Sunday, 19 May 2024


                                    ఆవకాయకు జై!!

    సీస. ఏల  నన్నయ కవి వెలిగి పోయె నపుడు 

                  యీ లాటి రమ్యత  ఇపుడు లే  దె?? 

        యేల తిక్కన పల్కు  ఏలుగడ  నిలిపె

                  మెండైన ద్వయ మైత్రి  మేలు గాను 

       ఏల  యెర్రన కది ఎరుక గా దె  లి పెను  

                భారతమ్ము ను బూన్చు భావి  పిలుపు? 

       క్రీడాభిరామ మ్ము  శ్రీనాథ కవి యౌ గ 

             ఆతని దెలుగు చిందాట లా డె ??

      తేట.    చెప్పపని  లేదు  మర్మమ్ము  చెలుడ! ఇపుడు! 

          పప్పు నేయితో మేళన  బాగు సేసి   

          ఒప్పుగా వారు మాగాయి  ఒట్టు బెట్టి 

          మెప్పులంది రి కైత కు మేడ గట్టి!! (2016)

   



   

   





                           సిసము:

ప్రతిదినమ్మీశ్వరా! ప్రణుతించవలె నిన్ను

  కరుణ మనుజ జన్మ కాచు కొరకు,

సాహితీ సంస్కార సంపదన్ జెన్నొందు 

   తల్లిదండ్రుల సేవ దనరుకొరకు

చదువు సంగీతమ్ము  సారస్వతములందు

   కొసరు గల్గించిన  గురువులకును

 రస సమంచితములౌ రమ్య మార్గములందు

 బాంధవము   నునుచు  బందుగులకు   

              ...... తేటగీతి(పంచపాది)....

ఆరు రుతువుల నలరారు యవనిలోన    

 నారు రుచులతో నలరించు నమృత భుక్తి  

 సన్నిహిత శత్రువుల బోలు షడ్గుణముల

షోడషోద్దీపితములతో సోము వలెను 

 వెలుగు విరజిమ్ము  మనికికి  వినతులివియె..... .

................................................................................

   



             









                           



              


                              



 

                                        అమ్మాయిల దినోత్సవమా !!

ఎడద ద్రవించిపోయినదదెందులకన్నను యేమి సెప్పుదున్, 

కడలిని మించిపోయినది గన్నుల నిండిన శోకధార,యీ

వడలిన మోములందవిగొ, భాసిలు  నవ్వుల పువ్వులేవిధిన్     

వడలక జీవయామినిని బాంధవ   ధారల నింపునో ప్రభూ! 

సడలని సాహసమ్ము మరి సత్వ సమాజము నిమ్ము వారికిన్.

                             మరి ఆ మనోవైకల్యం లేని సమాజం యెప్పుడొస్తుంది?



 మల్లె పూవుల సౌరు, మామిడి రుచులతో

  మనసును దోచెడి మధుర భాష,

నిండు పున్నమి కళ నిర్మలత భువిని, 

  నిర్నిద్ర సౌమ్యతన్ నింపు  భాష,

పసిడి  వన్నెల పచ్చ  పచ్చగ  తళుకారి 

పదహారు వరహాల దనరు భాష,

పద్యమై గద్యమై పలు రీతులను విస్త

  రిల్లుచు వర్ధిలు   ఋషుల భాష

తెలుగు నా భాష, నా శ్వాస తెలుసుకోర !

తెలుగు నా గర్వమని నీవు తెలుపవేర !   

తెలుగు పర్వమ్ము  అవనికే  తేజమనుచు  

 తెలుగు రాయడే తెలిపెరా తెల్లముగను.

అందరికి మాతృభాషా దినోత్సవ శుభాభివందనలు..





















 సీ...వర్ధిల్లు గాక నీ వసుధపై  కవిత మా

 హాలికుని కనుల యాభ  గుర్వ

పెంపారు గాక నీ విపులపై కవిత మా 

 శ్రమ జీవి సంతోష చయము బొంద

పల్లవించునుగాక ప్రభలతో కవిత మా 

 చేనేత మగ్గాల జేవ విరియ 

బలుపెక్కవలె గవి భాగదేయమ్ము మా

 గ్రామీణ విద్యల గారవింప 

 .తే...గగన వీధుల  పూర్ణిమ  కాంతులట్లు,

సకల సౌభాగ్య దీప్తుల  సారమెరిగి ,  

ద్వేష భావమ్ము విడనాడి విశ్వమంత

వెల్గు తరి గదా కవితలై బిలచు ప్రకృతి !!!

ప్రపంచ కవితాదినోత్సవమీరోజు !!!! హార్దిక శుభాకాంక్షలు.....!