Sunday 25 October 2015

maa ayyagaru:       మన దేశం, తత్వవేత్తలకూ, ఆధ్యాత్మిక గురువులకూ...

maa ayyagaru:
      మన దేశం, తత్వవేత్తలకూ, ఆధ్యాత్మిక గురువులకూ...
:       మన దేశం, తత్వవేత్తలకూ, ఆధ్యాత్మిక గురువులకూ చాలా పేరొందినది. ఆయా కాలాలలో పలువురు ఆధ్యాత్మికవేత్తలు దేశ భవితను తీర్చిదిద్దే ప్రక్రి...

Tuesday 20 October 2015

Interview with Padmasri Dr Shobharaj - New Jersey - USA - TV9 (interviwer- Vamsipriya)


Dear friendz.....
Here is the interview with 'Padmashri' Shobharajugaru at USA. My dearest daughter chi. sow. Vamsipriya has done this interview with Annmayya Padakokila.



Saturday 17 October 2015

Srunaralahari - Kirthana in Raga Nilambari (My dream fulfilled)


........................
చిన్నప్పుడు సంగీతం నేర్చుకోవటం 8,9 సంవత్సరాలప్పటినుంచీ మొదలైంది. యీపాట 12,13 సంవత్సరాలప్పుడు నేర్చుకుని వుంటానేమో! యీ కీర్తనంటే నాకు మహాఇష్టంగాఉండేది.నీలాంబరి రాగం అదో విధమైన హాయినిస్తుందని అప్పుడే అనిపించేది. తీరాచూస్తే మన వుయ్యాలపాటలన్నీ ఆరాగంలోనే యెక్కువగా వుంటాయనీ, పిల్లలు హాయిగా మైమరచి నిద్రలోకి జరుకుంటారనీ తరువాత తెలుసుకున్న వాస్తవం. దేవినవరాత్రులలొనైనా యీపాట పాడాలని దృఢంగా నిర్ణయించుకున్నా,  యేదో సంకోచం. నా గొంతులో ఇప్పుడు ఎలాఉంటుందోనని! ఐనా, నీలాంబరిపట్లనాకున్న మక్కువా యీపని చేయించిందంతే! చిన్నప్పుడు, పల్లవి,అనుపల్లవి, చివరి చరణమే నేర్చుకున్నా, నెట్ లో ఉన్న మరిరెండు చరణాలూ బాగున్నాట్టనిపించి, వాటినికూడా తీసుకోవటం జరిగింది. లింగరాజు అర్స్ యెక్కువ రచనలు చేయకపోయినా, యీ ఒక్కటే వారిని చిరంజీవినిచేసిందని నాకనిపిస్తుంది. మీకేమనిపిస్తుందో మరి! 
  
      శృంగారలహరీ..ఆశ్రితజన శుభకరి...
             సంగీతా భోజానంద
             మధు మాధురి మృదు మధుకరి
             మంగళాంగి మదనారి మనోహరి...శృంగారలహరీ..
       వదనశశీ కళంకిత మృగమద తిలకే
       విబుధావళిపూజితె,
       మదన వైరి సంపున మముదిత పులకే 
       త్రిపుర రాగ రసికే మృగశారికే  
       సదయమే హృదయ కైరవ చంద్రికే..శృంగార లహరీ..
             తరుణ తరణి కిరణారుణ మృదుచరణే 
             బందూ, సుఖ కారణె, 
             చరణ చరణ భరణాదృత నిజ కరుణే, 
             సరసగుణాభరణే కలవారణె,
             గిరి తనూజె జగదాదిమ కారిణె....శృంగారలహరీ..    
      అంగజారి హృదయాగమ దరహసితే అఖిలాగమసన్నుతె
      భృంగచికుర కరుణారస భర భరితే,
      తుంగజఘన లలితే సురసేవితె
      లింగరాజ   వచనాంబుజ  పూజితె...శృంగారలహరీ..
                                              దేవీ నవరాత్రుల సందర్భంగా భక్తితో..


