Friday, 27 February 2015
Tuesday, 24 February 2015
Monday, 23 February 2015
Sunday, 22 February 2015
Friday, 20 February 2015
Thursday, 19 February 2015
Wednesday, 18 February 2015
Tuesday, 17 February 2015
....
.
పల్లవి. చంద్రధరా! నీచల్లని కరుణే కురియును ఎపుదూ జగమంతా.
...... . మంత్ర తంత్రములకతీతమైన శక్తి నిండినద్ తనువంతా!
శివ శివ శంకర,భక్త వశంకర త్రిపురాంతక హే! పరమ శివా!
. చర 1...పితృరూపమున ప్రాణికోటినీ రక్షించేవూ దేవేశా!
మాతృరూపమున వాత్సల్యముతో పాలించేవూ నగవాసా..
శివశివ శంకర భక్త వశంకర నీలకంఠ హే పరమశివా!. .చంద్ర..
చర 2 భోగములొసగీ నిజ భక్తుల సుఖ యోగ మార్గమున నడిపేవూ
భస్మాంగునిగా అద్వైతమునకు అంతరార్థమును తెలిపేవూ
.శివ శివ శంకర భక్త వశంకర! జటాధరా హే పరమశివా!. .చంద్ర......
చర 3 ఒక పరి నామము తలచిన చాలూ సాయుజ్యమునే ఒసగేవూ
సహస్రాక్షునిగ జగతినేలుచూ చిదానందముగ నిలెచేవూ..
శివ శివ శంకర భక్త వశంకర! సనాతనా హే పరమశివా!!! చంద్ర..
రచన..పుట్టపర్తి నాగపద్మిని గానం సుప్రసిద్ధ గాయని కుమారి ప్రణవి
(శివనామమె మధురం ఆడియో చి.డి. కోసం)
Saturday, 14 February 2015
.......వికసిత కమల.సరసిలో , వాడినా వీడని సురభిళ భరిత 'మరువం' వనాలలో,
.......శారదాపూర్ణచంద్రికాదరహాసాలలో,. నీరద దర్శనానంద మయూర నాట్యాలలో.
మల్లికాప్రవల్లికా దరహాసకాంతులలో ..దర్శనమిచ్చేదట..
.......వీడిపోని ఆ అనురాగ బంధం..అంత అమలినంగా. ఆరాధనాభరితంగా ఉండేదట!!!
.......కాలం గడిచేకొద్దీ, అది కచ కుచ దర్శన భొగ్యంగా,
.......చుంబన భాగ్యంగా,, కాముక క్రీడా యాగంగా ప్రబంధాలకెక్కిందట!
.......రాను రాను.. కైపెక్కిన మనోల్లాసంగా, క్షణికానంద సంధాయనిగా..
.......బాటల వెంట వేటగా, వయసేరుగని కలుషిత రుగ్మతగా,పత్రికలకెక్కిందట!
.......మరి ఇప్పుడో!!!!!
.......పార్కుల పొదరిళ్ళలో,
.......పబ్బుల గమ్మత్తు మత్తుగా తూగుతూ, జోగుతూ,
.. .అలసి సొలసే వార్తగా దిగజారింది..
.. మన కళ్ళముందే ..
బహురూపాలను, బహు వేషాలను మార్చుకుని
చివరికి తనదైన అస్తిత్వాన్నే కోల్పోయిన
.. .ఆ అనుభూతిని,
.. .అక్షరాలలోతప్ప అంతర్గత నాదంగా వేదంగా,
తిరిగి యెప్పుడు దర్శించగలం? ..
.......... . .పుట్టపర్తినాగపద్మిని......................
Friday, 13 February 2015
Wednesday, 11 February 2015
Saturday, 7 February 2015
Friday, 6 February 2015
Thursday, 5 February 2015
Tuesday, 3 February 2015
Monday, 2 February 2015
Subscribe to:
Posts (Atom)