Saturday, 31 January 2015

Wednesday, 21 January 2015

...మాయ...
నిద్ర లేచింది మొదలు,
గంటలనుండీ,సెకన్లుగా విభజింపబడుతుంది జీవితం..
ఆ తరువాత..
పరుగుల వరదలా,
మొగమాటపు నవ్వులుగా,
బలవంతపు సంభాషణలుగా,
కృత్రిమ దరహాసాలుగా,
ప్రాణాలు లేకున్నా, ప్రాణాలు పిండేసే ఫైళ్ళుగా,
రుచి ఉందని భ్రమింపజేస్తూ, పచి అసలేలేని అల్పాహారాలుగా,
వేడిగా, వడి వడిగా లబ్-డబ్ లను పరుగులు పెట్టించే 
వేడి వాడి పానీయాలుగా,బహురూపిగా మారి,
చివరికి 
సాయంత్రానికి ..
,,,,చివరికి 
సాయంత్రానికి ..
 పిండేసిన చెరుకు  ముక్కలా ఇంటికి చేరుకునే జీవితం..
చిన్నారీ!!!
నిన్నోసారి స్పర్శించి,
నీ దరహాసామృతాన్ని గ్రోలగానే..
చిక్కటి పెరుగులోంచీ అప్పుడే తీసిన వెన్న ముద్దలా..
తేనెలో వూరిన పనస తొనలా..
చవులూరిస్తుంది..
నువ్వెంత మాయగాడివి!!!!! .....





Friday, 16 January 2015

'Meghadutham' of Dr.Puttaparthi-Drusya sravya malika -9-(poduvo em0)

హేమంత ఋతువునందున, సీమంతిని పృకృతికాంత మోదముతోనన్.
చేమంతులు, బంతుల పూబంతులతో మురిసి విరిసె, చూడగరారే..
రంగవల్లికలతో అలరారు ముంగిళ్ళ అరుదెంచుచున్న హేమంతలక్ష్మి
పదస్పర్శకై తనిసి పూల దోసిళ్ళతో నేలవ్రాలెనొ యేమొ కీరపంక్తి..
రాయంచ కులుకు నడకల రాచరికపు ఠీవి తోడ రసరమ్యముగా
రాకాశశివదన సుధా సాకారతనొందె రమణి హేమంతమునన్..
కన్నెగొంతుల మధురమౌ గీతములను, వన్నె తరుగని హరిదాసు గానములను,
పిన్న పాపల కేరింత గారములను, కన్నులారంగ వీక్షించె పౌష్యలక్ష్మి..
జున్ను పాల మీగడలంటి ప్రణయములను, వెన్ను దన్నుగానిలచిన పంటచేల,
మిన్నులంటెడు గిత్తల స్పర్ధ రొదల మనము రంగిల్ల ప్రేక్షించె పౌష్యలక్ష్మి..
గంగిరెద్దుల విన్యాసలాఘవముల రేగు పండ్లతో భోగి పేరంటములను,
అందచందాల బొమ్మల కొలువు చెలువు, డెందమున నిలిపి మురిసెలే పౌష్యలక్ష్మి....
               'డాక్టర్ పుట్టపర్తి నాగపద్మిని..2015 సంక్రాంతి 
  





  


..