ధారావర్ధిత దీక్షా
పారమ్యత నీదు ధ్యేయమనవరత ధరా
ధీరమ్యత తవ పద మన్
జీరము కావలెను సదా సన్నుత పాత్రా!
ఆలోచనమ్మున నిగూఢతయె నీ యెరుక,
ఆలోకనమున హృది మమత యెరుక,
ఆలాపనమున రమణీయ తన్మయతెరుక
ఆలేఖనమున నైతికతె యెరుక,
ఆల ఉన్నత పదము క్రీడలందున ఎరుక,
ఆలంబనమున హృది మమత ఎరుక
ఆలసింపకుమెపుడు ఆప్త వాక్యమునందు,
ఆలోలిత మనమ్ము ఆర్తి యందు,
ఇట్టి సంపూర్ణ శొభలే నీకు రక్ష,
ఎట్టి కళలోన మార్గమును వీడకమ్మ!
ఎట్టి హేలకున్ లోలుపత చూపబోకు,
పట్టి,నీవె కావలెనమ్మ భరత దీప్తి!
...........
No comments:
Post a Comment