అసుర గుణ చయములవి జేసినవి హుంకృతులు
విసరముల శృతులలో వినవచ్చె ఝంకృతులు
తొలగించగా నంది దోసిట నహంకృతులు
వెలిగినవి హృది వేల్పు వేల
శిఖరాకృతులు
మ్రోగిన వనేకములు రాగముల సంస్కృతులు
యోగి సంసర్గమున యాగ వైభవ కృతులు
పుడమి నిండిరి శివా పురరిపుల స్వీకృతులు
బడబానలము త్రాగు, భర్గుని కలంకృతులు
No comments:
Post a Comment