Saturday 14 February 2015








.......వికసిత కమల.సరసిలో , వాడినా వీడని సురభిళ భరిత 'మరువం'            వనాలలో,
.......శారదాపూర్ణచంద్రికాదరహాసాలలో,. నీరద దర్శనానంద మయూర  నాట్యాలలో.
      మల్లికాప్రవల్లికా దరహాసకాంతులలో ..దర్శనమిచ్చేదట..
.......వీడిపోని ఆ అనురాగ బంధం..అంత అమలినంగా. ఆరాధనాభరితంగా ఉండేదట!!!
.......కాలం గడిచేకొద్దీ, అది కచ కుచ దర్శన భొగ్యంగా, 
.......చుంబన భాగ్యంగా,,  కాముక క్రీడా యాగంగా ప్రబంధాలకెక్కిందట! 
.......రాను రాను.. కైపెక్కిన మనోల్లాసంగా, క్షణికానంద సంధాయనిగా..
.......బాటల వెంట వేటగా, వయసేరుగని కలుషిత రుగ్మతగా,పత్రికలకెక్కిందట!   
.......మరి ఇప్పుడో!!!!! 
.......పార్కుల పొదరిళ్ళలో, 
.......పబ్బుల గమ్మత్తు మత్తుగా తూగుతూ, జోగుతూ,
..    .అలసి సొలసే వార్తగా దిగజారింది..
..     మన కళ్ళముందే ..
       బహురూపాలను, బహు వేషాలను మార్చుకుని
      చివరికి తనదైన అస్తిత్వాన్నే కోల్పోయిన 
..   .ఆ అనుభూతిని, 
..   .అక్షరాలలోతప్ప అంతర్గత నాదంగా వేదంగా,
      తిరిగి యెప్పుడు దర్శించగలం? ..
 ..........                                                                      .                          .పుట్టపర్తినాగపద్మిని......................




No comments:

Post a Comment