Saraswathi Devi Mangala Harathi | Sampradaya Mangala Harathulu | 54

Tuesday 13 October 2015

                                              
                                       తిరుమల రామచంద్ర 



     నా చిన్ననాటి సంస్కృత పండితులలో సాహిత్య చక్రవర్తి కుంటిమద్ది శేషాచార్యులు. చాలా విఖ్యాతులు. అప్పుడు, వున్నత పాఠశాలలోనూ ఆంగ్లంలోనే బోధన జరిగేది కనుక సంస్కృతాన్ని ఆంగ్లంలో బోధించేవారు. శ్రీనివాసాచార్యులవారు అప్పుడే వెలువడిన భండార్కర్ రీడర్లను విద్యార్థులతో కంఠోపాఠం చేయించేవారు. ఆయన పుత్రులలో ఒకరు తిరుపతిలో నా సహాధ్యాయుడు కుంటిమద్ది శేషశర్మగారు. వ్యాకరణాలంకార వెదంత శాస్త్రాలలో గొప్ప విద్వాంసుడు. మనుచరిత్ర, ఆముక్త మాల్యద మున్నగు తెలుగు కావ్యాలను సంస్కృతీకరించి, ఇతర రాష్ట్రాల సంస్కృత విద్వాంసులకు చుబ్బన చూరలిచ్చిన కవివతంసుడు. మైసూరు  పరకాలమఠం ఆస్థాన పండితుడు.
       శ్రీనివాసాచార్యుల అనుజుడు కుంటిమద్ది రామాచార్యులు. ఈయన అవధాన ప్రక్రియను స్వాయత్తం చేసుకున్నవారు. భాగవత, భగవద్గీతలలో యీ పదం యే అక్షరం యెన్నిసార్లు ప్రయుక్తమైందీ యీయనకు కరతలామలకం. 
      ఒకమారు బళ్ళారి-అనంతపురం  జిల్లా కలెక్టర్ యీయన అవధానం కేవలం ఈ సాహిత్యంలోనేనా? అని ప్రశ్నించారట! యే విషయమైనాసరే! అన్యభాష ఐనా సరే! అన్నారట ఈయన! అప్పుడు కలెక్టర్ వీరిని పరీక్షింపగోరి, వంద యూరోపీన్ జంటలను  సమావేశపరచి, రామాచార్యులుగారికి, వారిని (ఇతడు ఫలానా, ఈమె ఇతని భార్య అని) పరిచయం చేయించి, మూడు నాలుగు గంటలపాటు విందులూ వినోదాలూ నాట్యాలూ జరిగిన పిదప మరల సమావేశపరచి, చెల్లాచెదురుగా  వారిని కూర్చోబెట్టి, రామాచార్యులను పిలచి, స్వామీ!   మీకు మూడు గంటలక్రితం పరిచయంచేసిన దంపతులను పేరుపేరునా పిలిచి వారెక్కడెక్కడ వున్నారో కనుక్కుని ఆహ్వానించండి అని కోరాడట! అవధానిగారికి తెలుగు, సంస్కృతం, తమిళం, కన్నడం తప్ప మరే  భాషా రాదు. ఆయన  స్టోన్ గారూ! దయచేయండి.  శ్రీమతి ఎలిజబెత్ గారూ!అమ్మా! దయచేసి మీ భర్త ప్రక్కన నిలుచోండి, అంటూ రెండువందలమందినీ పేరుపేరునా పిలిచి గుర్తించి నిర్దిష్టకాలంలో సమావేశపరచారట! కలెక్టర్ ఆశ్చర్యపడి, ఆయనపై ప్రశంసావర్షం కురిపించాటమేకాక,తక్కినవారుకూడా ఆయన ధారణాపాటవాన్ని కొనియాడారట!
                                               తిరుమల రామచంద్రగారు,

                                    (రూపనగుడి నారాయణరావుగారి ఆర్యసుభాషితములు -మొదటిభాగము అభిప్రాయంలో)
(తిరుమల రామచంద్రగారంటే నాకు గొప్ప ఆరాధన. మా అయ్యగారివలెనే, యెంతో వినయ సంపన్నులువారు. మీదు మిక్కిలి, యెంత జ్ఞాన సంపన్నులో, అంత  నిరాడంబరులు. యెంత గంభీర హృదయులో, అంత హాస్య చతురులు కూడా! వారి ఇంటికి వెళ్ళీ ఒకసారి కలిసినప్పుడు స్వయం పాకం చేసుకుంటున్నారు. నేను కూరగాయలు తరిగి ఇస్తానన్నా, ఒప్పుకోలేదు. నేను తరిగే ప్రమాణంలో నీవు తరగలేవులేమ్మా!నా కొలతలూ నా రుచులూ నావి! అని సున్నితంగా వద్దనేశారు! వారిదగ్గర కొన్ని రోజులు శిష్యరికం చేద్దామని పథకం వేసినా,
 ఫలించకపోవటం- నా దురదృష్టంగా ఇప్పటికీ బాధపడుతూనే ఉంటాను.)

