Thursday, 4 June 2015

    శతమానమ్ములు గావలె,
. ..సతతమ్మును శ్రావ్యముగను స్వరముల గొలిచెడి
    సతత బాలగంధర్వుడు, 
    శ్రీపతి పండితారాధ్య సుబ్రహ్మణికిన్..
స్వరములు యేడేయైనను
     రాగమ్ములు వేనవేలు రవళించినటున్, 
     గాత్రమునందున 'బాలు   ని , 
     ఘన రాజస దీప్తి దెరలు కంఠశతమ్ముల్....
  శ్రీమంతముగ సామవేదప్రణీతమౌ సరిగమలకును సాన పట్టువాడు,
  పండిత పుత్రుడై, పలుభాషలందున పాటవమ్మును గనిన యోగ్యుడతడు,  
  బాలుడై నిత్యమును గాంధర్వ విద్యను భాస్వర కిరణుడై యేలువాడు, 
  శుభయోగకరమైన  సుప్రభాతమ్ములను స్తోత్రగానములతో కొలచువాడు,
    మేటి మన బాల గాంధర్వుడితడు,  
    కోటి శతకొటి రాగాల కోటలోన   
    మాటకలికి దీవెనలతో రాణదీరి
    తేటి తీయందనమ్ముల దనరుగాత!
 (గానగంధర్వునిగా  గణుతికెక్కిన మన యస్పీబీ గారికి జన్మదిన  శుభాకాంక్షలతో... )



No comments:

Post a Comment