వేదాంత దేశికుల వారి' గోదా స్తుతి ' శ్లోకానుసరణ
ఆ. సురభిళ సుమమాల సోయగమ్ముల వైజ
యంతిగ
గులికెడిది హంసు నెడద
హరి ముకుటముజేరి యలరారు నీ శిర
స్రజము
వలన దాని జట్టి దరిగె.
జట్టి=
విలువ తరుగు=తగ్గు (15)
ఉ నీదగు
పూల మాలికను నెమ్మిని తా ధరియించె శౌరి, యా
నాద మదేమిటోయనిన నవ్య సుధా రస పాన మత్తలై
మోదముతోన తూర్యములు మోహన రీతుల నాలపించెగా
యాదర భావనమ్ము
గడు హంగుగ భృంగములన్ని గోదరో! (16)
ఉ. నాభి పరీమళమ్మగును
నవ్యత విశ్వము దీర్చు బుప్పొడిన్
శోభిలు బంకజమ్మునను,సోముని
సోదరి వక్ష గంధమున్
వైభవమందు వారిశుని
వత్సము, ఐనను నీదు దామ సం
శోభిత మాలికన్
శిరము వంచి ధరించు నిదేమి భాగ్యమే !! (17)
ఉ. నీదగు యంగ వస్త్రమును, నీదగు మౌళిని గుల్కు మాలికన్
నీ దయచేసినంత
గడు నీమముతోడను స్వీకరించి నీ
నాధుడు శీర్ష
దేశమున నౌదల దాల్చుటదేమి భాగ్యమో,
తా ధన భాగ్య
సంపదల ధారుణి నేలెడి యోగ్యుడాయెగా. (18)
ఆ.
సర్వ గంధుడనును సర్వ శ్రుత్యంతము
నీదు రుంగు కురుల నీటుదనము
పరిమళమ్ములీను
బ్రసవమాలల చేత
మించు సుఖములందె
మేలు వేల్పు. (19)
ఆ.
ధన్యమాయెనమ్మ ధర్మి మూర్ధమ్ము
నీ
కబరి విరులమాల
కాయ్వు దాల్చి
ప్రేమ మీరు నీదు
క్రీగంటి చూపుల
నీలి కల్వ మాల
వోలె దాల్చు. (20)
No comments:
Post a Comment