నీలకంఠ దీక్షితులవారు (17 వ శతాబ్ది కి
చెందిన నీలకంఠ దీక్షితులు, అప్పయ్య దీక్షితుల వంశానికి చెందినవారు, మదురై తిరుమల నాయకుల
ఆస్థానంలో కొలువు. కామాక్షీ దేవి ఉపాసకులు. వారు చేసిన ఎన్నో రచనల్లో యీ రచన సుప్రసిద్ధం.
) తన 'ఆనంద సాగర స్తవం' లో శివలీలను వర్ణిస్తూ, ప్రదోషకాలంలో ఉమామహేశ్వర స్వరూపాన్ని ధ్యానించాలని మనకు గుర్తు చేసే ఈ శ్లోకం
లో అంటారు.....
సాధారణే స్మరజయే నిటిలాక్షి సాధ్య
భాగీ శివో భజతు నామ యశః సమగ్రమ్
వామాంఘ్రి మాత్ర కలితే జనని త్వదీయేభాగీ శివో భజతు నామ యశః సమగ్రమ్
కా వా ప్రసక్తి రపి కాలజయే పురారే!!
ఈ
శ్లోకార్థమిలా ఉంది. ' అర్థనారీశ్వర రూపంలో మూడవ నేత్రం మీ దంపతులకిరువురకు చెందినదే. కానీ కామ సంహార మూర్తి లేక కామారి అనే బిరుదు శివునకు మాత్రమే చెందుతుంది. తల్లీ ! యెందుకో నీకాఖ్యాతిని, గౌరవాన్ని తీసుకునే అవకాశం
ఇవ్వబడలేదు. మీరిరువురకు ఉమ్మడియైన ఒక వస్తువువల్ల ఒక కార్యం సాధించబడితే, దానివల్ల లబ్ధమయ్యే కీర్తి గాని, పేరు గాని యిరువురికి చెందవలయుగదా? కానీ యిక్కడ పరమేశ్వరునకే
ఇవ్వబడింది. అది అలా ఉండగా, కాలసంహారమూర్తి యనే పేరుకూడా ఆయనకే దక్కాలా? కాలుణ్ణి అనగా యముణ్ణి తన వామపాదంతో అణచాడు. వామపాదం నీకు సంబంధించినది. అయినా ఈ కీర్తి కూడా నీకు దక్కకుండా ఆయనకే సంక్రమిస్తుంటే, ఓ పార్వతీ ఎలా మిన్నకున్నావు?”
ఈ చమత్కార రచన ద్వారా పార్వతీ పరమేశ్వరుల మధ్య స్పర్థ సృష్టించటం కవియొక్క ఉద్దేశ్యం కాదు. ఆవిధంగా భక్తుల దృష్టిని అర్థనారీశ్వరుని వైపు త్రిప్పి ప్రదోష కాలంలో ఆ రూపాన్ని నిత్యం క్రమంగా వారిచే ధ్యానింప చేయటమే కవి స౦కల్పం. భగవంతుని యీ రూపంలో స్మరించిన ప్రతివాడూ కోరికలను జయించి పూర్వం కంటే సుఖతరమైన జీవితాన్ని గడపగల్గుతాడు.
.....................
NIlakantha dIshitulu of 17th century, (A court poet of Madhurai Tirumala Nayaka, and relative of Appayya Dikshitulu. An ordinent upasaka of Madurai Meenakshi) in his famous sanskrit work ''Ananda Sagara Stavam,says like this.
Sadharane smarajaye nitilAkshi sAdhya
bhAgI SivO bhajatu nAma yasa: samagram
vAmanghri mAtra kalitE janani twadIyE
kA vA prasaktirapi kAlajayE purArE..'
Meaning of this sloka is..' O Goddess Parvati ! The third eye in Ardha nareeswara image belongs to you and Siva equally. But the credit of Manmadha samhara is only credited to Siva. Siva uprooted the ego of Yama by crushing his neck with his vama pada (left foot) which belongs to you. But surprisingly, Yamaahankara damana is also only credited to Siva. Why this unquality? How you are tolerating this?
This is a vyaja nindaa sloka in which the quality of Siva and Parvati is being highlighted.