వేదాంత దేశికుల వారి' గోదా స్తుతి ' శ్లోకానుసరణ
........................
ఉ. కైటభ వైరి నీదు
ప్రియ కాంతుడు మెచ్చెడు రీతి భాషయున్,
తేటగ నాదు వాక్కునను దేవ పరిత్రము నింపుజేసియున్
దీటగు రత్న కింకిణుల దివ్య ధ్వనీ సమ శబ్దమర్థముల్,
మాటల నేర్పు దల్లి, దయ, మామక స్తోత్రమునందు పూన్చుమా !! (3)
..................
కం. గోదా
! నీ
రచనల సిరి
యా దామోదరుని లీల యమునన్ దడవెన్
రాదా, గురు
కృప, మధురస
గాధా యుత
ప్రజ్ఞ, నీదు
గరుణన్, కవులన్.
(4)
........................
చంపకమాల (సరసీ)(పంచపాది)
పరమునొసంగి
బ్రోచు దన భక్తుల నక్షరుడంద్రు గాని
దన్
పరమని
దల్చనట్టి మము బాళిని బ్రోచు
ముకుందుడేలనన్
దిరమగు
రీతి నీ కురుల దీర్చిన
మాలల గట్టివేసి బల్
సురసపు
గీత మాధురిని సూరిని నీ దెస దిప్పికొంచు,
నీ
దరి తరి జేరినట్టి మము
తాలిమి బ్రోవన బ్రోవకుండునా? (5)
.........................
చంపకమాల (సరసీ)(పంచపాది)
అధరములందు
రక్తిమను గాంచిన
యౌనగు శోణ
హ్రాదినీ
సుధ,
మరి గుబ్బ జన్నులను జూచిన
యౌనగు తుంగభద్ర, వాక్
సుధ లను దోచు శాబ్ది
గను, శుద్ధ రసామృత
భావనమ్మునన్
మథనము
జేయనౌ విరజ
మాతయె, 'గోద' 'స్వ'
భావమమ్మ, నీ
మధు మధనమ్ము తోన
యజమానుని సద్మపు
నర్మదౌదువే. (6)
......................