Wednesday, 21 January 2015

...మాయ...
నిద్ర లేచింది మొదలు,
గంటలనుండీ,సెకన్లుగా విభజింపబడుతుంది జీవితం..
ఆ తరువాత..
పరుగుల వరదలా,
మొగమాటపు నవ్వులుగా,
బలవంతపు సంభాషణలుగా,
కృత్రిమ దరహాసాలుగా,
ప్రాణాలు లేకున్నా, ప్రాణాలు పిండేసే ఫైళ్ళుగా,
రుచి ఉందని భ్రమింపజేస్తూ, పచి అసలేలేని అల్పాహారాలుగా,
వేడిగా, వడి వడిగా లబ్-డబ్ లను పరుగులు పెట్టించే 
వేడి వాడి పానీయాలుగా,బహురూపిగా మారి,
చివరికి 
సాయంత్రానికి ..
,,,,చివరికి 
సాయంత్రానికి ..
 పిండేసిన చెరుకు  ముక్కలా ఇంటికి చేరుకునే జీవితం..
చిన్నారీ!!!
నిన్నోసారి స్పర్శించి,
నీ దరహాసామృతాన్ని గ్రోలగానే..
చిక్కటి పెరుగులోంచీ అప్పుడే తీసిన వెన్న ముద్దలా..
తేనెలో వూరిన పనస తొనలా..
చవులూరిస్తుంది..
నువ్వెంత మాయగాడివి!!!!! .....





No comments:

Post a Comment