నా జ్ఞాపకాల సొరుగులో అరుగులు - 2
నాకు అరుగుల నేపథ్యంలో కొన్ని చక్కని జ్ఞాపకాలే ఉన్నాయనిపిస్తున్నది -
ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ! కడప మోచంపేట విశ్వేశ్వరాలయం
ఉన్న వీధిలోకి మారినప్పటి జ్ఞపకాలూ చక్కనివే..ఉత్తరముఖంగా, వీధీ
చివరగా ఉన్న ఆ ఇంటికి పెద్ద పెద్ద అరుగులే ఉండేవి.(మా ఇంటికీ ఆనుకుని
ఒక పాడుపడిన ఇల్లుండేది. ఆ ఇంటివైపుచూడాలన్న భయపడి చచ్చేదాన్ని.)
నా చిన్నప్పుడు, మా ఇంటికి, బూచివాడులాగే గొంగడి కప్పుకున్న
కనికట్టు కళాకారుడొచ్చేవాడు. మా అయ్యగారికివన్నీ సరదాలు మరి.
అతనొచ్చినప్పుడు, అ వీధి పిల్లలంతా మా ఇంటి అరుగులపై మూగేవారు.
అతను, తన కనికట్టుతో, గవ్వలు ఆడిస్తూనే, క్షణాల్లో మండ్రగబ్బలు
సృష్టించేవాడు. అవెలా వచ్చేవో ఆశ్చర్యమే మాకంతా ! వాటిని చూసి
తెగ భయపడిపోయి, ఒకరి పై మరొకరు పడిపోవటం ! అంతలోనే
అవి మాయమైపోయి, పూలు వచ్చేసేవి.. మళ్ళీ తేళ్ళు కూడా ! అమ్మో!
ఎంత థ్రిల్లింగో ! అప్పుడు నాకు 10 లేదా 11 సంవత్సరాలుంటాయేమో !
ఇంకా యేవేవో చేసేవాడు కానీ, ఇదైతే అలా ముద్ర వేసుకుని కూర్చుంది
నా మనసులో ! అతనికి అయ్య శాలువా కప్పి, బియ్యం, బట్టలూ
కూడా ఇచ్చేవారని గుర్తు...యీ నా జ్ఞాపకం యెలాఉందో మీరే చెప్పాలి
మరి....మీలో మరికొందరికీ ఇలాంటి జ్ఞాపకాలు ఉండవచ్చు కూడా!
యేదో సరదాకి ఇలా పంచుకోవటం !

No comments:
Post a Comment