సంధ్యాసమయము
అందముగా నటు
విరిసిన నింగిని జూడవటే!
నింగిని విరిసిన
రంగుల గనియెడి
ప్రమధగణమ్ముల హ్లాదమదే!
తమ స్వామిని దర్
శించి, తరించి,స
మంచిత మనముల దూలుటకై
జయ జయ జయ హే
స్వయంభువా! యని
త్రిలోకములలో జాటుటకై,
అతల సుతల విత
ల,తలాతలముల
రసాతలము బ్రకటించుటకై
ఆ శితికంఠుని
స్తుతించుటకు సం
సిద్ధములాయెను జూడగదే!
సకల చరాచర
సుఖమును కొరకై
గరళము ద్రావిన సదాశివా!
అసురుల సంధ్యను
కుశలత నాట్య ప్ర
వంద్యగ నీవే మలచితివా!
No comments:
Post a Comment