Friday 9 October 2015


..........................
                                                        విజయ విజ్జిక  

                                   नीलोत्पलदलश्यामां विज्जिकां मामजानता ।
                                    वृथैव दण्डिना प्रोक्ता सर्वशुक्ला सरस्वती ॥

                                nīlotpala-dala-śyāmāṃ vijjikāṃ mām ajānatā
  
                               vṛthaiva daṇḍinā proktā sarva-śuklā sarasvatī

                                  నీలోత్పల దళశ్యామాం విజ్జికాం మాం అజానతా

                                 వృధైవ దండినాప్రోక్తా సర్వశుక్లా సరస్వతీ...

     'నల్లకలువ రేకుల వంటి వర్ణమున్న నేను తనకు తెలియకపోవటంవల్లే, మూర్ఖుడైన దండి సరస్వతీ దేవిని తెల్లనివర్ణంకలదని వర్ణించాడు. (నేనే అతనికి తెలిసి ఉండి,  నా రచనలనతడు చదివి వుంటే - యీ పొరపాటు చేసి ఉండేవాడు కాడని ఇందులోని ధ్వని.) 

విజ్జిక అన్న కవయిత్రి ఎంతో ఆత్మాభిమానంతో చెప్పిన యీ శ్లోకం- ఆమె కౌశల్యానికి తార్కాణంగా నిలుస్తున్నది. 
  
                           సరస్వతీవ కర్ణాటీ విజయాంబా జయత్యసౌ,
                          యా వైదర్భ గిరాం వాస :  కాళిదాసాదనంతరం. 
10 వ శతాబ్దానికి చెందిన రాజశేఖరుడు, కాళిదాసు తరువాతి వారిలో 
వైదర్భీరీతిలో రచనలు చేసేవారిలో విజయాంబమాత్రమే  పేర్కొనదగినదన్నాడు.దండిమహాకవికి  సమకాలికురాలో, లేక కాస్త తరువాతదిగానో పరిగణింపబడే యీ విజ్జిక (విజయాంబ)వ్రాసిన  కౌముదీమహోత్సవమనే సంస్కృతనాటకం పై కాళిదాసు ప్రభావం కొట్టవచ్చినట్టుగా కనిపిస్తుందంటారు. కీర్తిమతీ కల్యాణ వర్మల ప్రణయం-మొదటిభాగం.  కాగా,  పాటలీపుత్ర రాజు సుందర వర్మ మంత్రి, మంత్రగుప్తుని పన్నాగం - రెండవ భాగం. 7వ శతాబ్దం నాటి, ఒకానొక కర్ణాటక రాజు పత్నిగా 
మాత్రమే వివరాలు తెలియవచ్చిన యీ కవయిత్రిగురించిన మరో శ్లోకమిది. 
          ఏకోభూత్ నలినాత్ తతశ్చ పులినాత్ వల్మీకతశ్చాపర :

          తేసర్వే కవయ :  ప్రసన్నమతయ :  తేభ్యో మహద్భ్యో నమ : 

          అర్వాంచో యది గద్య పద్య రచనా చాతుర్యమాతన్వతే 
      
          తేషాం మూర్ధ్ని  దదామి వామ చరణం కర్ణాట రాజప్రియా.

 'బ్రహ్మ, వ్యాస, వాల్మీకులు, పద్మము, మృత్తిక, వల్మీకములయందు
పుట్టిన ప్రాతహ్ స్మరణీయులు. వారికి నా నమోవాకములు.నా సమకాలిక 
కవులెవరైనా, నా ముందు వారి విద్యను ప్రదర్శింపదలిస్తే, కర్ణాట పట్టమహిషిగా, నా వామచరణాన్ని(యెడమ)  వారి శిరసుపై ముందు మోపుతాను.'      

