Sunday, 24 December 2017

కం.  శ్రీకరమగు శోభలతో
శ్రీకాంతుని జేరితీవు శ్రీ గోదా ! యా 
శ్రీకరు  తిరు  గీతమ్ముల      
శ్రీ కమలములందు  బూన్ చి  శేముషితోనన్...
..................
తే. విష్ణు చిత్తులవారిదీ  విరుల తోట
జిష్ణు మది దోచి నట్టి సంజీవ శక్తి
విమలమైనట్టిదా దివ్య వినయ శోభ 

అనుసరణ సుఖమున  దక్కునమృత పదము.....


మత్తేభవిక్రీడితము
పెరియాళ్వారుల వంశ నందనవుగా వీవేగదా గెల్చితే
హరి హృత్ చందన వృక్ష  కల్ప లతికై, యా లక్ష్మి రూపమ్ముతో
వరకాంతా సమ కారుణీ గుణముతో భాసిల్లు గోదా ! నినున్
శరణంబంటిననన్య భక్త   హృదితో, సౌజన్యమున్ బ్రోవవే.  (1)
ఉత్పలమాల
ఆగమ వ్యాఖ్యలౌ నజయ మా  మహిమన్ బొగడంగ సాధ్యమే ?
నీ గరిమన్ నుతించదగు నెయ్యపు నావగు వ్యాఖ్యలున్నవే?
నీ ఘన దివ్య భవ్యమగు  నెయ్యము వంటి గుణంబులే ననున్

వేగిర పెట్టుచున్నవిట,వీడుము మౌనమటంచు  దల్లి  రో !!! (2)

No comments:

Post a Comment