Sunday, 8 June 2014





యే తెల్గు రుచులతో నిల సాటి రాలేక, ద్రాక్షతా నల్లగా మారిపోయె,
యే తెల్గు రుచులతో నిల సాటి రాలేక, శర్కరతా మారె కర్కశముగ,
యే తెల్గు రుచులతో నిల సాటి రాలేక, తేనె  తా కాషాయదీక్ష బూనె,
యే తెల్గు రుచులతో నిల సాటి రాలేక, చెరకక్కరకు రాని కరకునయ్యె ,
అట్టి తెలుగును నమ్మరా ఆంధ్ర వీర! యెంగిలైనట్టి  ఆ ఇంగిలీసు
వాడబోకోయి సోదరా వీడుమోయి, తెలుగు భాషయె మనముందు వెలుగు భూష!..
 ఆత్మీయ  మితృలారా! 2003లో జరిగిన 'అష్టావధాన సప్తాహంలో (21-2-2003 నుండి 27-2-2003 వరకు) వర్ణన లో నేను అడిగిన ప్రశ్నకు, సహస్రావధాని మాడుగులవారి పూరణ ఇది. జై నవ్యాంధ్ర!

No comments:

Post a Comment