Sunday, 14 January 2018

వేదాంత దేశికుల వారి' గోదా స్తుతి '   శ్లోకానుసరణ

ఆ . విష్ణు చిత్తు బిడ్డ, విష్ణు చిత్తము నీది 
వలజ   కంజమమ్మ వాణి నీది
చలువరేని బ్రతిగ జలధిజ యనుజగ
సుజనులు దలచేరు  సుగుణవల్లి.                 
(వలజ = భూమి; కంజము = అమృతము)  (9)  
ఉ.. సంస్తుతి  కొంత జేసినను సంతసమొందెడు మాధవుండు నీ
క్షాంతువు   జేసినట్టి శత సన్నుతులేలొకొ  ద్రోసిపుచ్చె, యా
మంతనమేదొ దెల్పు   యజయుండిటు   యాతని మెచ్చుటెట్లు? నీ
దౌ తల  వాసనల్ యడరు తావడ  బ్రాణదు  పూజ చేయుటా (10)
 (క్షాంతువు=తండ్రి) (తావడము=మాల, హారము
ఆ . పశ్చిమమ్ము గూడ పావనంబయ్యెగా
పుణ్య రాశి,నీ ప్రభూతి వలన      
వీడడమ్మ దాను ప్రీతి, రంగేశుడు
నీదువలన నిజమునిదురలోను. (11)
ఆ . పుడమికిచ్చు గోద పున్నెములను నీదు
పేరు పొగెముతోన    నలినములను
గంగ, యమున నదులు గావేరియౌను పా  
వనము మైత్రివల్ల గోదతోను.  (12th )
కం. కోమలి, నీ వలచిన వరు
డీ ముదుకడ? శయ్య బాము,దేరిక వాజా?
మనువెటు? సఖుల బలుకు,     
నీ మధు హాసమ్ము దెలిపె నెమ్మగు వలపున్.. (13)
 (అచ్చు ఆధారంగా సంధియుత మైత్రి) 
తేటగీతి(పంచపాది)
శిరసు ధరియించె నీ ముక్త  మాలికలను
నాథు మస్తక  సౌందర్య   గంధమేచె
ఎడద వైజయంతిని వీడి భృంగములవి
తిరుగుచున్నవి శిరసుపై, జిలుగు మీర
గుఛ్ఛకముతోను  జేసిన గొడుగు  వలెనె. (14) 
 (గుఛ్ఛకము = నెమలిపురి)
 ఆ. సురభిళ సుమమాల సోయగమ్ముల వైజ
యంతిగ గులికెడిది హంసు నెడద
హరి ముకుటముజేరి యలరారు నీ శిర
స్రజము వలన దాని జట్టి దరిగె

జట్టి= విలువ  తరుగు=తగ్గు   (15) 
......................

No comments:

Post a Comment