పంచ కూపములతో బగబూనినది జగము,
పంచ క్లేశములెపుడు బచ్చెకాడులె నిజము,
పంచ దపములు జేసి, బరిణతిని గోరితిని,
పంచ కృత్యముల నీ పంచ నే జేరితిని
పంచ కోశములందు పంచముఖ !నిలువరా!
పంచ తన్మాత్రలను పచరింప గోరుదుర!
పంచ తత్వపు గంధ పరిమళము నలదేన?
పంచ కల్ప కుఠార ప్రసవ మాలిక దేన?
ఆడులే పరమాత్మ, పాడులే ప్రతి యాత్మ,
ఆడులే పరమాత్మ, పాడులే ప్రతి యాత్మ.
....................
No comments:
Post a Comment