Tuesday, 17 October 2017


సన్మిత్ర మండలికి దీపావళి హృత్పూర్వక శుభాకాంక్షలు...
......................
దీపావళి భావావళి  

ఉ. (మాలిక)  దీనత ధారుణీ జనులు దేవకులాన్వయ మౌళి  గృష్ణునిన్
దానవ బాధ బాపి  నిక  ధారుణి శాంతిని నిల్ప వేడనౌ
నా, నిక సంగరమ్మునను నారక దైత్యుని సం హరిం  నీ
వానతి నిచ్చి దీరవలె, భామనె గాను, సదా సుఖమ్ములన్
కానుక గాగ  నిచ్చెదను, కాముకు జంపెద, సత్య భామనే
నేయను  గేహినిన్ మిగుల స్నేహముతోడుత  శౌరి  జూచి, తా
నౌననె , మానినీ సమర నైపుణి  శోభల గాంచి ముగ్ధతన్..
 మత్తే.(పంచపాది)   సిరులన్ నింపెడు శోభలన్ గురియగా సేవించు నిల్లాలిగా,
పరువున్ నిల్పెడు  యోచనల్ విరియగా భావించు  సౌహృద్య గా (సౌహృద్యము - స్నేహము )
వెరపున్ జూపని కష్టకాలములలో  వేవేల  తా క్షాంతి గా (క్షాంతి...ధరిత్రి)   
మరపున్ జూపక వండి వార్చుటను మాతృ స్పర్శ తూగాడగా,
పురి విప్పున్ మది కోటి వీణలునుగా పూబోడి గాన్ పింపగా.
 మ.  నదులన్ జూడగవచ్చు నవ్యతనుగా  నారీ రమా దీప్తియున్ 
ముదమున్ గూర్చెడు బల్కు దేజియలుగా మోహంపు శ్రావ్యత్వమున్
పదమందున్ గురి దప్పనట్టి శుచియౌ వాతూల వేగమ్ముగా
కదలున్ గాదె సదా సుధామయము  సత్  గావ్యంబు రూపెత్తగా.. 
 కం. .కావలె బురుషుడు యోగిగ,
గావలె తా దక్షుడెపుడు, గావలె సఖుడున్,
గావలె దృప్తుడు రసనను,
గావలె బ్రేమైక  రామ, గరివేల్పుగనే. ( కరివేల్పు = కృష్ణుడు )
సీ.. అతివ  జూచినతోడ  యర్రులు జాచుచు  
    వెంటబడుట గాదె  వెకిలి  బుద్ధి?
ముగుద ముగ్ధత్వమ్ము  మోడు జేయగ జూచు  
    చాపల్యతే గాదె జ్యాని బుద్ది? (జ్యాని = హాని)
పుత్తడిబొమ్మను పురుష హుంకృతితోడ
   చిదిమివేయ దలచు జెడ్డ  బుద్ధి
సీమంతినీ కళా సేచనమ్మును గేలి
   సేయుట గాదొకో సెబ్బరమ్ము?  (సెబ్బరము=అపకారము)  
ఆ... జనులకెల్ల శుభము, సమ్మతమ్ము నిదియె,
సత్య ! నీవు నేడు సత్యముగను,
 నరకు నరకమునకు నరయగ జేయు మ
టంచు  సత్య, యామదించె వృష్ణి. ( వృష్ణి - కృష్ణుడు )
కం.  విల్లందుకొనియె భామిని
యుల్లంబున దనుజు దునుము యుత్సాహమునన్
ఫెళ్ళనె నింగిని పిడువులు
మల్లుడు నరకుడు యమపురి మార్గము నేగెన్
చం.  అమవస జీకటుల్ దొలగె, యంబుజ జ్యోత్స్నలు వెల్లువెత్తెఫా
లము , జిరు చెమ్మటల్ మెరవ,  రాగము తోనను గృష్ణు జూచి 'నా
కము చలమొందగా మిగుల గాంతుల నీ భువి శోభనొంద, దీ
పములను నింపు వేడుకను వాడుక జేయగ నెంతు నేననెన్.  .
  కం.   వెన్నెల వికసిం చెనుగా
కన్నుల నొక కాంతిరేఖ కదలాడగ యా
పన్నుల హృదయములందున
సన్నుత మతి ప్రేమతోన  సాయము  జేయన్.
కం.   మొదలాయెను దీపావళి,
సదమయమగు భావనమ్ము సాధనమున యా
విధులను మరువక యుండుటె
గద ! భారత  గౌరవమ్ము, ఘనమౌ రీతిన్.  
........................




No comments:

Post a Comment