కార్తీక మాసం అనగానే ముందు గుర్తొచ్చే మాటలు రెండు. కార్తీక సోమవారాలూ, శివాలయ సందర్శనం
ఇంకా వనభోజనాలూ!మేము చిన్నప్పుడు కడప మోచంపేటలో ఉన్న బాడుగ ఇంటి యజమానురాలు గుడిపాటి అవ్వ.(ఆమె అప్పటికి పండు ముసలావిడెమీ కాకపోయినా ఆమెనలాగే పిలిచేవాళ్ళందరూ.) వాళ్ళు స్మార్తులు. పాపం ఆమె బాల వితంతువు.తెల్లటి తెలుపూ, కను ముక్కు తీరు బాగుండేదామెకు ..కానీ క్రమం తప్పకుండా పాపం నెలకో రెణ్ణెల్లకో ఓసారి వెనుక వాకిటివేపు మంగలివాణ్ణి పిలిపంచుకుని శుభ్రంగా గుండు కొట్టించుకునేది. నాకైతే, భలే జాలి వేసేదామెను చూస్తె అప్పుడే!
ఆమె యెందుకలా చేసితిరాలో తెలీని వయసు మరి..అసలు సంగతి ఇది. కార్తీక మాసంలో ఆమె మమ్మల్ని వనభోజనానికి బయల్దేరదీసేది. (మా కుటుంబమె కక, ఇంకా యెవరెవరు వచ్చేవాళ్ళో గుర్తు లేదు మరి..) కడపకు దగ్గర్లో ఓ పదో పన్నెండో మైళ్ళ దూరంలో పాలకొండలు అని కొండలుండేవి. (ఇప్పుడున్నాయో లేదో మరి..) తెల్లవారుఝామునే యెద్దుల బండిలో వంటసామానులు వేసుకుని బయలుదేరేవాళ్ళం, అమ్మ, మా తులజక్కయ్యా, మా అరవింద్ అన్నయ్యా, నేనూ.అయ్య వచ్చిన జ్ఞాపకమైతే లేదెందుకో! (మా చిన్న చెల్లెలు రాధ అప్పటికి పుట్టలేదనుకుంటా) పల కొండలు అని ఆ కొందలకు పెరెందుకు వచ్చిందో తెలీదుకనీ,వెళ్ళే దారంతా పచ్చటి పొలాలూ చిక్కటి చెట్లూ....ఆవ పొలాలో మరేవొకానీ ఆ పువ్వుల పచ్చదనం ఇప్పటికీ నా కళ్ళల్లో మెదులుతూనె ఉంటుంది. యెగుడు దిగుళ్ళతో కూడిన బాట! కొండ దగ్గరికి రాగానే పరుగులు పెడుతూ పైకెక్కే పోటిలు...ఆ కొండలలో ఒక మోస్తరు పైకి వెళ్ళగానే, అక్కడేదో గుడి ఉన్న జ్ఞాపకం. దగ్గరలోనే ఒక చిన్న నీటి మడుగు..అందులో తెల్లని తామర పువ్వులూ..చిన్న చేప పిల్లలూ..గట్టునుంచీ నీటిలోకి యెగిరెగిరి పడే కప్పలూ..అప్పుడప్పుడూ వినిపించే పక్షుల సందడీ .కాస్త దూరంలొ చెట్ల నడుమ ఒక శివలింగం..మా గుడిపాటి అవ్వా, మ అమ్మా కలిసి శ్రద్ధగా మడి కట్టుకుని వంట చేసెవాళ్ళు. . ఆ నీటి మడుగులోని తామర పువ్వులు తెచ్చి శివునికి పెట్టాలని పిల్లలంతా పోటీ పడేవాళ్ళం కూడా! ఆ శివలింగం దగ్గర నైవేద్యం పెట్టి భక్తిగ నమస్కరించేది గుడిపాటి అవ్వ.. (పాపం యేమని మొక్కెదో మరి) మేమైతే కొండ యెక్కటం,
దిగటం..ఇదే ఆట! ఆపై, యెప్పుడెప్పుడు నైవేద్యలవుతయా
అని యెదురు చూపులు! మొత్తానికి, మా వెంట తెచ్చుకున్న విస్తరాకుల్లొ వేడి వేడి అన్నం, చక్కెర పొంగలి, కారిపోతుందేమోనని భయంతొ ఒడిసిపట్టుకునె సాంబారూ, చారూ, నీళ్ళ మజ్జిగా..భలె రుచిగ
ఉండెవా వంటకాలన్నీ ! సాయంత్రం దాకా అలా ఆడుకునీ పాడుకునీ చికటి పడకముందే బయలుదేరి, రాత్రి యే యెనిమిదింటికో ఇల్లు చేరేవాళ్ళం...తిరిగి వచ్చేవేళలో, ఆ యెద్దుల బండి, చప్పుడూ,, యెద్దుల మెడలొ గంటల గణగణలూ, పొడవాటి పడమటి నీడలూ..ఇవన్నీ నా చిన్ననాటి కార్తీక వనభోజనాల అందమైన పచ్చ పచ్చని జ్ఞాపకాలు మరి!.......
No comments:
Post a Comment