Saturday, 19 March 2016

maa ayyagaru: Dr KV Ramana Chary ,IAS Retd Advisor to Govt Relea...

maa ayyagaru: Dr KV Ramana Chary ,IAS Retd Advisor to Govt Relea...: Part 2 of the book releasing function of maa ayyagaru Dr.Puttaparthi Narayanacharya on 14th March 2016 at Telangana bhavan in the august ...

maa ayyagaru: Book Release of VIMARSA Tarangini of Dr.Puttaparth...

maa ayyagaru: Book Release of VIMARSA Tarangini of Dr.Puttaparth...: Part I  of the book releasing function of maa ayyagaru's VIMARSA TARANGINI in Telangana Bhavan, on 14th March 2014 in the august pres...

Tuesday, 15 March 2016

Monday, 7 March 2016



                                                               వజ్జలగ్గ లో శివ స్మరణ:

శాతవాహన చక్రవర్తి హాలుని గాధాసప్త శతి వంటిదే, శ్వేతంబర జైన ముని జయవల్లభుడు చేసిన యీ సూక్తి సంకలనం వజ్జలగ్గ. 'వ్రజ్య' అన్న సంస్కృత పదానికి 'వజ్జ' ప్రాకృత రూపం. గమనము, మార్గము అన్న అర్థలీ పదానికి వున్నా, కలాంతరంలో, వర్గము లేదా సమూహము అన్న అర్థం నిలచిపోయింది. జైన మునైన, జైన సంప్రదాయాలకంటే భిన్నమైన గాధలనూ ఇందులో జయవల్లభుడు చేర్చటం చూస్తే అతని విశాల దృక్పథం తేటతెల్లమౌతుంది.

రుద్ర పద్ధతిలో (606 నుండి 610 వరకూ వున్న గాధలలో)



' రఇ కలహ కువియ గోరీ చలణాహయ ణివణి ఏ జడాజూడే
నివడండ చందురుంభణ విలొలహత్థం హరం ణమహా
రతికలహంలో, గౌరిపదఘాతంవల్ల, జటాజూటం చెదరిపోవటంవల్ల, జారిపోతున్న చంద్రబింబాన్ని, సర్దుకుంటున్న శివహస్తానికి ప్రణామములు.
.................

పరిహసవసచోణకర కిసలయ రుద్ధణ యణ జుయలస్స,
రుద్ధస్స తఇయణయణం పవ్వఇ పరిచుంబియం జయఇ.
రతిసమయ పరిహాసంలో నిర్వస్త్ర ఐన పార్వతి, సిగ్గుతో తన పాణిపల్లవములతో యే శివుని రెండు నేత్రములను మూసి, మూడవ నేత్రమును చుంబించినదో, ఆ శివునికి నమస్కరించుము.
................

సంఝూ సమయే పరికువియ గోరియా ముద్ధ విహడణం
అద్ధుమ్మిల పలోయంతం లోయణం తం హరం నమహ
సంధ్యాసమయాన కోపించిన గౌరి మౌనాన్ని తన అర్ధనిమీలిత నేత్రములతో చేదించిన శివునకు నమస్కారము. (గాధాసప్త సతిలోనూ కాస్త భావసామ్యమున్న ఒక గాధ (1/1) గౌరి రోషారుణముఖ బింబం, సంధ్యోపాసన చేస్తున్న జలపూరిత అంజలియందు ప్రతిబింబిస్తున్న శివుని హస్తములకు నమస్సులు.)
...............

చందాహయ పడిబింబా ఇ జా ఇ ముక్కుట్ట హసబీయా ఏ
గోరీ ఇ మణ విహడ ఇ ఘడంత దేహం. హరం నమహ

యే శివుని ఉన్ముక్తాట్టహాసానికి , మల్లెపూవు వలె గౌరి భయపడినదో, లలాటస్థుడైన చంద్రునిపై గౌరి ప్రతిబింబము కనిపిస్తున్నదో, గౌరి కోపాన్ని తగ్గించే ప్రయత్నంలో లగ్నమైన ఆ శివునికి ప్రణామములు.
.............

నమి ఊణ గౌరి వయస్స పల్లవం లలియ కమల సర భమరం,
కయరఇ మయరంద కలం లలియముహం తం హరం నమత.
లావణ్య యుక్తమైన, గౌరి ముఖ కమలమును, చుంబింప యత్నిస్తూ, రతి రస లీలను అభ్యసిస్తున్న భ్రమర రూపుడు, శివునికి ప్రణామములు..
...............



My free verse poem in AKSHARA - March 2016 issue....

Wednesday, 2 March 2016

    అరుగంటే మదిలో శత కోటి దివ్వెల వెలుగు..
  గడచినట్టి రోజులతో అలుపెరుగని పరుగు..
  తేత తేట మాటలలొ నిస్తేజము కరుగు, 
  వామనగుంతల లిబ్బిని పొందిన ఆనందాలు,
  గచ్చన కాయల ఓడిన కన్నీటి చారికలు,
  తొక్కుడుబిళ్ళల ఆటల సేద తీర్చిన ధన్వంతరి,
  రావిచెట్టు కొమ్మల ఊయల  పాటల తేటగీతి,
  పాఠశాల గదుల్లో రెక్కవిప్పిన విజ్ఞానం, 
  ప్రపంచ తొలి వీక్షణాన కన్నులలొ తళతళలూ..
  పొడుగు నోటుబుక్కు అట్ట రంగుల మిలమిలలూ,
 వాననీటి వరదల్లో పరుగులిడిన పడవలూ,
  నింగిని తాకే ధైర్యం నింపిన బొమ్మ విమానాలూ,
  అలుపెరుగని  బాల్యానికి అందమైన తొలి మెరుగులు...
  అరుగంటే అరుగు కాదు..
  మనసున  ఆరని వెలుగు.
..
.......................