Thursday 18 February 2016





మా ఇంట్లో వకుళ పుష్పం:
వుఅహ పడలంతరోఇణ్ణఅఅ తంతుద్ధ పాఅ పడి లగ్గం

దుల్లక్ఖసుత్త గుత్థెక్క బవుల కుసుమం వ మక్కడఅం...(1-63) (పాలితస్స)

కనిపించని దారములను పట్టుకుని వ్రేలాడూ, పైకి కాళ్ళను నిగిడ్చి, నిలదొక్కుకుని వున్న యీ సాలీడును చూడు. చాలా కష్టపడి మాత్రమే చూడగలిగే దారంతో (చాలా నాజూకైన) కట్టబడివున్న వకుళ పుష్పం వలెనే కనిపిస్తున్నది. (పాలితుడు)

యీ సాలెపురుగును మా పెరడులో చూడగానే, ఠక్కున యీ గాధ గుర్తుకొచ్చిందండీ! ప్రకృతిలో దేన్ని చూసినా, అందంగా లేదా ఆర్ద్రంగా స్పందించే ఆనాటి గాధాకారులే మనకంటే చాలా నయమేమో అనికూడా అనిపించింది. ఇలాంటి చిన్నవైనా మనోహరమైన అనుభూతులకు రొజు రోజుకూ దూరమైపోతూ,ఎవరిది వారిదే ఐన స్వార్థమనే సాలెగూటిలోనే జీవితం వెళ్ళదీస్తున్న మన జీవితాలు నిస్సారంగా అనిపిస్తున్నాయి రోజు రోజుకూ....యేమంటారో మీరు మరి...!

No comments:

Post a Comment