....
.
పల్లవి. చంద్రధరా! నీచల్లని కరుణే కురియును ఎపుదూ జగమంతా.
...... . మంత్ర తంత్రములకతీతమైన శక్తి నిండినద్ తనువంతా!
శివ శివ శంకర,భక్త వశంకర త్రిపురాంతక హే! పరమ శివా!
. చర 1...పితృరూపమున ప్రాణికోటినీ రక్షించేవూ దేవేశా!
మాతృరూపమున వాత్సల్యముతో పాలించేవూ నగవాసా..
శివశివ శంకర భక్త వశంకర నీలకంఠ హే పరమశివా!. .చంద్ర..
చర 2 భోగములొసగీ నిజ భక్తుల సుఖ యోగ మార్గమున నడిపేవూ
భస్మాంగునిగా అద్వైతమునకు అంతరార్థమును తెలిపేవూ
.శివ శివ శంకర భక్త వశంకర! జటాధరా హే పరమశివా!. .చంద్ర......
చర 3 ఒక పరి నామము తలచిన చాలూ సాయుజ్యమునే ఒసగేవూ
సహస్రాక్షునిగ జగతినేలుచూ చిదానందముగ నిలెచేవూ..
శివ శివ శంకర భక్త వశంకర! సనాతనా హే పరమశివా!!! చంద్ర..
రచన..పుట్టపర్తి నాగపద్మిని గానం సుప్రసిద్ధ గాయని కుమారి ప్రణవి
(శివనామమె మధురం ఆడియో చి.డి. కోసం)
No comments:
Post a Comment