నీల మణి యో వ్రజ కిశోరా! నీకు సతత జయమ్ము గావలె,
వేళ మార్గళి, నోముకొరకై, వినుము, నుపకరణముల నీవలె,
పాల నురగల బోలు నీదగు పాంచజన్యము వంటి శుక్తులు,
నేల నింగిని మ్రోయు లాగున నీయగావలె జాల ఢక్కలు,
పాడగా గాయకులు గావలె పదుగురును బల్లాండు బాడను
దొడ్డవగు దీపములు ధ్వజముల దోడు నితర వితానమునులును
నీవెగా వటపత్రశాయివి, నీదు లీలలు దెలియు, బాగుగ,
నీవె మా నోమునకు ఫలమవు, నీదు కృప నీడేరు, వేడగ. (26)
No comments:
Post a Comment