- ఘటములందున క్షీర వర్షము, గయము ధేను హిరణ్య హర్షము
- పటుతరము విక్రమము నందుని వత్సుడవు నీదే ప్రకర్షము,
- స్థేమమే రూపమ్ము గాగా, శేషిగా వేదమ్ము పొగడగ,
- భూమమున నిట గోపకుల బెను పొలపముగ వెలిగితివి నిండుగ
- శాత్రవులు తమ బలము మరచిటు సరబడిని నీ రాక వేచిరి
- పత్రముల తాకిడికి నీ పస భయము చరణము శరణు వేడిరి,
- మాదు మనములు నీదు సద్గుణ మహమునకు శరణనుచునున్నవి
- నీదు గుణ గానమ్ము లోకము నెనరుతో దరియింపమన్నవి. (21)
No comments:
Post a Comment