సిసము:
ప్రతిదినమ్మీశ్వరా! ప్రణుతించవలె నిన్ను
కరుణ మనుజ జన్మ కాచు కొరకు,
సాహితీ సంస్కార సంపదన్ జెన్నొందు
తల్లిదండ్రుల సేవ దనరుకొరకు
చదువు సంగీతమ్ము సారస్వతములందు
కొసరు గల్గించిన గురువులకును
రస సమంచితములౌ రమ్య మార్గములందు
బాంధవము నునుచు బందుగులకు
...... తేటగీతి(పంచపాది)....
ఆరు రుతువుల నలరారు యవనిలోన
నారు రుచులతో నలరించు నమృత భుక్తి
సన్నిహిత శత్రువుల బోలు షడ్గుణముల
షోడషోద్దీపితములతో సోము వలెను
వెలుగు విరజిమ్ము మనికికి వినతులివియె..... .
................................................................................
No comments:
Post a Comment