హేమ కాంతులు
విరియు గృహమున ప్రమిదె కాంతుల వెలుగులందున
ధూమ సౌరభ శయ్య నిద్దుర
తొంగలించదు పగటియందున
మామ కూతుర!మాటలాడుము, మారుబల్కని
మరుమమేమే?
మా మనోరధ మెరగి
నీ మణిమయపు ఘటికను దెరువవేమే?
కరుణ తో మేనత్త!
తనయను గారవమ్మున నిదుర లేపుమ,
వెరపు తెలియని
అలసటా అది? పలుకలేనిద, చెవిటిదనమా?
మంత్రమదియా!
వినుమిదే, మా మాధవా! వైకుంఠ వాసా! (9)
No comments:
Post a Comment