ఓరి నీ పాసుగూలా?
ఇది అయ్య నోటినుండీ చాలా యెక్కువగా వినిపిస్తూ ఉండిన అచ్చమైన రాసీమ పదం. మా అక్కయ్యల పిల్లలు (కృష్ణప్రసాద్, శ్రీనిధి, రవికిషోర్, శ్రీకాంత్-వయసులవారీగా) తెగ అల్లరి చేస్తుంటే, ముచ్చటగా వాళ్ళను గద్దించేందుకీ మాట వాడేవారాయన! నీ బండబడ.. అన్నట్టు, ఇదికూడా ఒక పలుకుబడి అనే అనుకోవచ్చు. అసాధ్యుదివే అన్న అర్థంలో, అవతలి వారితో యెక్కువ చనువు వున్నప్పుడు, నవ్వుతూ అనేసుకునే మాటిది. కోపంలొనూ, అవతలివారి ధోరణి నచ్చకపోయినా, 'వాడి పాసు గూలా' అనికూడా, వాడటం కద్దు.
తనదగ్గరికి వచ్చే శిష్యుల మాటకరితనమో, అల్లరి కామెంటో నచ్చినప్పుడు కూడా అయ్య యీ ప్రయోగం చేసేవారు కూడా!
యీ మాటంటున్నప్పుడు అయ్య వదనంలో వెలిగే ముసి ముసి నవ్వుల వెలుగులిప్పటికీ గుర్తొస్తూనే వుంటాయి-కళ్ళల్లొ నీళ్ళు తెప్పిస్తూ!
యీ ప్రయోగం గురించి పదకోశం యేమంటుందంటే,
ఏపు, శక్తి. [నెల్లూరు]
నీ పాసుగాల; -నీ పాసు పిల్లిబెరక అని తిట్టు.
No comments:
Post a Comment