ఆవకాయకు జై!!
సీస. ఏల నన్నయ కవి వెలిగి పోయె నపుడు
యీ లాటి రమ్యత ఇపుడు లే దె??
యేల తిక్కన పల్కు ఏలుగడ నిలిపె
మెండైన ద్వయ మైత్రి మేలు గాను
ఏల యెర్రన కది ఎరుక గా దె లి పెను
భారతమ్ము ను బూన్చు భావి పిలుపు?
క్రీడాభిరామ మ్ము శ్రీనాథ కవి యౌ గ
ఆతని దెలుగు చిందాట లా డె ??
తేట. చెప్పపని లేదు మర్మమ్ము చెలుడ! ఇపుడు!
పప్పు నేయితో మేళన బాగు సేసి
ఒప్పుగా వారు మాగాయి ఒట్టు బెట్టి
మెప్పులంది రి కైత కు మేడ గట్టి!! (2016)
No comments:
Post a Comment