నిన్ను లేపగ వచ్చినారము, నిజముగా కడు భాగ్య వతివే!
వన్నెలాడీ! నీదు భ్రాతయె వెన్నునికి ప్రియ సఖుడు గదవే!
ధవళ దోహజ ధారలందున దమము నిండిన నీదు దేహళి
కవల నిలచితి మిహిక ధారల,కనుల బ్రియ సఖు వలపు జావళి,
పలుకవెందుకె కలికి చిలుకా? వాజసుండన నీకు అలుసా?
వలపు దాచుట నోము కొరకా? ఫలము దక్కును మనకు దెలుసా?
పడతి సీతను యెగ్గు జేసిన పాప రావణు దునిమె రాముడు
గడియ దీసిటు రమ్ము రాముని కథను గానము జేతుమిప్పుడు.