గోసమెరుగని గొల్ల కులమున, గొమ్మరో! బంగారు దీవవె,
దాసులము శ్రీ కృష్ణునికి నీ దలుపునిపుడే దెరచి బ్రోవవె,
గోప కులమున బుట్టువారలు, గుశలురే గోదోహదమ్మున,
కోపుతో శత్రువుల మదమును క్రుంగదీతురు కదనమందున,
పాము పడగయె నీ నితంబము, వన మయూరివి నీవెగావే,
మా మనోరధమెరిగి మాధవు మాదు తోడను గలువ రావే
నీల మేఘుని నామమును విని,నీవిదే వత్తువనుకొంటిమె,
ఉలుకు పలుకునులేక శయ్యను , ఊరకుంటివిదేమి బీరమె? (11)
No comments:
Post a Comment