మిత్రులారా..
మనసంతా వేదనతో నిందిపోతున్నది- స్త్రీలపై దారుణాలు రోజు రోజుకూ పెరిగిపోవటం చూసి!!! మీడియాలోనూ ఇలాంటి ఘటనలనే మరీ మరీ స్పాట్లైట్ వేసి చూపిస్తున్నారు. ప్రచారమాధ్యమాలవల్ల, నిజమేమైనా వెలుగు చూసే అవకాశం ఉంటుందా అంటే, ఆ ఆశా, గాలిలో దీపమే! నేరస్తులు మరింత నేర్పుగా తప్పించుకునే మార్గాలు అన్వేషిస్తూనే ఉన్నారు, బైట పడుతూనే ఉన్నారు.మరి, యీ గడ్డ మీద స్త్రీకి బతికి బట్టగట్టే అవకాశం మృగ్యమవుతోందనే భావన కలుగుతోంది. మరి, స్త్రీలకు రక్షణ యెక్కడ ఉంటుందోనని మథనపదుతుంటే నా మనసిలా పలికింది, మరి మీరేమంటారు?
ఎచ్చోట మహిళను మాననీయగజూచు సత్సంప్రదాయవాటికలు గలవో,
ఎచ్చోట మహిళను మాననీయగజూచు సత్సంప్రదాయవాటికలు గలవో,
ఎచ్చోట అతివను అర్ధయంత్రముగానె పరిగణించని మానిసులుందురో,...
ఎచ్చోట నాతిని నరదృస్థి,భోగ వస్తువుగనే చూచు తప్పును చేయదో,
ఎచ్చోట రమణిని వంటింటి కుందేలు వని భంగపరచు అలవాటు లేదొ,
ఎచ్చోట నాతిని నరదృస్థి,భోగ వస్తువుగనే చూచు తప్పును చేయదో,
ఎచ్చోట రమణిని వంటింటి కుందేలు వని భంగపరచు అలవాటు లేదొ,
అట్టి ప్రాంతమున మానవతులెల్ల నెంతొ
తేట తెల్లముగ మనగలరు మన్ననలతొ,
పాటలావతిగ, శాబ్దిగా, పద్మగుణగ,
గీటురాయిగా నుతియించు జగము, నిజము...
No comments:
Post a Comment