ఆ చూపులు....
దూరమైన అమ్మ ప్రేమను వర్షిస్తాయి...
ఆ చూపులు....
కనుమరుగైన అయ్య అభ్యాస అలౌకికత్వాన్ని గుర్తుకు తెస్తాయి...
ఆ చూపులు....
చేజారిన ప్రణయ మాధురిని వెలికి తీస్తాయి...
ఆ చూపులు....
అర్ఢాంతరంగా ఆగిపోయిన రాగానుభవాన్ని కొనసాగిస్తాయి...
ఆ చూపులు....
సగం దాకానే నిండిన మధురానుభూతి పాత్రను పొంగి పొర్లేలా చేస్తాయి..
ఆ చూపులు....
పరమాత్మ కారుణీమంతమైన దృక్సీమల క్షితిజ సీమల అంచులవరకూ..
నన్ను చేరుస్తాయి....
అందుకే ....
ఆ చూపుల చల్లని నీడ నాకివ్వు..ఎప్పుదూ.... ..
..
No comments:
Post a Comment