  పై శ్లోకంలోని 'తేషాం మూర్ధ్ని' బదులుగా, 'తేషాం వామ చరణం'

 (క్రియాపదం 'మమ మూర్ధ్ని దదామి' ) అని మార్పుచేస్తే, 'యెవరైనా, గద్య 

పద్యాలలో నన్ను మెప్పిస్తే, వారి వామపాదాన్ని నేను నా శిరసుపై ధరిస్తాను' 

అన్న అర్థం వస్తుంది. దండికవి, వ్యాస, వాల్మీకులకు సమ వుజ్జీగా అప్పట్లో

 గుర్తింపు పొందాడుకాబట్టి, అతన్నే ఉద్దేశిస్తూ  విజ్జిక,  పై శ్లోకం 

చెప్పిందంటారు కూడా!  
  
                                జాతే జగతి వాల్మీకౌ శబ్ద :  కవిరితి  స్మృత : 

                                కవీ ఇతి తతో వ్యాస : కవయశ్చేతి దండిని. 

 వ్యంగ్యంగా దండిని ఇక్కడకూడా పేర్కొనటం చూస్తే, విజ్జికకూ, దండికీ, కొంత 

భేదాభిప్రాయాలు అప్పట్లో ఉండేవని తెలుస్తున్నది. యేది యేమైనా, అటు 7వ శతాబ్దనికో, ఇటు 10వ శతాబ్దానికో చెందిన యీ  కర్ణాటక  సామ్రాజ్య 

పట్టమహిషి విజ్జికను 9వ శతాబ్దానికి చెందిన ముకుళభట్టూ, 11వ శతాబ్దానికి

చెందిన మమ్మటుదూ, భోజుడూ, 13వ శతాబ్దానికి చెందిన విశ్వనాధుడూ- 

కీర్తించారు. 

     యీ రచన వ్రాతప్రతి ముందుగా కేరళకు చెందిన రామకృష్ణకవికి 

లభ్యమైంది.    రామకృష్ణ కవే యీ కౌముదీ మహోత్సవ రచనను 
ముద్రించాడు. కానీ, అతనికి లభ్యమైన ప్రతిలో రచయితపేరు విజ్జికే 
అనటానికి  తగిన ఆధారాలు అందటం లేదు.'కయా నిబద్ధం' అని మాత్రమే 

 ఉండటంవల్ల (అంతకు ముందు అక్షరాలు,  అస్పష్టంగా వుండటంవల్ల, )   'విజ్జికయా నిబద్ధం' అనేందుకు తగినట్టుగా ఉందని కొందరు

  పరిష్కర్తల అభిప్రాయం. 
  
  పైగా, ఒకానొక కర్ణాటక చాళుక్య రాజు విజయాదిత్యుని రాణి, విష్ణువర్ధనుని 

తల్లి విజయ కాగా, మరొక కర్ణాటక చాళుక్య రాజు  విజయాదిత్యుని భార్య పేరు విజయమహాదేవి  అని తెలుస్తున్నది. 

            మీను విజయాదిత్యో సూర్యాన్వయ సముద్భవాం, 

            వుపయేమేథ విజయాం, మహాదేవీం, మహీసమాం. 

  బాదామి చాళుక్య రాజైన రెండవ పులకేశి కోడలూ, చంద్రాదిత్య మహారాజు

 అర్ధాంగీ ఐన మరో విజయకూడా ఉన్నట్టు తెలుస్తున్నది. నృపతుంగుని 

సేనాధ్యక్షుడైన బంకేశుని శ్రీమతి, విజయ కూడా చక్కటి కర్ణాటక కవయిత్రేననంటున్నది  చరిత్ర. 

  ఇంతకూ, కౌముదీమహోత్సవ కవయిత్రి వీరిలో యెవరో స్పష్టంగా 

తెలియకపోయినా, దండిని ఢీకొన్నవిజ్జిక అన్న ఒక కవయిత్రి చరిత్రలో ఉండేదన్నది మాత్రం సత్యమే కదా!

జయహో విజయా! జయహో మహిళా!    
..................................

Friday 2 October 2015

Bhuvaneswara...A Non denominational Song of Sri Mallavarapu Visweswara R...

Friendz....
 Bhuvaneswara...This song is written by Shri Mallavarapu viswesara raogaru. I learnt this as a student of 'Yee Pata Nercukundam' broadcast by AIR Hyd. during 1985. I love this for it's commitment for peace and prosperity of the struggling souls in this bad bad world. though this is carrying the message of BRAHMA SAMAJAM ideology (as said by Sri Chittaranjangaru) this sounds as the inner voice of Tagore to me. I feel the world is not much changed from BAD BAD of then times and even it had become triple BAD now. Bhuvaneswara! Pl. save the man-kind by ur torch of WISDOM.