అసురులే నీ గణములాదిశబరుడవీవు, మసి యెపుడు ససి నీకు మలహరుడవే నీవు,
మానవ కపాలములు మరుమల్లె దండలుగ, పానమనగా గరళ పానమే ప్రాణముగ
పెనుమసనమే నీదు పెద్ద నుదవసితముగ ఘనమైన తుహిన శృంగములె నీ భూములుగ అహితముల వేడుకను అణచివేసెదవీవు,
మహిని శుభములనింపు మహదాశయమ్మీవు
పాడునా పరమాత్మ, ఆడులే ప్రతి యాత్మ..
పాడులే పరమాత్మ, ఆడులే ప్రతియాత్మ..
నీ దృష్టి యొకసారి నిటలాక్ష! యీరెండ, నీ దృష్టి మలిసారి, నీలగళ! నీరెండ, నీ దృష్టి యౌనులే నింగిసిగ! లేయెండ నీ దృష్టి జార్చులే ,నెలతాల్పు! చలియెండ నీ దృష్టి వేయులే నెలదారి! చురుకెండ, నీ దృష్టి బేర్చులే నిండారు పొడియెండ, నీ దృష్టి గురియులే నాదుపై మిడి యెండ నీ దృష్టి కొందరికి నీయులే మూగెండ పాడులే పరమాత్మ ఆడులే ప్రతియాత్మ పాడులే పరమాత్మ ఆడులే ప్రతియాత్మ