. .
తోరణమ్ములు ధ్వజములతొ బంధురమ్మౌ తిరుమాళిగే గా ,
రారె, ఇది మన నందగోపుల వారి
నవ్య నివాసమేగా.
'నంద నాయకు కోవెలను సానందముగ గాపాడు దేవా!
అందమౌ మణి ఖచిత ద్వారపు
యంత్రమును దయ దెరువలేవా?'
'హితముగాదుగ రాత్రులం,'దా హేతువులు మేమెరుగమయ్యా'
'ఇతము?' ' వెన్నుడు నోము
సాధనలిత్తు రమ్మని బిలచెనయ్యా'
'పవలు రాగదె?' ' వెంబడించెను పలుగు నిన్ననె దీసుకొమ్మని
యవన శత్రుని లేపవచ్చితి మీవు బీగముదీయు గరుణను'. (16)
No comments:
Post a Comment