మల్లె పూవుల సౌరు, మామిడి రుచులతో
మనసును దోచెడి మధుర భాష,
నిండు పున్నమి కళ నిర్మలత భువిని,
నిర్నిద్ర సౌమ్యతన్ నింపు భాష,
పసిడి వన్నెల పచ్చ పచ్చగ తళుకారి
పదహారు వరహాల దనరు భాష,
పద్యమై గద్యమై పలు రీతులను విస్త
రిల్లుచు వర్ధిలు ఋషుల భాష
తెలుగు నా భాష, నా శ్వాస తెలుసుకోర !
తెలుగు నా గర్వమని నీవు తెలుపవేర !
తెలుగు పర్వమ్ము అవనికే తేజమనుచు
తెలుగు రాయడే తెలిపెరా తెల్లముగను.
అందరికి మాతృభాషా దినోత్సవ శుభాభివందనలు..
No comments:
Post a Comment