాగతం...
     వసంతాగమన వేళల కవితాత్మను దర్శించగ...
     స్వాగతం ..స్వాగతం... 
     కొమ్మ కొమ్మలందున విరబూస్తున్నవి కవితలు
     గుత్తులుగా కొంగ్రొత్తగ పిలుస్తున్న కవితలు
     మలయానిలమునకు పాట నేర్పుతున్న కవితలు  
     రంగులలో రాగాలను అలదుకున్న కవితలు
     పసుపు,యెరుపు, హరిద్రాల సముద్రాల కవితలు...
     కపోతాల రెక్కలపై విహరించే కవితలు..
     చిన్ని పిచుక ముక్కు కొసన మెరుస్తున్న కవితలు
     ఉడతపిల్ల పరుగులలో కిసుకుమనే కవితలు
     నీళ్ళలోన బాతు వెంట యీతకొట్టు కవితలు..
     గగనవీధి జలదాలుగ విహరించే కవితలు,
     పచ్చగడ్డి మనసల్లే లెత లేత కవితలు

     బాటలంట కలసి నడిచి కవ్వించే కవితలు 
     వీడని చిరునవ్వుల మహరాణులైన కవితలు..
     వసంతకవితాగానం దృశ్యమానమిక్కడ 
     వివిధ వర్ణ దృశ్య ధ్వనుల కావ్యగానమిక్కడ, 
     ప్రతి నిమిషం ఒక వినూత్న చేతనకావేశం,  
     ప్రతి ఊపిరి ఒక నూతన జీవిత మధుకోశం.. 
                             యెడిసన్, న్యూజెర్సి 3-5-15  
                





   
   
   

No comments:

Post a Comment