ఉత్పలమాల
నీదగు నాదు జీవితము,
నీదగు నాదు మనంబు, ధ్యానమున్,
నీ దయ లేనినాడు,
ప్రభు, నీరవ చాతక గీతి కౌదు, నీ
బోధనె నాదు సర్వ భవ మోహ విమోచన సూత్రమోమహా
వేద స్వరూప! దత్త
ప్రభు! వేగమె గావవె గోరి జేరితిన్.
తేటగీతి(పంచపాది)
చేతులారంగ దత్తు బూజింపరారె,
నోరునొవ్వంగ బ్రభు కీర్తి నుడువరారె,
తలచి దలవంగ నంతటే దయనుగురియు,
మువురు దైవత రూపమై మోక్షమిచ్చు
దత్త స్వామిని గొల్వరే దత్త మదిని.
No comments:
Post a Comment